శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Wednesday, 25 December 2013

ఇంట్లో రోజుకొక యూనిట్ విద్యుత్ పొదుపు చేయటం ఎలా?


ఈ క్రింది నియమాలు పాటించటం ద్వారా రోజుకొక యూనిట్ విద్యుత్ ఆదా చెయ్యవచ్చు .
1) పగటి వేళ  దీపాలు వెలిగించ వద్దు.     
2) గదిని వదిలినా,ఇంటిని వదిలినా దీపాలు,పంఖాలు ఆర్పి వెళ్ళండి. 
3) t.v,కంప్యూటర్,microvave ,వి.సి ఆర్ ,d.v.d వంటి వాటిని main switch  వద్ద ఆపండి .
3) CFL బల్బులు వాడండి ఇవి తక్కువ వాటేజితో ఎక్కువ వెలుగు నిస్తాయి. 
4) FANS కి ELECTRONIC REGULATOR వాడండి . ఫ్రిజ్ లకు  సరిపోయే ధర్మోస్టాట్ అమర్చండి ఫ్రిజ్ ను తరచూ ఎక్కువ  సేపు తెరచి ఉంచవద్దు .
5) ఇంటిలో నీరు ఆదా చేయండి వాటిని మోటార్ ద్వారా పైకి తోడుతున్నామని గుర్తించండి .
      రోజుకు ఒక యూనిట్ అంటే నెలకు 30 యూనిట్స్ ఆదా చేస్తే  ఏడాదికి 1800 --2000 రూపాయలు విద్యుత్ బిల్లు తగ్గుతుంది .ఇలా చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే 30 లక్షల మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వినియోగ దారుల ద్వారా నెలకు 9 కోట్ల యూనిట్స్  విద్యుత్ ను అనగా రు 4.50 చొప్పున 40-50 కోట్ల రూపాయలు ఆదా చేయగలము.పవర్  హౌస్ వద్ద రు 1440 కోట్ల మూల ధనం ఖర్చు కాగల 240 మెగా వాట్స్ సామర్థ్యము తో సమానం.నెలకు లక్ష టన్నుల బొగ్గు అనగా ఏటా 12 లక్షల టన్నుల బొగ్గు వనరు ఆదా అన్నమాట.ఈ ఆదా పర్యావరణంలో 18 లక్షల టన్నుల co2 కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
   ఈ విషయాలు గ్రహించి పొదుపు సూత్రాలు పాటించి రోజుకో యూనిట్ ఆదా చేద్దాం .

Sunday, 1 December 2013

ఎక్కడిదీ జీవం ?

             ఈ సృష్టిలోనే ఒక క్రమాన్ని దర్శింపజేస్తూ మనల్ని ఈ విశ్వాసాల స్థాయి నుంచి ఒక క్రమబద్ద మైన శాస్త్రీయ దృక్పథం వైపు మరల్చిన మహనీయుడు చార్లెస్ డార్విన్. చుట్టూ కోటాను కోట్ల జీవరాసుల మధ్య .. మన ఈజీవం జీవితం ఎక్కడినుంచి వచ్చాయన్నది .. మనిషికి ఒక పట్టాన అంతుబట్టని నిగూఢమైన ప్రశ్న!తన ఊహకు కూడా అందని అమోఘమైన శక్తి ఈ సృష్టి యావత్తును ఒక్కసారిగా అద్భుతంగా సృష్టించి ఉంటుందని విశ్వసించాడు ఆది మానవుడు.అందుకే ప్రతి ప్రాచీన మతంలోను సృష్టి ప్రస్తావన కన్పిస్తుంది.కొన్ని వేల సంవత్సరాలపాటు సృష్టి దాని క్రమం విషయంలోమతం చెప్పిందే సమాధానం,మత గ్రంధం చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. ఈ దిశగా  శాస్త్రీయదృక్పథం ఊపిరిపోసుకోవటానికి కొన్ని శతాబ్దాలపాటు అదే పెద్ద ప్రతిబంధకంగా నిలిచింది .
                  17,18 శతాబ్దాలలో కోపెర్నికస్,గెలీలియో,న్యూటన్ వంటి ఉద్దండులు విశ్వ నిర్మాణం విషయంలో కొత్త సిద్ధాంతాలను ముందుకు తెచ్చి మత విశ్వాసాలకు బలమైన సవాలు విసిరారు.ఈ విశ్వాన్ని నడిపిస్తున్న సూత్రాలే మిటో .. లోతుగా పరికిస్తే మనకు ఈ విశ్వం లోనే కన్పిస్తాయని నిరూపించారు.దీంతో మతం చెప్పిందే  విశ్వసించట మా?లేక సైన్స్ మార్గాన్ని అనుసరించటమా? అన్నది ప్రజల్లో పెద్ద చర్చనీయాంశం అయింది.జీవపరిణామ సిద్ధాంతం ఊపిరి పోసుకోవటానికి ఇది ఎంతగానో దోహద పడింది .
              దాదాపు 1700 నుంచి శాస్త్రవేత్తలు భూమి పొరల్లో అక్కడక్కడ శిలాజాలను గుర్తిస్తూ వచ్చారు. క్రమేపీ శి లాజాలను చూస్తూ అది ఏ జంతువుకు చెందిందో గుర్తించే నైపుణ్యమూ పెరిగింది.అందులో కొన్ని రకాలు ప్రస్తుతం లేవని గుర్తించారు జార్జి కువిర్(1769-1832) అనే ఫ్రెంచ్ ప్రకృతి పరిశోధకుడు. గతం లోని కొన్ని జంతువులు అంత రించి  పోయాయాని ప్రతిపాదించటం మొదలుపెట్టారు. తర్వాత "అంతరించి పోవటం" అన్నది డార్విన్ సిద్దాంతానికి ముఖ్య భూమిక అయింది .
                  అప్పట్లో ప్రజలు దేవుడు చేసిన ఈ సృష్టిలో ఎలాంటి మార్పులకు తావు లేదని నమ్మేవాళ్ళు. యుగాం తంలో మాత్రమే సర్వం తుడిచిపెట్టుకుని పోయి మరల కొత్త జీవజాలం పుడుతుందని నమ్మేవాళ్ళు. అప్పట్లో ప్రయా ణ  సాధనాలు ఏవీ లేకపోవటం వల్ల తమ ప్రాంతం లోని జీవాన్ని చూస్తూ జీవంలో మార్పు ఉండదు అనుకునే వారు  పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రయాణాలు పెరగటంతో వేర్వేరు ప్రాంతాల్లోని జీవ వైవిధ్యాన్ని గమనించటం వల్ల కొత్త ఆలోచనలకు స్థానం ఏర్పడింది.
              మత గ్రంధాలు చెప్పినట్లుగా ఒక్క సారిగా మహా ప్రళయాలు రావటం లేదని అవి క్రమేపీ కొన్ని వందల వేల సంవత్సరాలపాటు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటున్నాయని బ్రిటిష్ భూభౌతిక శాస్త్ర వేత్త   చార్లెస్ లిల్ (1797-1875) సశాస్త్రీయంగా ప్రతిపాదించాడు. డార్విన్ తన పరిణామ సిద్దాంతానికి ఒక రూపు ఇవ్వటంలో ఇది ఎంతగానో ఉపకరించింది.
(ఇది ఈనాడు లో A .వెంకట ఆచార్య వ్రాసిన వ్యాసం. వారికి ధన్యవాదాలు )