శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Wednesday, 25 January 2012

ఉపయోగకరమైన సైన్సు websites


Useful websites for school science
1)http://www.hbcsc.tifr.res.in
conducted olympiads.
2)http://arvindguptatoys.com
excellent site for experiments with lowcost and useful toys in maths also.
3)http://www.exploratorium.edu/
4)www.howstuffworks.com
5)http://magma.nationalgeographic.com
6)www.pppst.com
powerpointpresentations
7)www.apcost.gov.in
8)www.vigyanprasar.gov.in
9)www.physics.org
10)www.sciencedoubts.com
11)www.khanacademy.com
12)www.brightstorm.com
11,12 sites are containig physics,chemistry,maths videos.
13)www.nasa.gov

Thursday, 5 January 2012

శూన్యం నుండి విశ్వం ఎలా వచ్చింది?

శూన్యం నుండి విశ్వం ఎలా వచ్చింది?

ప్రారంభ  తత్వవేత్తలు  శూన్యం  నుండి ఏమీ రాదనీ వాదించారు.ఈ విధమైన తాత్విక వేదాంత చర్చలు శతాబ్దాలుగా క్రొత్త చర్చలు లేవనెత్తుతున్నాయి.మరి శూన్యం  నుండి ఏమీ రాకపోతే మన విశ్వం ఏమీ లేని స్థితి
 నుండి ఎలా ఏర్పడింది .ఆరిజోనా రాష్ట్ర యూనివర్సిటి ప్రొఫెసర్  lawrense M.krauss  తన 
" A universefrom nothing " అన్న పుస్తకములో  ఈ విశ్వమంతా ఎలా ఏర్పడిందో వివరిస్తారు .తన పుస్తకము లో ఆయన బౌతిక,అంతరిక్ష శాస్త్రాలలో నూతనం గా వచ్చిన మార్పుల ఆధారం గా శూన్యం నుంచి ఏమీ రాలేదదు అనే ప్రశ్నను తాత్విక,వేదాంత పరం గా కాకుండా శాస్త్రీయమైన ప్రశ్న గా అభివర్ణిస్తారు. 2009 లో ఒక ఉపన్యాసములో ఈ విశ్వం శూన్యం నుండి ఎలా ఏర్పడింది?ఎలా అంతం కాబోతుంది ?అంతా వివరించారు.ఈఉపన్యాసం వీడియొ  కాపీలను youtube  నుండి  10  లక్షలమంది వీక్షించారు ఈ విజయం తో ఆయన ఈ పుస్తకాన్ని వ్రాశారు. 2000  సంవత్సరాలుగా ప్రజలు ఈ విశ్వం ఎక్కడనుండి వచ్చిందని అడుగుతూనే వున్నారు.అంతరిక్ష శాస్త్రము లోని విప్లవాత్కమైన విషయాలను ఈ పుస్తకం వివరిస్తుంది. 
In his new book,  -  -




Sunday, 18 December 2011

రసాయనశాస్త్ర workshop

మేము విగ్యాన్ ప్రసార్ ,న్యూ ఢిల్లీ ,మరియు జనవిజ్ఞాన వేదిక వారు సంయుక్తం గా  16/12/11 నుండి 18/12/11 వరకు విజయవాడ లయోలా కళాశాల లో నిర్వహించిన రసాయనశాస్త్ర workshop కు హాజరయ్యాము.ఆంధ్రప్రదేశ్  నలుమూలల నుండి వచ్చిన ఉపాధ్యాయులకు ఇది మంచి అనుభవం.
ఇందులో పాల్గొన్నవారు
1) డా: వెంకటేస్వరాన్  DST from govt of india
౨ప్రొ:కే.లక్ష్మా రెడ్డి  NIT WARANGAL cource coordinator
3)ప్రో: కృష్ణం రాజులు నాయుడు
4)ప్రో:ఆదినారాయణ
5)ప్రో:కోయ వెంకటేశ్వర్లు
6)ప్రో:రామచంద్రయ్య  నిట వరంగల్
7)ప్రో: రానా కోల్కత
 8) స్వాతి బేడేకర్ గుజరాత్
9)రమేష్ మరియు మోహన్  జన విజ్ఞాన వేదిక
10) టి శ్రీకుమార్
వీరంతా ఉత్తేజకమయిన  ఉపన్యాసాలు మరియు అద్భుత మయిన   ప్రయోగాలు  నిర్వహించారు.తరువాత జన విజ్ఞాన వేదిక విజయవాడ లెనిన్ సెంటర్ లో ఒక సైన్సు మేజిక్ షో నిర్వహించింది  .వీటికి సంబందించిన కొన్ని చిత్రాలు క్రింద చూడండి.




















visit www.vigyanprasar.gov.in

Saturday, 26 November 2011

Friday, 11 November 2011

నోబుల్ ప్రైజ్ గ్రహీత H.B ఖోరాన మరణం




భారత సంతతి కి చెందినా నోబుల్ ప్రైజ్  గ్రహీత మరియు MIT  లో బయాలజీ,కెమిస్ట్రీ లలో ప్రొఫెసర్  అయిన ఖోరానH.B మరణించారు.ఆయన వయస్సు 89.ఫిజియాలజి  ,మెడిసిన్ లలో మరియు జన్యుశాస్త్రములో వీర్యము పై పరిశోధనలు  చేసారు. 1968 లో నోబుల్ ప్రైజు వచ్చింది 
                              ఖోరానా 1922 లో ప్రస్తుత పాకిస్తాన్ లో భాగమైన రాయపూర్ ,పంజాబ్ రాష్ట్రం లో జన్మించారు.నోబుల్ ప్రైజు గెలుచుకున్న తరువాత తన స్వీయ చరిత్రలో ఇలా వ్రాసుకున్నారు."మా తండ్రి చాలా పేదరికం లో ఉన్నప్పటికీ మమ్ము చదివించారు.వంద మంది ఉన్న ఆ ఊరులో మాదోక్కటే అక్షరాస్యతా కుటుంబం "
     ముల్తాన్ లో హై స్కూల్ విద్య అభ్యసించారు.తర్వాత పంజాబ్ university  లో  డిగ్రీ p.g పూర్తి చేసారు.తరువాత లండన్ లోని లివర్పుల్  university  లో చదవటానికి భారత ప్రభుత్వ scholarship సహకారం తోdoctorate చేసారు.switgerland లో పోస్ట్ డాక్టోరల్  వర్క్ చేసారు.1960 లో మాడిసన్ లోని విస్కాన్సిన్  university   కి వెళ్లి  enjyme reasearch institute director  గా వున్నారు ఇక్కడ తన సహచరులతో కలిసి మాంస క్రుత్తుల సంయోగం లో RNA  సంకేతాలపై చేసిన పరిశోధనకు 1968 లో నోబుల్ ప్రైజ్  సాధించారు.

Sunday, 6 November 2011

APCOST,విజయవాడ చిత్రాలు

విజయవాడ భవానిపురం లో APCOST  వారు సైన్సు సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 6 నుండి 10   వ  తరగతి వరకు విద్యార్థులకు ,ఉపాధ్యాయులకు  ఎంతో ఉపయోగకరమయిన  60  ప్రయోగాలు స్వంతం గా చేసి చూసుకునే విధంగా వున్నాయి.పాటశాల యాజమాన్యాలు వీటిని చూడటానికి పిల్లల్ని ప్రోత్సాహించండి.  ప్రక్కనున్న చిత్రాలు గమనించండి



Wednesday, 26 October 2011

APCOSTకు సైన్సు యాత్ర

విజయవాడ లోని కృష్ణా నది ఒడ్డున వున్నా భావాన్ని పురం లోని APCOST సైన్సు సెంటర్ ను నా  మిత్రులతో  కలిసి  సందర్శించాను.మేము మార్కాపురం నుండి ఉదయం ట్రైన్ లో వెళ్ళాము.అక్కడ మూడు గంటలసేపు గడిపాము.అక్కడి ఫెఇల ఆఫీసర్ J.Thrilleswara rao మాకు సహాయం అందించారు.  మేము అక్కడ 62 ప్రయోగాలను 
చేసిచుడటం మాకు మంచి అనుభవం ఇది విద్యార్థులకు,ఉపాధ్యాయులకు చాలా ఉపయోగం.ఆంద్ర ప్రదేశ్ లో ఇంకా రెండు ఇటువంటివి వున్నాయి .1)అలిపిరి ,తిరుపతి 2)బిర్ల సైన్సు సెంటర్ హైదరాబాద్ .పాటశాల యాజమాన్యాలు,సైన్సు ఉపాధ్యాయులు వీటిని చూడటానికి విద్యార్థులను ప్రోత్సహింసవలెను. కు సైన్సు యాత్ర 

Tuesday, 11 October 2011

విశ్వ విస్తరణ కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్

సుపెర్నోవాలు విశ్వం యొక్క విస్తరణను వేగవంతం చేస్తాయని కనుగొన్నందుకు ముగ్గురు అమెరికన్  శాస్త్రవేత్తలకు 2011  నోబుల్ ప్రైజ్  వచ్చింది వారు 1)saul perlmutter  Lawrence Berkeley National Lab, 2)Brian Schmidt at the Australian National Lab 3) Adam Reiss at Johns Hopkins University 
     విశ్వం  విస్తరణ  గురుత్వాకర్షణ  వలన మందగించాలి . అని అనుకుంటారు కాని విస్వవిస్తారణ వేగవంత మైనదని ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ విజేతలు 1998 లోనే చెప్పారు .దూరం లో వున్నా సుపెర్నోవాలు దగ్గరిలోవున్న సుపెర్నోవాల కన్నా తక్కువ కాంతివం తం గా వుంటాయి ఇలాంటి అంశాల ఆధారం గా విశ్వం విస్తరిస్తుందని వీరు కనుగొన్నారు.ఈ ఆవిష్కరణ  అంతరిక్ష శాస్త్రం లో ఒక మైలురాయి రాబోయే తరం సైంటిస్ట్ లకు ఇది ఒక సవాలు.