శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Saturday 29 November 2014

Astronomy olympiad exposure camp 2014 at Mumbai

 Prof.Subhasis Basak,NISER,Bhubaneswar
 Prof.Priyahasan,Hyderabad
Mr Anand Ghasis

 Dr Aniket sule(left),Sheetal (extreme right)
                                                             Oddula Ravisekhar(I)
           I attended Astronomy olympiad exposure  camp at Mumbai which conducted from  10-13  th November 2014.Deep concepts about astronomy,Olympiads are explained by eminent professors.These are the programme particulars.
1) Inaguration-prof Jayashree ramdas centre director,HBCSE
2)Introduction to Olympiads- Dr anikethsule
3)Celestial mechanics-Prof Subhas basak,NISER,Bhubaneswar
4)Physics of stars-1,-- Prof Priya hasan,Hyderabad
5)Physics of stars--2,- Prof Priya hasan ,Hyderabad
5Night sky observation-Anand ghaisas,HBCSE
6)Optics-- prof Vinayak katdare, ruparel college,Mumbai
6)Astronomical coordinates --Prof Najam hussain,MANUU,Hyderabad
7)Planets around other stars --Dr Anwesh majumdar,HBCSE
8)MOM and the road ahead -- Prof M.N.Vahia,TIFR
9)Problems in olympiads- Tejas shah,,Mumbai,Pro Subhas pathak,Pro Pradeep dasgupta,IAPT,Mumbai ,prof Priya hasan,Dr Manojendu choudury UM-DAE CBS
   visit for  olympiad information
http://olympiads.hbcse.tifr.res.in

Monday 31 March 2014

మానవ జీవన ప్రస్థానం ఏ దారుల్లో ? ఏ తీరుల్లో ?

       ఆఫ్రికాలో ఆవిర్భవించిన  మానవుడు భూమండలమంతటా ఎలా విస్తరించాడన్నది  అతిపెద్ద సైన్స్ మిస్టరీల్లో ఒకటి.1987 లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్త అల్లెన్ విల్సన్జన్యు విశ్లేషణల ఆధారంగా జరిపిన పరిశోధనతో  చరిత్రకు 2 లక్షల ఏళ్ల వయసుందని తేలింది.దాదాపు 50000 ఏళ్ళ  క్రితం తొలుత ఆసియా, ఆ తర్వాత ఆస్ట్రేలియా తదుపరి యూరప్,చివరగా అమెరికా భూభాగాలను  చేరుకున్నారు.3 రకాల ఆధారాల వల్ల ఇది తెలి సింది. 1)పురావస్తు అవశేషాలు 2)జన్యు విశ్లేషణలు 3)  సాంస్కృతిక చిహ్నాలు 
1) మారుమూలన ఉన్న గుహల్లో,విస్తారమైన తీర ప్రాంతాల్లోలభించిన శిలాజాలను అధ్యయనం చేయటం ద్వారా ఆయా ప్రాంతాలకు  ఎప్పుడు వచ్చాడో తెలిసింది .

2) ఇక రెండో దైన జన్యు విశ్లేషణల విషయానికి వస్తే వలస వెళ్ళిన వాళ్ళు తమతో పాటు  తమ పూర్వీకుల జన్యు  ఉత్పరి వర్తనాలను తీసుకెళ్ళారు . ఉదాహరణకు M 130 అనే జన్యు సంకేతం మలేషియా ప్రజల్లో 10% ఉంటె ,న్యుగినియాలో 15% ఆస్ట్రేలియాలో 60% ఉంది.అంటే వరుసగా  ఈ  ప్రాంతాల  ద్వారా వలసలు జరిగాయని స్పష్ట మైంది . అండమాన్ దీవుల ప్రజల మైటో కాండ్రియా ను పరిశీలించటం  ద్వారా ఆ ప్రాంతానికి మనుషులు తొలిసారిగా 55-65 వేల  ఏళ్ళ క్రితం వచ్చి ఉంటారని తెలిసింది.3 వ విషయానికి వస్తే తీర ప్రాంతాల్లో లభించిన సముద్ర గుల్లలు,రాతిపరికరాలు కొన్ని వివరాలను అందించాయి.ఇది మనిషి ప్రయాణించిన కాలం ,మార్గం .


 ఎందుకు ?
 stanford  విశ్వ విద్యాలయం లోని క్లయిన్ ఇలా వివరణ ఇస్తారు. 50 వేల ఏళ్ళ క్రితం ఆఫ్రికాలో ఉన్న ప్రజల  ఆలోచనా ధోరణిలో ఆకస్మిక మార్పులు వచ్చాయి.  దీనికి  కారణం భాషకు సంబంధించిన FOXP 2 అనే  జన్యువు .దీని వలన మనుషుల ఆలోచనా సరళి,అనూహ్యంగా మారి ఇతర ప్రాంతాలు వలస వెళ్ళటానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇంకో వాదన ప్రకారం 80-70 వేల ఏళ్ళ క్రిందటే సాంకేతిక సామాజిక మార్పులు సంభవించాయి.మనిషి జీవన స్థితి మెరుగవటంతో విపరీతంగా పెరిగి దక్షిణ ఆసియా వైపు విస్తరించటం ప్రారంభించింది.ఇదే మానవ మహాప్రస్థానానికి నాంది అంటారు మెల్లర్స్.వాతావరణ మార్పులు
కూడా ఒక కారణం అంటారు .
(ఈ వ్యాసం ఈనాడు నుండి   సేకరించినది వారికి ధన్యవాదాలు )

Sunday 23 February 2014

శాస్త్ర వేత్తలకు ప్రతిమలు

               మనం  సాధారణంగా ఎక్కడైనా స్వాతంత్ర్య సమర యోధుల,నాయకుల విగ్రహాలు విగ్రహాలు   చూస్తుం టాము.గుంటూరు జిల్లా బాపట్లలో dr దొప్పల పూరి మల్లిఖార్జున రావు గారు ప్రముఖ శాస్త్ర వేత్తల,తత్వ వేత్తల కాంస్య విగ్రహాలను ప్రతిష్టించారు.దీని కోసం తన ఇంటి ప్రాంగణాన్ని కేటాయించారు .సెలవుల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను  ఇక్కడకు తీసుకు వచ్చి  శాస్త్ర రంగం పై ఆసక్తిని పెంపొందించాలన్నధ్యేయంగా ఈ museum ప్రారంబించారు.
        2005 బాపట్ల విజయలక్ష్మి పురం లో తన గృహాన్ని ఏకంగా సైన్స్ museum గా మార్చారు.ఇందులో డార్విన్ ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు.ఖగోళ శాస్త్రం పై అవగాహనకు 2009 నుంచి home theatre ను 100  dvd  లను ప్రదర్శిస్తున్నారు.వీటిని శని ఆదివారాల్లో ఉదయం సాయంత్రం ఓ గంట సేపు ప్రదర్శిస్తారు. కొపెర్నికస్,కారల్ మార్క్స్,డార్విన్,గెలీలియో,న్యూటన్,einstein మొదలగు వారి విగ్రహాలు ఏర్పాటు చేసారు.charless darwin ట్రస్ట్ ఏర్పాటుచేసి 50 లక్షలు డిపాజిట్ చేసారు.ఈయన స్పూర్తి తో "forum for better bapala " పాటశాలల్లో scientist ల విగ్రహాలు ఏర్పాటు చేస్తుంది .
                ఈ వినూత్న మైన ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి .

Sunday 16 February 2014

నోబెల్ విజేత వెంకటరామన్ రామకృష్ణన్ మాటల్లో సైన్స్

                ఈ మధ్య కాలంలో నోబెల్ బహుమతి  సాధించిన భారతీయుడు వెంకట రామన్ రామకృష్ణన్ .భౌతిక శాస్త్రంలో phd చేసి,జీవ శాస్త్రంలో పరిశోధనలు చేసి  రసాయన శాస్త్రంలో నోబెల్ సాధించిన ప్రతిభావంతుడు  ఈయన . చదువు గురించి,సైన్స్ గురించి ఆయన మాటల్లోనే విందాం.
         "సైన్స్ మీద నాకు ఆసక్తి కలగడానికి మా ఉపాధ్యాయుడు టి .సి పటేల్ కారణం.ఆయన పుణ్యమా అని సైన్స్ లో ప్రాధమిక అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోగలిగాను.యూనివర్సిటీ స్థాయిలో మా ప్రొఫెసర్స్ నాణ్య మైన విద్య చెప్పిన కారణంగానే నేనీ రోజు ఈ స్థాయికి చేరుకోగాలిగాను.బరోడా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చినా ఫిజిక్స్ లో నాకున్న ఆసక్తి కారణంగా మెడిసిన్ సీట్ వదులుకున్నాను. ఫిజిక్స్ లో phd చేస్తున్నప్పుడు www.scientificamerican.com scientificamerican magazine చదువుతుండే వాణ్ని సైన్స్ కు సంబంధించిన అద్భుత ఆవిష్కరణలు అందులో వ్రాసేవారు.వాటిలో ఎక్కువ భాగం జీవ శాస్త్రానికి చెందిన వ్యాసాలు  ఉండటం వల్ల నా దృష్టి ఫిజిక్స్ నుండి జీవ శాస్త్రం వైపు మళ్ళింది.జీవితంలో నన్ను ప్రభావితం చేసిన వారిలో ముఖ్య మైన వ్యక్తీ రైబొజొము ల అంశం పై పరిశోధనలకు పురికొల్పిన పీటర్ మూర్.
         భారత దేశంలో విద్యా వ్యవస్థ గురించి తలచుకుంటే బాధగా ఉంటుంది. పిల్లలకు ఎంతసేపు చదువే లోకం బళ్ళో ఇంట్లోtution లో చదువు..చదువు. ఆడుకోవడానికి,సృజనాత్మక శక్తిని పెంచుకోవడానికి సమయం ఎక్కడిది! పాఠ్యపుస్తకాలు కాకుండా  పుస్తకాలు చదివే అలవాటు,వళ్ళు అలిసిపోయేలా మైదానంలో ఆడుకోవడం ఇవేవీ ఇప్పటి పిల్లలకు తెలియకుండా పోతున్నాయి బట్టీ పట్టే చదివే  చదువులతో  సైన్స్ లో మనకు ప్రపంచస్థాయి పుర స్కారా లెక్కంన్నించి వస్తాయి.నా ఉద్దేశం ప్రకారం పిల్లకు ఎంత తక్కువ homework ఇస్తే అంత మంచిది. ప్రముఖ ఆర్ధిక వేత్త అమర్త్యసేన్ అసలు పిల్లలకు homework  వద్దంటాడు.బాల్యాన్ని హరించే కోచింగ్ సెంటర్స్ ను పూర్తిగా నిషేదించాలంటారు. ప్రతిదాన్ని ప్రశ్నించి తెలుసుకునే మనస్తత్వం,ఆటా,పాటా ...పిల్లల్లొ సృజనాత్మకతను పెంచుతా యని చెబుతారాయన. school లో టీచర్స్ చక్కగా అర్థ మయ్యేలా చెప్పగలిగితే మనం కూడా శ్రద్ధగా మనసు పెట్టి పాఠాలు వింటే కోచింగ్ సెంటర్ల అవసరమే ఉండదు.
          సైన్స్ విద్యార్థులకు నేనిచ్చే సలహా ఏమిటంటే మీకు సైన్స్ మీద ఎంతో ఇష్టం, తపన ,ఆరాధన ఉంటేనే ఆ సబ్జెక్టు తీసుకోండి .ఒక్క సైన్స్ అనే కాదు ఏ సబ్జెక్టు అయినా అంతే . మీకు ఆసక్తి ఉన్న చదువు చదివితేనే దానికి సార్ధకత" .
     విద్యార్థులూ! ఆయన చెప్పిన మాటలు విన్నారు కదా!పాటిస్తారు కదూ !schools యాజమాన్యాలు కూడా గ్రహించ వలసిన విషయాలు ఆయన చెప్పారు .
  (ఈ వ్యాసం ఈనాడు ఆదివారం అనుబంధం లోనిది , వారికి ధన్యవాదాలు )
  వెంకటరామన్ రామకృష్ణన్ http://www.nobelprize.org/nobel_prizes/chemistry/laureates/2009/ramakrishnan-bio.html
పై లింక్ లో ఆయన గురించి తెలుసుకోండి .