శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Tuesday, 24 April 2012

ప్రకృతి సూత్రాలు _శాస్త్రీయ దృక్పథం


   
     మన భూమి వయస్సు 500  కోట్ల సంవత్సరాలుగా పరిగనిస్తారు.మొదటి  100 కోట్ల సంవత్సరాలు విపరీతమైన ఉష్ణోగ్రత వలన  భూమి  మరుగుతున్న ద్రవం గా ఉండటం వలన  అప్పటి ఆనవాళ్ళేమీ శిలా జాల రూపం లో ఏర్పడక పోవటం తో భూమి చరిత్రకు ఆనవాళ్ళేమీ లేవు.మొదటగా 400 కోట్ల  సం :క్రితం నీటిలో జీవం ఆవిర్భవించిందని కనుగొన్నారు.ఈ పరిణామ క్రమంలో భూమి మీద మానవ జాతి అవతరిం చి ఇరవై లక్షల సంవత్సరాలయ్యింది..ఇది ఒక ఉన్నత దశ.చేతి వ్రేళ్ళు  నాలుగు ఒక వైపు,బొటన వేలు వ్యతిరేక దిశలో మడవ గలిగే  నేర్పు వలన పని ముట్ల తయారీ,వాటి వాడకం అబ్బింది.
        ఆహారం,రక్షణ ,సంతానోత్పత్తి కోసం పరిసరాలను గమనించటం లో మనిషికి కుతూహలం ,ఆసక్తి కలి గాయి.వాటిని తన జీవన విధానం లో ఆచరిస్తూ ప్రకృతి పట్ల తన అవగాహనను తర్వాతి తరానికి అందిం చాడు .ఇలా పాత తరం అందించిన జ్ఞానం తీసుకొని ప్రతి తరం ప్రాపంచిక ,బౌగోళిక,అంతరిక్ష,ఇతర బౌతిక అంశాల పట్ల సవివరమైన అవగాహన ఏర్పరుచుకున్నాడు.కొన్ని లక్షల సంవత్సరాల పాటు  సంపాదించిన ఈ విజ్ఞాన సర్వస్వానికి మానవ జాతి సమిష్టి నిర్మాత.ఇలా సాదిం చుకున్నదే  విజ్ఞాన శాస్త్రం ఇందులో భౌతిక  శాస్త్రం,రసాయన శాస్త్రం,జీవ శాస్త్రం,ఖగోళ శాస్త్రం,వంటివి ప్రకృతిని వివరించే ప్రధాన విజ్ఞాన శాస్త్రాలు.
            ప్రతి శాస్త్రం లోను సూత్రాలు వుంటాయి.ఇవన్నీ ప్రకృతి సూత్రాలే! మనకు కనిపించే ప్రతి సంఘట న,దృగ్విషయానికి ఈ సూత్రాల ఆధారం గా వివరణ ఇవ్వ గలుగుతున్నాము.ఒక శాస్త్రం లోని సూత్రాలు మరో శాస్త్రం లోని సూత్రాలతో వైరుధ్యాన్ని ప్రదర్శించవు.ఈ సూత్రాల సమిష్టి తాత్విక  అవగాహనే శాస్త్రీయ దృక్పథం (scientific temper)అంటారు.వీటి గురించి  కనీస పరిజ్ఞానం శాస్త్రీయ అవగాహన కోరుకునే వారికి అవసరం.
       ఏ  సూత్రము లేని పరికరం,శాస్త్రం,సాంకేతిక విధానం వుండవు.ప్రతి వ్యక్తి సైన్సు సాధనాలను వాడక తప్పదు.మనం వాడే ప్రతి వస్తువు  t.v,radio,computer,cell phone,current, అన్ని లోహ వస్తువులు ,అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు,చెక్క వస్తువులు,ఇంటి సామాగ్రి,అన్ని రవాణా సాధనాలు,అన్నిపరిశ్రమల  యంత్రాలు,ఇలా ప్రతిది శాస్త్ర,సాంకేతిక రంగ ఫలాలే!సైన్సు లేని జీవితాన్ని నేడు ఊహించలేము.
        ప్రజలు సైన్సు పరిజ్ఞానాన్ని పొందుటకు ఉత్సాహం చూపటం లేదు.ప్రశ్నించడం సైన్సు కు ప్రధాన లక్షణం.సైన్సు ద్వారా మానవ జీవనం ఎంతో మెరుగుపడింది.భారతదేశం లో ఒకప్పుడు సగటు వయస్సు 30 సం నేడు అది 60 సం పైగా అయింది. information,bio,nano,technology లు ఎంతగానో అభివృద్ది చెందాయి.కొన్ని లక్షల జంతు,వృక్ష జాతుల జీవిత పద్ధతుల్ని అన్వేషించారు.ఆరోగ్యం పై అత్యాధునిక స్థాయి చికిత్సలను అభివృద్ది చేసుకున్నాము.1960 వరకు భూమిపై  ఉన్న  సహజ,స్వతంత్ర  పదార్థాల కన్నా ఈ 44 సం లలోనే మానవుడు ఎక్కువ పదార్థాల్ని సృష్టించాడు.
                   సమాజాన్ని సైన్సు ప్రభావితం చేసింది,అలాగే సైన్సు ను సమాజం ప్రభావితం చేసింది .సమా జానికి ఆలోచనను,తాత్విక దృష్టిని ఇచ్చింది.తత్వశాస్త్రానికి పరాకాష్ట సత్యాన్వేషణ.ఇది తాత్విక దృష్టి ఉంటే నే వీలవుతుంది .సైన్సు ను అభివృద్ది చేసిన తాత్విక దృష్టి పేరే శాస్త్రీయ పద్ధతి.(method of science) అంటాము.శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలంటే శాస్త్రీయ పద్ధతి గురించి కనీస అవగాహన అవసరం సైన్సు పద్ధతికి,అశాస్త్రీయ పద్ధతికి ప్రధానం గా ఉన్న తేడా రుజువులు.సైన్సు వీటిని ప్రోత్సాహిస్తుంది .అశాస్త్రీయ భావాలు రుజువుల మీద ఆధారపడక గుడ్డిగా నమ్ముతుంటాయి.
         ఎక్కువమంది నమ్మినంత మాత్రాన నమ్మకం వాస్తవం కాదు.ఊహల ద్వారా ఏర్పడినవే నమ్మకా లు .ప్రయోగం ద్వారా పరిశీలనలోనే సత్యమేదో తెలుస్తుంది.ఉదాహరణకు బరువైన,తేలికైన రాళ్ళలో బరు వైనదే ముందు పడుతుందని అరిస్టాటిల్,క్రీ పు నాలుగవ శతాబ్దం లో అన్నాడు.క్రీ.శ పదహారవ శతాబ్దం లో గెలేలియో  రుజువు చేసే దాకా రెండు రాళ్ళు ఒకేసారి పడతాయని ప్రపంచానికి తెలియదు.శాస్త్రీయ పద్ధతి లోపరిశీలన అనేది మొదటి దశ.దీనిలో ఖాయం చేసుకోవడం కోసం కొలతలు వాడతాము.అలాగే ప్రశ్న రెండోది.ఎందుకు?ఏమిటి?ఎలా?ఎక్కడ?ఎవరు?ఎప్పుడు? అనే జిజ్ఞాసే సైన్సు కు ప్రేరకం.ప్రశ్న లోంచే విజ్ఞానం పుట్టింది.ఈ ప్రశ్న శాస్త్రీయం గా ఉండాలి.(scientific query).మూడో మెట్టు ఊహన!అంతకు ముందు  సైన్సు నిరూపించిన సిద్దాంతాలకు సూత్రాలకు ఈ ఊహలను ప్రయోగ పూర్వకంగా తేల్చుకోవాలి                                                                                                                బల్ల పరుపు భూమి అనే ఊహనుండి  గోలీయ భూమిగా భావించటం సైన్సు లో గొప్ప   విజయం.భూమి చుట్టూ గ్రహాలూ,నక్షత్రాలు తిరుగుతాయనే ఊహలకు వ్యతిరేకం గా ఆలోచించిన బ్రునో, హైపెశియా  హత్యకు గురికాగా గెలేయియో శిక్షిం పబడ్డాడు..కోపెర్నికాస్  ఎన్నో వేదనలను అనుభవిం చాడు .ఊహించడం మూడవ మెట్టు అయితే ఆ ఊహ తప్పని తేలితే  కొత్త ఊహలు చేపట్టాలి.ఆ ఊహను రుజువు చేయడమే సైన్సు పద్ధతిలో అత్యంత కీలక దశ .ప్రయోగం ద్వారా రుజువు కానిదేది సైన్సు పరిధి లోకి రాదు.రుజువు కానిది అశాస్త్రీయం అవుతుంది.
     జంతువుల ,పక్షుల దేహ నిర్మాణం లో కోట్ల సం నుంచి స్వల్పం గా మార్పులకు గురి అయ్యాయి.కాని మానవ శరీరం ఈ వేలసం లలోనే అనేక మార్పులకు లోనయింది.మానవుడు తన పరిశీలనలను ప్రయో గం ద్వారా రుజువు చేసుకొనడం వలన  ప్రకృతి నియమాలను ఖరారు చేసుకొనడం ద్వారా సైన్సును జీవి త విధానం లోనికి ఇముడ్చు కోగాలిగాడు.
                      ప్రయోగం ద్వారా రుజువైన తర్వాత మూడవ  దశలో పేర్కొన్న నమూనా సిద్ధాంత స్థాయికి చేరుకొ నడం శాస్త్రీయ పద్ధతి.ఇదే చివరి దశ.ఎన్నో సార్లు పరీక్షలకి,పరిశీ లనలకి,  సవాళ్ళకు నిలబడి నిలి చేదే ప్రకృతి నియ మం అవుతుంది.సైన్సు లో ఎన్ని వేల సుత్రాలున్న అవన్నీ మౌలికం గా  పద్దెనిమిది ప్రాథమిక సూత్రాల సమాహార మని ఆధునిక శాస్త్రజ్ఞులు రుజువు చేసారు.2000 సం ఆరంభం లో అంతర్జా తీయ స్థాయిలో జరిగిన శాస్త్రజ్ఞుల మహా సభలో ఈ సూత్రాలను తీర్మానించారు.వీటిని ప్రశ్నించే పరిశీల నలు,సైన్సు పద్ధతి ద్వారాప్రయోగ పూర్వకం గా మన కు తారస పడే వరకు ఈ సూత్రాలను మనం సత్యా లుగా ఆమోదిస్తాము.వీటినే శాస్త్రజ్ఞులు సమకాలీన శిఖరాగ్ర సూత్రాలుగా భావిస్తారు.ఈ సూత్రాలలో ఏ  ఒక్కదాన్ని లేదా కొన్నింటిని లేదా అన్నింటిని ప్రశ్నిం చే విధం గా నమ్మకాలు,ఆచారాలు,విశ్వాసాలు వుంటే అవి అశాస్త్రీయమని సైన్సు పద్ధతి అంటుంది.
                 ఈ సూత్రా;లతో ప్రతి వాదనను పోల్చుకోవాలి.ఆ వాదన ఈ సూత్రాలను ప్రశ్నించే దైతే రుజువు చేసుకోవాలి.రుజువు చేసుకోలేక పోతే  ఆ వాదనను తప్పుగా భావించుకోవాలి.అందుకే  18 ఈ  సూత్రాల ను rules of acceceptance  గా కాకుండా rules of exclusion  గా సైంటిస్ట్ లు పేర్కొంటారు.వీటి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన వుండాలి.ఒక్కొక్క  సూత్రాన్నిగురించి తెలుసుకొందాము.    

Sunday, 22 April 2012

ప్రకృతి సూత్రాలు (LAWS OF NATURE)


                 ఈ విశ్వాన్ని సృష్టించిదెవరు?ముందుకు నడిపిస్తున్నదెవరు?దీన్ని ఎవరు శాసిస్తున్నారు?ఈ ప్రశ్నలన్నీ
మానవుడు ఈ ప్రకృతిని చూసి వేసినవి.ప్రకృతి అంత సహజంగా ఈ ప్రశ్నలు పుట్టాయి.ఈ ప్రశ్నలవలననే సైన్సు,చరిత్ర, మానవ నాగరికత పుట్టాయి.మరి వీటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి?గణితం లాగా ఖచ్చితమయిన సమాధా నాలు వాటికున్నాయా?
              ఆధునిక సైన్సు పై ప్రశ్నలకు సమాధానాలు వున్నాయని అంటుంది.ఈ ప్రకృతి కేవలం  18 సూత్రాల మీద ఆధారపడి నడుస్తోందని నోబెల్ గ్రహీతలైన శాస్త్రవేత్త లంతా కలిసి వడబోసిన సిద్ధాంతీకరణ ఇది.ఈ సూత్రాల పరిధి దాటి  ప్రకృతి లో పరమానువునుంచి గేలక్సీ ల దాకా ఏదీ ఒక్కక్షణం కూడా మనుగడ సాగించలేవనేది ఈ సూత్రాలసారాంశం.            
            
                 ఇది వరంగల్  NIT లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎ.రామచంద్రయ్య గారి రచించిన "ప్రకృతి సూత్రాలు" అనే పుస్తకం నుండి సేకరించినది . ఈ సూత్రాలను  బ్లాగులో పెడుతున్నాను సర్ అని అడిగిన వెంటనే సైన్సు అందరిదయ్యా అని ఓ.కే చేసిన ఈ పుస్తక రచయితకు జనవిజ్ఞాన వేదికకు ,ప్రజాశక్తి బుక్ హౌస్ కు  ధన్యవాదాలు.కాని పుస్తకం లోని ప్రధాన భావనను మాత్రమే తీసుకొని సరళంగా ప్రస్తావిస్తున్నాను.ఇది కేవలం శాస్త్ర ప్రచారం కోసం మాత్రమే !

శాస్త్రీయదృక్పథం

                              Developing Scientific Temper
               Humanism and Spirit of inquiry
               and Reform........
                                            Constitution of India
        శాస్త్రీయ దృక్పథాన్ని ,మానవతా దృక్కోణాన్ని 
        తార్కిక సత్యాన్వేషనా తత్పరతను,సంస్కర
        శీలాన్నిపెంపొందించుకోవటం ప్రతి భారత పౌరుడి విధి.
                                          భారత రాజ్యాంగం 


Friday, 2 March 2012

సైన్సు@మొబైల్

సైన్సు@మొబైల్
జాతీయ సైన్సు దినోత్సవాల్లో భాగంగా విజ్ఞాన్ ప్రసార్,ఇగ్నో కలిసి సైన్సు@మొబైల్  ను ప్రవేశ పెట్టారు.సైన్సు కు సంభందించిన వార్తలు ,ముఖ్యమైన రోజులు,నిజాలు,సూక్తులు,శాస్త్ర వేత్తల వివరాలు,ఆరోగ్య చిట్కాలు ఉచితంగా sms రూపంలో అందిస్తుంది.SCIMBL అని టైపు చేసి 092230516161 కు sms పంపించాలి . లేదా  www.vigyanprasar.gov.in  లో SCIMBL  అని సెర్చ్ లో టైపు చేస్తే ఒక రిజిస్ట్రేషన్ form  వస్తుంది  అది  పూర్తి చేస్తే సరి.
దీనిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.అందరు దీనిని వినియోగించుకొని సైన్సు గురించి తెలుసుకోండి

Thursday, 9 February 2012

ప్రకృతి సూత్రాలు

ప్రకృతి సూత్రాలు అనే పుస్తకం ప్రొఫెసర్ A.రామచంద్రయ్య గారు రచించారు .ఈ పుస్తకం లో ప్రకృతి ఎలా నడుస్తుంది అన్న విషయాన్ని చక్కగా వివరించారు .ఈ ప్రకృతి క్రింద చెప్పిన 18 సూత్రాల ఆధారం గా నడుస్తున్నదని శాస్త్ర వేత్తలంతా కలిసి తీర్మానించారు.
1)సహజ సంఘటనలు పరిశీలకుని ఇష్టానుసారంగా జరగవు.
2)మనం చూస్తున్న నేటి విశ్వం మహా విస్పోటనం అనబడే ఒక సంఘటనలో ఏర్పడింది.
3).ఈ విశ్వంలో ఏదీ స్థిరంగా లేదు.ప్రతిదీ చలనం లో వుంది. ఎ   వస్తువు శాశ్వతం కాదు.మార్పు మాత్రమే శాశ్వతం
4) విశ్వం లో కేవలం నాలుగు రకాల బలాలు మాత్రమే వున్నై.అవి
a)గురుత్వాకర్షణ బలాలు,
b)విద్యుత్ అయస్కాంత బలాలు 
c)బలమైన  కేంద్రక  బలాలు 
d)బలహీనమైన కేంద్రక బలాలు.
5)విశ్వం క్రమబద్ధంగా వుంది కాబట్టి దాని గురించి సంపూర్ణంగా అధ్యయనం చేయవచ్చును.
6)కేంద్రక శక్తే అన్ని రకాల శక్తులకు మూలం . కేంద్రక శక్తి పదార్థ వినిమయం తో విడుదల అవుతుంది.పదార్థ రూపాంతరమే శక్థి.
7)ఒకే  సూత్రాల సముహంతో చలనాలనన్నింటిని వివరించగలము.  
8)భౌతిక రాశులన్ని   గులకలుగా ఉంటాయి.ఏ భౌతిక రాశి ని అవిచ్చిన్నంగా సూ క్ష్మీకరించ లేము
9)విశ్వం లో అన్ని సంఘటనలలోను ద్రవ్య శక్తి నిత్యత్వమే .పదార్ధము, శక్తిని నూతనముగా  సృష్టించలేము ,నాశనం చేయలేము.
10)శక్తి రూపాలన్నీ  ఉష్ణ రూపం లోకి మారుతున్నాయి.
11)పదార్ధాలన్నీ పరమాణు నిర్మితాలు.
12)పదార్ధాలలో పరమాణువులు సంధానించుకున్న పద్ధతినిబట్టి ఆయా పదార్థాలు తమ ధర్మాలను ప్రదర్శిస్తాయి 
13)పరమాణువులు ఎలక్ట్రాను చలనాలతోనే సంధానించుకుని వుంటాయి 
14)పదార్థం అంతిమంగా క్వార్కులమయం.
15)భూమ్మీద జీవం నిర్జీవ పదార్తాలనుండే  పుట్టింది. జీవం పరిణామం చెందుతూ పలురుపాల్లోకి ప్రకృతికి అనుగుణంగా విస్తరిస్తోంది.మానవుడు జీవ పరిణామం ద్వారానే సంభావించాడు.
16)జీవం కేవలం కణాల్లో మాత్రమే ఉండగలదు.
17)జీవులు వేరయినా అన్ని జీవులలోను ఒకే విధమయిన జన్యుస్మ్రుతి ఉంది
18)జీవులన్నింటి మధ్య పాదార్తిక బంధం ఉంది.

ప్రకృతి సూత్రాల మధ్య ఐక్యత(hiddenen unity in nature's laws)


HIDDEN UNITY IN NATURES LAWS(ప్రకృతి సూత్రాల మధ్య  ఐక్యత) 
 భౌతిక శాస్త్రములోని ఒక  వైరుధ్యమేమంటే మన  జ్ఞానం పురోగమించేకొద్ది  విభిన్న భౌతిక విషయాలు  తక్కువ అంతర్లీన చట్టాలు, లేదా సూత్రాలు పరంగా వివరించబడ్డాయి. హిడెన్ యూనిటీ లో, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త జాన్ టేలర్   స్పష్టంగా సంబంధం లేని భౌతిక విషయాల మధ్య సమన్వయము లో  పురోగతి సాధించారు ఈయన   ఖగోళ మరియు భూగోళ డైనమిక్స్ ఐక్యత (17 వ శతాబ్దం),ఉష్ణం లో ఐక్యత  (18 వ శతాబ్దం), విద్యుత్ ఐక్యత, అయస్కాంతశక్తి లోపల వేడి ఐక్యత  మరియు కాంతిఐక్యత ( 19 వ శతాబ్దం), స్పేస్ మరియు సమయం మరియు విద్యుత్ తో అణు దళాలు ఏకీకరణ(20 వ శతాబ్దం )వంటి వాటిని ఇందులో వివరించారు.. గణిత శాస్త్ర వివరాలు మీద ఆధారపడకుండా , టేలర్ యొక్క దృష్టి కణ భౌతిక మరియు విశ్వశాస్త్రం వంటి మీద వుంది. Unestablished సిద్ధాంతాలు మరియు ఇప్పటికీ జవాబు పొందని ప్రశ్నలకు  అర్థం ఇందులో  పాఠకులు కనపడుతుంది . జాన్ సి టేలర్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఫిజిక్స్ ప్రొఫెసర్ .. నోబెల్ గ్రహీత Abdus సలాంకు  విద్యార్థి, టేలర్ యొక్క పరిశోధన కెరీర్ 1950 నుండి ప్రాథమిక కణ భౌతికశాస్త్రం  కొనసాగుతుంది. అతను ఇంపీరియల్ కాలేజీ, లండన్, లో  మరియు ఆక్స్ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల లో  బోధించారు, మరియు అతను ప్రపంచవ్యాప్తంగా ఉపన్యసించారు.. ఆయనకు  రాయల్ సొసైటీ లో మరియు ఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ లో ఒక ఫెలోషిప్  ఉంది.
Front Cover                             గూగుల్ బుక్స్ లో నెట్ లో ఈ పుస్తకం చదవండి.


                            read this book on net in google books. 


Monday, 30 January 2012

పుస్తకాలు


సైన్సు నందు మంచి సమాచారానికి ఈ పుస్తకాలు పనికి వస్తాయి.
1) NCERT
2)ICSE
3)CBSE
4)Science in action 6 నుండి 10  వరకు ,ఇవి పియర్సన్ ,లాంగ్మాన్  సిరిస్ లోనివి రచయితలు గాయత్రి మూర్తి ,విదు నారాయణ్
యువ శాస్త్రవేత్తలను తయారుచేయటానికి ప్రయోగాపుర్వాకం గా తయారు చేసారు.
5)ఫిజిక్స్ (coordinate science)byMary jones,Geoff jones&Phillip marchington by cambridge university press.
6)700 సైన్సు ప్రయోగాలు ,compiled by UNESCO,double day
7)365 ప్రయోగాలు  రోజు వారి ఉపయోగించే పదార్థాలతో ,Richard churchill,sterling publishers
8)joy of learning(standards 3 to 5),centre for environmental Eucation,Ahmedabad,India
9)The story of Physics,TPammanabhan(eng/hin)vigyan prasar,Newdelhi
10)Resonance Journal of science Education,Indian Academy of sciences

Wednesday, 25 January 2012

ఉపయోగకరమైన సైన్సు websites


Useful websites for school science
1)http://www.hbcsc.tifr.res.in
conducted olympiads.
2)http://arvindguptatoys.com
excellent site for experiments with lowcost and useful toys in maths also.
3)http://www.exploratorium.edu/
4)www.howstuffworks.com
5)http://magma.nationalgeographic.com
6)www.pppst.com
powerpointpresentations
7)www.apcost.gov.in
8)www.vigyanprasar.gov.in
9)www.physics.org
10)www.sciencedoubts.com
11)www.khanacademy.com
12)www.brightstorm.com
11,12 sites are containig physics,chemistry,maths videos.
13)www.nasa.gov

Thursday, 5 January 2012

శూన్యం నుండి విశ్వం ఎలా వచ్చింది?

శూన్యం నుండి విశ్వం ఎలా వచ్చింది?

ప్రారంభ  తత్వవేత్తలు  శూన్యం  నుండి ఏమీ రాదనీ వాదించారు.ఈ విధమైన తాత్విక వేదాంత చర్చలు శతాబ్దాలుగా క్రొత్త చర్చలు లేవనెత్తుతున్నాయి.మరి శూన్యం  నుండి ఏమీ రాకపోతే మన విశ్వం ఏమీ లేని స్థితి
 నుండి ఎలా ఏర్పడింది .ఆరిజోనా రాష్ట్ర యూనివర్సిటి ప్రొఫెసర్  lawrense M.krauss  తన 
" A universefrom nothing " అన్న పుస్తకములో  ఈ విశ్వమంతా ఎలా ఏర్పడిందో వివరిస్తారు .తన పుస్తకము లో ఆయన బౌతిక,అంతరిక్ష శాస్త్రాలలో నూతనం గా వచ్చిన మార్పుల ఆధారం గా శూన్యం నుంచి ఏమీ రాలేదదు అనే ప్రశ్నను తాత్విక,వేదాంత పరం గా కాకుండా శాస్త్రీయమైన ప్రశ్న గా అభివర్ణిస్తారు. 2009 లో ఒక ఉపన్యాసములో ఈ విశ్వం శూన్యం నుండి ఎలా ఏర్పడింది?ఎలా అంతం కాబోతుంది ?అంతా వివరించారు.ఈఉపన్యాసం వీడియొ  కాపీలను youtube  నుండి  10  లక్షలమంది వీక్షించారు ఈ విజయం తో ఆయన ఈ పుస్తకాన్ని వ్రాశారు. 2000  సంవత్సరాలుగా ప్రజలు ఈ విశ్వం ఎక్కడనుండి వచ్చిందని అడుగుతూనే వున్నారు.అంతరిక్ష శాస్త్రము లోని విప్లవాత్కమైన విషయాలను ఈ పుస్తకం వివరిస్తుంది. 
In his new book,  -  -




Sunday, 18 December 2011

రసాయనశాస్త్ర workshop

మేము విగ్యాన్ ప్రసార్ ,న్యూ ఢిల్లీ ,మరియు జనవిజ్ఞాన వేదిక వారు సంయుక్తం గా  16/12/11 నుండి 18/12/11 వరకు విజయవాడ లయోలా కళాశాల లో నిర్వహించిన రసాయనశాస్త్ర workshop కు హాజరయ్యాము.ఆంధ్రప్రదేశ్  నలుమూలల నుండి వచ్చిన ఉపాధ్యాయులకు ఇది మంచి అనుభవం.
ఇందులో పాల్గొన్నవారు
1) డా: వెంకటేస్వరాన్  DST from govt of india
౨ప్రొ:కే.లక్ష్మా రెడ్డి  NIT WARANGAL cource coordinator
3)ప్రో: కృష్ణం రాజులు నాయుడు
4)ప్రో:ఆదినారాయణ
5)ప్రో:కోయ వెంకటేశ్వర్లు
6)ప్రో:రామచంద్రయ్య  నిట వరంగల్
7)ప్రో: రానా కోల్కత
 8) స్వాతి బేడేకర్ గుజరాత్
9)రమేష్ మరియు మోహన్  జన విజ్ఞాన వేదిక
10) టి శ్రీకుమార్
వీరంతా ఉత్తేజకమయిన  ఉపన్యాసాలు మరియు అద్భుత మయిన   ప్రయోగాలు  నిర్వహించారు.తరువాత జన విజ్ఞాన వేదిక విజయవాడ లెనిన్ సెంటర్ లో ఒక సైన్సు మేజిక్ షో నిర్వహించింది  .వీటికి సంబందించిన కొన్ని చిత్రాలు క్రింద చూడండి.




















visit www.vigyanprasar.gov.in