శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Sunday, 17 September 2023

LiFE :1)విద్యుత్ ఆదా5) తక్కువ దూరాలకు సైకిల్ వినియోగం.

 LiFE(Life style for environment)పర్యావరణ హిత జీవన శైలి

కేటగిరి 2:విద్యుత్ ఆదా

అంశం :స్థానికంగా లేదా తక్కువ దూరం గల ప్రయాణాలకు cycles ను వినియోగించండి.

మేము inter చదివేటప్పుడు Maths, English lecturers SNR, BVS గార్లు Chethak scooter పై college కి వచ్చేవారు.మిగతా అందరు lecturers cycle పై వచ్చేవారు.విద్యార్థులు ఎక్కువ మంది నడిచి వచ్చే వాళ్ళు. నేను నా మిత్రుడు Jay cycle పై వెళ్ళేవాళ్ళం. అప్పుడు రోడ్లపై ట్రాఫిక్ అంటే cycles, రిక్షాలే కనిపించేవి.అలాంటి రోజులనుండి ఒక్కో మనిషికి ఒక bike, విస్తారంగా కార్లు అడుగడుక్కి ఆటోలు వీటికి బస్సులు లారీలు ట్రాక్టర్లు అదనం. ఎంత పర్యావరణ కాలుష్యం.

మరి మన వంతు ప్రయత్నంగా ఏం చేద్దాం. పాలు కూరగాయలు, చిన్న చిన్న దూరాల్లోని పనులకి నడక లేదా cycles వాడటం అలవాటు చేసుకోవాలి.మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తో పాటు పర్యావరణానికి మేలు చేసిన వారామవుతాం.ఇప్పటికి తక్కువ దూరాలకు నేను సైకిల్ నే వాడుతున్నాను.చైనా, తాయ్ లాండ్ తైవాన్ దేశాల్లో సైకిల్ ను ఎక్కువగా వాడతారు. June 3 న world bicycle day గా జరుపుకుంటారు.1 వ లింక్ లో సైకిల్ వాడకం గురించి 2 వ లింక్ లో సైకిల్ తొక్కడం వలన ప్రయోజనాలు 3 వ లింక్ లో చైనా లో సైకిల్ తొక్కేఅలవాటు గురించి తెలుసుకోండి.4 వ లింక్ లో నా సైన్స్ blog లోని వ్యాసాలు చదవండి.

1)(https://ravisekharo.blogspot.com/2023/06/blog-post.html?m=1)

2)(https://telugu.hindustantimes.com/lifestyle/world-bicycle-day-2023-know-benefits-of-cycling-and-how-many-calories-you-burn-biking-121685765860522.html)

3)http://english.cctv.com/mobile/tuwen/index.shtml?articalID=ARTIAD2z1TXrd7yB9yL4uues191210#:~:text=Chinese%20metropolises%2C%20like%20Beijing%2C%20have,riding%20is%20a%20good%20choice.

4)https://cvramanscience.blogspot.com/2023/09/blog-post_54.html?m=1

Friday, 8 September 2023

ప్రకృతి -ప్రార్ధన

 *ప్రకృతి ప్రార్ధన*(స్కూల్ అసెంబ్లీ లో ప్రతీ శుక్రవారం)


"కిలకిలరావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి, ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే వృక్ష కోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను.

చిట్టి చీమలతో శ్రమజీవన సౌందర్యాన్ని, కాకుల గుంపులతో సమైక్యతా సందేశాన్ని ఉపదేశిస్తున్న ఓ ప్రకృతి మాతా! నీకు పాదాభివందనం చేస్తున్నాను.


నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను. నాలాగే ఉడతకైనా, చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించననీ, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయననీ, విష రసాయనాలతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం కలిగించనని ప్రమాణం చేస్తున్నాను. విచక్షణతో వ్యవహరిస్తూ, మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను.

ప్రకృతిని పరిరక్షించేందుకు జీవవైవిధ్యాన్ని కాపాడతాననీ శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థిగా మెలుగుతాననీ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను."

భూమి ఏర్పడిన క్రమం

భూమి ఏర్పడిన క్రమం 

సుమారు 456.7 కోట్ల సంవత్సరాల క్రితం సూర్య కుటుంబంలో భాగంగా తన తండ్రి/తల్లి నక్షత్రం నుండి సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రోటో ప్లానెట్ గా భూమి ఏర్పడింది. 448 కోట్ల సంవత్సరాల క్రితం అంటే భూమి పుట్టి 87 లక్షల సంవత్సరాల తర్వాత అంగారకుడి (మార్స్) సైజున్న ఒక గ్రహం గుద్దుకోడం ద్వారా ఒకే ఒక చంద్రుడనబడే (మూన్) ఉపగ్రహాన్ని ఏర్పరుచుకోడమే కాక తన అక్షం (యాక్సిస్) 23.5 ° వంగి భ్రమణం చెయ్యడం మొదలెట్టింది భూమి. అంతకు ముందు కూడా చేస్తూ ఉండేది. భూమి ఉపరితలం మొత్తం మోల్టెన్ మాగ్మా తో (మాగ్మా సముద్రం తో) ఉన్నప్పటికి, పైన పల్చటి మూతలా ఒక ప్రాధమిక క్రస్ట్ ఏర్పడుతూ తిరిగి కరిగిపోతూ (వేడికి) ఉండేది. 450 నుండి 400 కోట్ల సంవత్సరాల మధ్య జిర్కన్ అనే క్రిస్టల్స్ వల్ల ప్రాధమిక మూత (ప్రిమోర్డియల్ లిడ్) మాత్రమే కాక గ్రానైట్ లాంటి (ఇప్పటి) క్రస్ట్ కూడా ఫార్మ్ అయ్యిందని తెలుస్తుంది. ఇవే జిర్కన్స్ లోని ఆక్సిజన్ ఐసోటోప్స్ వల్ల నీరు (ప్రాధమిక సముద్రం) ఉండేదని కూడా తెలుస్తుంది. తిరిగి 400 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఉపరితలం ఒక ఉల్కాపాత తుఫాన్ లాంటి హెవీ బాంబర్డ్మెంట్ కి గురయ్యింది. అనేక ఉల్కలు మిటియొరైట్ బెల్ట్ నుండి, అంగారకుడి నుండి ఇలా చాలా చోట్ల నుండి వచ్చి ఉల్కలు, తోక చుక్కలు పడ్డాయి. వీటిలో జీవానికి కావాల్సిన ఏమినో యాసిడ్స్, నీరు, మంచు అన్ని ఉండేవి. ఈ హెవీ బాంబర్డ్మెంట్ జరుగుతున్నప్పుడు చాలా పార్ట్ సముద్రం ఆవిరవ్వడం, తిరిగి కండెన్స్ అవ్వడం జరిగాయి. ఇది సుమారు 10 కోట్ల సంవత్సరాల పాటు జరిగినట్టు అంచనా. అంటే 400 నుండి 390 కోట్ల మధ్య. సుమారు 385 కోట్ల సంవత్సరాల సెడిమెంట్స్ (ఇనుప రాళ్లు), బసల్ట్స్ (ఘనీభవించిన లావా) దొరుకుతాయి, గ్రీన్లాండ్ లో. 403 కోట్ల సంవత్సరాల గ్రానైట్ రాయి కూడా (కెనడా లో). 350 కోట్ల సం. రాళ్ళలో మొదటి జీవం ఆనవాళ్లు దొరుకుతాయి స్ట్రోమటోలైట్స్ (ఆల్గాల్ మ్యాట్స్) రూపంలో. అక్కడి నుండి మొదలయిన జీవ చరిత్ర అనేక నాటకీయ మలుపులతో, ఉ. ఆక్సిజన్ పెరుగుదల సుమారు 250 కోట్ల సం., సంక్లిష్ట జీవాల ఆవిర్భావం 54 కోట్ల సం. క్రితం జరిగింది. అలాగే వాటి లుప్తమవ్వడాలు (ఎక్స్టింక్షన్) ఇలా. ఇదంతా ఇంకో పెద్ద చరిత్ర.


ఇప్పుడు ఇన్ని వేల కోట్ల నక్షత్రాలతో నిండి ఉన్న విశ్వం లో ఇలాంటి చరిత్రే ఉన్న ఇంకో గ్రహం ఇంకో నక్షత్ర మండలం లో ఉండే ఛాన్స్ ఉందా? ఉన్నా భూమి పడిన మధన పడుంటాయా, ఇంకా ఎక్కువ, తక్కువ కూడా పడుండచ్చా? ఒక వేళ వేరే గ్రహం పై జీవం ఉన్నా అది ఖచ్చితంగా మనలా ఉండే అవకాశం లేదు అని అనుకోవచ్చేమో. బహుశా ఈ విశ్వం లో మనం ఒంటరులమే (ఇంకో చోట జీవాన్ని కనిపెట్టే వరకు). మనతో (మనుషుల) పాటు ఉండేవి ఇక్కడి ఇతర అన్ని జీవజాలాలే. వీటి పట్ల అపార ప్రేమ, గౌరవాలతో ఉందాం. ఇవే మనకి తోడు...శ్రీనివాస్ బులుసు.

Earth hour

 


ఎర్త్ అవర్ (Earth Hour) అనేది ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే వాతావరణ దినోత్సవం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా మారినందున భూమిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారు.

ఎర్త్ అవర్ అంటే ఓ గంట పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపేయడమే. కరెంట్ బల్బులు, టీవీలు, కంప్యూటర్లు.. వగైరా కరెంటుతో నడిచే ఉపకరణాలన్నీకాసేపు స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా విద్యుత్ ఆదా చేస్తే ఆ మేరకు భూ వాతావరణాన్ని పరిరక్షించినట్లే. 2007వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దీన్ని మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం సాధారణంగా మార్చి మాసంలోని చివరి శనివారం రాత్రిపూట ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని  జరుపుకుంటూ ఇప్పటికి ప్రజలు స్వచ్ఛందంగా ఎర్త్ అవర్ పాటించే విధంగా చైతన్యం తీసుకురాగలిగారు.


భూటాన్... అడవులు

 ప్రకృతి వనరుల పరిరక్షణ,పర్యావరణ క్షీణత నివారణ కోసం భూటాన్ లో ఎప్పుడూ అడవుల శాతం 60%ఉండాలని వారి రాజ్యాంగం నిర్దేశిస్తుంది.ప్రస్తుతం వారి అడవుల శాతం ఎంతో తెలుసా 72%.This country isn't just carbon neutral-it's carbon negative/Tshering Tobgay,Bhutan's Ex Prime minister.

చారిత్రక ఆధారాలు

 చరిత్ర గురించి చెప్పాలన్నా, వ్రాయాలన్నా ఏదో ఒక ఆధారం కావాలి. జీవ పరిణామ క్రమాన్ని వివరించినా అందులో మానవ పరిణామ క్రమాన్ని వివరించినా ఆయా కాలాల్లో లభించిన శిలాజాలను బట్టి ఒక అంచనాకు వచ్చేవారు. అంత దూరం వెళ్లకుండా కనీసం మానవుడు వ్యవసాయాన్ని ప్రారంభించి స్థిర నివాసం ఏర్పర్చుకున్నప్పటి నుండయినా అప్పుడేమి జరిగిందో భావితరాలు తెలుసుకోవడానికి వారు రాళ్ళపైన చెక్కిన చిత్రాలు గీతలు వారు ఉపయోగించిన వస్తువులు, శిధిలమైన ఇళ్ళు కొంత వరకు సాక్షీ భూతమై నిలిచాయి. కాని భాష తెలిసిన దగ్గర్నుండి కూడా లిపి లేకపోవడం వలన అప్పటి సంఘటనలకు శాశ్వతత్వం కలిగించే అవకాశం అప్పటి వారికి లేకపోయింది.

ఒద్దుల రవిశేఖర్ 

4. LiFE(పర్యావరణ హిత జీవనశైలి )

 Mission LiFE(Life style for environment)పర్యావరణ హిత జీవన శైలి 

కేటగిరి :విద్యుత్ ఆదా

అంశం 4:red lights పడినప్పుడు, రైల్వే crossings వద్ద వాహనాల ఇంజిన్ ను switch off చేయండి.

మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు చాలా మంది ఇంజిన్ off చేయకుండా అలాగే ఉంచుతారు.ఇక ఆ కొద్ది సేపు నరకంతో సమానంగా ఉంటుంది అక్కడి గాలి పీల్చలేక.

ఇంజిన్ off చేయడం వలన ప్రయోజనాలు

1)పెట్రోల్, డీజిల్ ఆదా చేయవచ్చు

2)వాయు కాలుష్యాన్ని నివారించవచ్చు

3)ధ్వని కాలుష్యాన్ని నివారించవచ్చు

4)సమ్మిళిత అభివృద్ధి కి దోహదం చేస్తుంది

5) హానికారక వాయువుల విడుదల ను అరికట్టవచ్చు.

మనవంతు ప్రయత్నం గా పర్యావరణ హిత జీవనశైలి ని అలవాటు చేసుకుందాం. భూమిని రక్షిద్దాం.

Thursday, 7 September 2023

3. Mission LiFE

 Mission LiFE( పర్యావరణ హిత జీవన శైలి)

కేటగిరి :విద్యుత్ ఆదా

అంశం 3:సాధ్యమైనంత మేరకు elevator(lift)కు బదులుగా మెట్లను వాడండి.

అపార్ట్మెంట్, shopping malls,కా ర్యాలయాలు,ఎక్కువ అంతస్థులు గల ఇళ్ళకి elevator(lift) తప్పని సరిగా ఉంటుంది ఈ రోజుల్లో.యువతీ యువకులు, ఆరోగ్యం గా ఉన్న మధ్య వయస్సు వారు, పెద్దలు మెట్లు ఎక్కడాన్ని అలవాటు చేసుకుంటే ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.

1)హృదయ స్పందన వేగం పెరిగి రక్త పోటు నియంత్రణ లో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

2) cholestrol levels తగ్గుతాయి.

3) కండరబలం పెరుగుతుంది

4) కేలరీలు కరిగి బరువు నియంత్రణ లో ఉంటుంది.

5) కాళ్లు, ఎముకలు,కండరాలు, కీళ్ళు దృడంగా మారతాయి.

6) endorphins విడుదల అయి పనిలో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి

7) elevator లో వెళ్ళడానికంటే ముందే వెడతాం

8) కదలకుండా ఎక్కువ సేపు కుర్చీలో కూర్చొని పని చేసేవారికి మెట్లు ఎక్కడం చాలా మేలు చేస్తుంది.

9) ఎక్కువ కాలం జీవిస్తారు.

10) గుండె స్పందనలకు 8 లేదా 9 రెట్ల ఎక్కువ శక్తి కావాల్సివస్తుంది.

కనుక సాధ్యం అయినంతవరకు మెట్లు ఎక్కుదాం. పర్యావరణ హితంగా జీవిద్దాం. భూమిని రక్షిద్దాం.

ఒద్దుల రవిశేఖర్ 

Tuesday, 5 September 2023

2.పర్యావరణ హిత జీవన శైలి (Mission life)

 LiFE(Life style for environment)

2.సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా నే వాడుదాం :

సాధారణంగా మనం ప్రయాణాలకు bus,train లాంటి ప్రజా రవాణా వ్యవస్థల్ని వినియోగిస్తూ ఉంటాం. కాని ఇటీవల మారిన సాంఘిక జీవనం దృష్ట్యా ప్రతి ఒక్కరు సొంత వాహనం కలిగి ఉంటున్నారు. ప్రతి ఇంటిలో motor cycle ఉంటుంది. ఇక కార్లు కొనే వారి సంఖ్య కూడా పెరిగి పోయింది. గతంలో ప్రజలు కాలినడకన ఎక్కువగా ప్రయాణించే వారు,లేదా cycles వాడేవారు. ఇందువలన పర్యావరణానికి ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. క్రమేపీ జనం motor bikes కి అలవాటు పడ్డాక కాలి నడక బాగా తగ్గి పోయింది. దీనితో ఇంధనం ఖర్చు పెరిగిపోయింది. అలాగే దూర ప్రాంతాలకు బస్సులు,రైలు కు బదులుగా సొంత కార్లు అద్దె కార్ల వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో పెట్రోల్ డీజిల్ వినియోగం విపరీతంగా పెరిగి కాలుష్యం ఎక్కువవుతోంది. చక్కటి ప్రణాళిక ఉంటే దూరప్రాంతాలకు ముందుగా train tickets బుకింగ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాక కావాలంటే rent cars వాడొచ్చు. అలాగే చిన్న చిన్న దూరాలకు కాలి నడక, cycle వాడితే ఎంతో ఉపయోగం గా ఉంటుంది.హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి మహా నగరాల్లో metro train అందుబాటులోకి వచ్చాక సొంత వాహనాల వాడకం తగ్గింది. ఇలా మన జీవనశైలి లోమార్పు చేసుకోవడం ద్వారా,పర్యావరణ హితంగా వ్యవహరిస్తూ జీవిద్దాం. మన భూమిని కాపాడు కుందాం. ఒద్దుల రవిశేఖర్

Thursday, 17 August 2023

పర్యావరణ హిత జీవన శైలి Mission LiFE

 పర్యావరణ హిత జీవనశైలి :

Mission LiFE

మనం రోజు వారి జీవితం లో మునిగి పోయి చిన్న చిన్న అంశాలను పట్టించు కోము. మన జీవన శైలి పర్యావరణా నికి నష్టం కలిగించకుండా పర్యావరణ హితంగా ఉండాలి. దానివలన మనకు ఆరోగ్యం, ప్రకృతికి సేవ మరియు ఆర్ధికంగా మనకు, సమాజానికి ఉపయుక్తం.

Mission LiFE కార్యక్రమం స్వాతంత్ర్యం సిద్ధించిన 75 వ ఏట ప్రారంభించిన సందర్భంగా వ్యక్తులు సమూహాలు మరియు సంస్థలు తమ రోజు వారి జీవితాల్లో సులభమైన పర్యావరణ హిత మైన చర్యలు అవలంబించేలా చేయడం కోసం మొత్తం 7 కేటగిరి లలో సమగ్రమైన 75 LiFE కార్యక్రమా ల జాబితా లో ఒక్కొక్క అంశాన్ని గురించి వివరించ దలచుకున్నాను. ఈ అంశాలను నేను నిర్వహిస్తున్న cvramanscience blog లో కూడా post చేస్తున్నాను.పర్యావరణ హితాన్ని కోరే మిత్రులంతా ఈ వ్యాసాలను చదివి మీ జీవన శైలి ని పర్యావరణ హితంగా మార్చుకోండి.

కేటగిరి 1:విద్యుత్ ఆదా

అంశం 1:LED bulb లు /tube lights నే వాడండి

మనం 40W బల్బ్ వాడటం కంటే 40 w tubelight వాడటం వలన ఎక్కువ కాంతి ఇస్తుంది ఇంకా LED Tube lights వాడటం చాలా మేలు మామూలు ఫ్లోరోసెంట్ tube light 4-6 సం. లు వెలిగితే LED tube light 10 సం. వరకు వెలుగుతుంది.40,000 గంటల పాటు వెలుగుతుంది.60% విద్యుత్ ఆదా అవుతుంది. మరియు డబ్బు కూడా ఆదా అవుతుంది పర్యావరణం మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ సూచనను ఆచరిస్తారు కదూ! ---ఒద్దుల రవిశేఖర్