శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Saturday 13 October 2012

జీవ వైవిధ్య విధ్వంస చిత్రం

  • ప్రపంచంలో క్షీరద జాతులు:5494
  • ఇప్పటికే అంతరించినవి:78
  • అంతర్దానం అంచున:191
  • కనుమరుగయ్యే జాబితాలో:447
  • సంఖ్య తగ్గిపోతున్నవి:496
  • గత 500 ఏళ్లలోమానవుల చర్యల వల్ల 969 జాతులు అంతరించాయి.నేడు క్షీరదాలలో 25% పక్షులలో 13% కోరల్స్ 33%ఉభయచరాలలో 41%, అంతర్థాన ముప్పును ఎదుర్కొంటున్నాయి క్షీరదాలు,పక్షులు ఎక్కువ గా ఇండోనేషియా,భారత్,బ్రెజిల్,చైనా వంటి దేశాలలోముప్పును ఎదుర్కొం టున్నాయి .
  • ప్రస్తుత జీవుల్లోదాదాపు సగం మేర,2100 సం : నాటికి అంతరించి పోవచ్చని అంచనా. వాతావరణ  ప్రతికూల పరిస్థితుల కారణంగానే 2100 నాటికి అన్నిరకాల జీవ జాతులు10-14 శాతం వరకూ తమ  ఉనికి  కోల్పోయే  ప్రమాదముందని  US NATIONAL ACADEMY  OF SCIENCE హెచ్చరించింది.
  • గత 100 ఏళ్లలో వ్యవసాయ పంటల్లోని  జీవ వైవిద్యం మూడొంతులు నాశన మైంది.ఇప్పుడు ప్రపంచం లోని సగానికి పైగా దేశాలకు కేవలం నాలుగు రకాల పంటలే  ఆహారిన్నిస్తున్నాయి.నెల సారవంతంగా  మారడాని కి  పట్టే  సమయం కంటే ఇప్పుడు వేగంగా సారాన్ని కోల్పోతుంది.ప్రపంచ వ్యాప్తంగా13 నుంచి18 రెట్లు  వేగం గా ఇది జరుగుతుంది.
  • భారత్,అమెరికా,ఇంగ్లాండ్,ఆస్ట్రేలియ,soth africa,brazil దేశాలలోపురుగు మందుల వాడకం వల్ల పర్యావర ణానికి వాటిల్లిన నష్టాన్ని ఓ  ఏడాదికి లెక్కిస్తే  అన్నింటాకలిపి వార్షిక నష్టం10,000 కోట్ల  డాలర్సర్స్ 
(ఈ సమాచారం ఈనాడు పత్రిక నుండి సేకరించింది.వారికి ధన్యవాదాలు.)

Tuesday 9 October 2012

చెట్లు మన నేస్తాలు.

   మానవ జాతికి చెట్లు  ఎంత మేలు చేస్తున్నాయో తెలుసుకుంటే   చాలా ఆశ్చర్యం వేస్తుంది .చెట్ల వలన మనం పొందే లాభాలు తెలుసుకోండి మరి .

  •   రెండు పెద్ద చెట్లు రోజుకు నలుగురున్న కుటుంబానికి సరిపడా ప్రాణ వాయువు నిస్తాయి .
  • ఒక పెద్దచెట్టుకు రెండు నుండి నాలుగు  లక్షల ఆకులు ఉంటాయి.ఇవన్నీ కూడా వడబోసే filters లాగా పనిచేస్తాయి.అంటే  గాలిని శుభ్ర పరుస్తాయి.
  • ఒక ఎకరం విస్తీర్ణం లో దట్టంగా   ఉండే చెట్లు ఏటా  13 టన్నుల దుమ్ము,ధూళిలను  తొలగిస్తాయి.
  • చెట్లు లేని రోడ్ల దగ్గర లీటరు గాలిలో 10 నుండి 12 వేల ధూళి కణాలు ఉంటె చెట్లు ఉన్న రోడ్ల దగ్గర కేవలం 3  వేలే ఉంటాయి
  • చెట్టు సహజ మయిన aircondition లాగా పనిచేస్తుంది.ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు  100  gallons నీటిని గాలి  లోకి తేమ రూపంలో వదులుతుంది.అందుకే  చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది. 
  • ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని అయిదు రూం ఎయిర్ కండీషనర్స్ రోజుకు ఇరవై గంటల  వంతున  పని  చేస్తేనే గాని ఇవ్వలేవు.
  • ఒక ఎకరం విస్తీర్ణం లోని చెట్లు ఏడాదికి 2.6 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను వాతావరణం నుండి తొలగిస్తాయి.
  • చెట్ల వేళ్ళు భూగర్భ జలాలనుండి  ప్రమాద కరమైన కాలుష్యాలను తొలగించి శుద్ధి చేస్తాయి.
  • ఒక football ground ఆవరణలో ఉండే చెట్లు (సుమారు 400 ) వాహనం ఏడాది పాటు వదిలే కాలుష్యాన్ని వాతావరణం నుండి తొలగించ గలవు.
  • 50 ఏళ్లలో ఒక చెట్టు 37,500 డాలర్ల (సుమారు 1,90,000) విలువైన ఆక్సిజన్ ను ఇస్తుంది. 

ఇంత మేలు చేసే చెట్లను మనం కాపాడుకోవాలి.ప్రభుత్వం చేసిన walta చట్టాన్ని పటిష్టంగా అమలు  చేయాలి.
( ఈ సమాచారం ఈనాడు   పత్రిక నుండి సేకరించినది.వారికి ధన్యవాదాలు) 

Friday 5 October 2012

జీవ వైవిధ్యం దెబ్బతింటే ఏమి జరుగుతుంది? 1



          పంటల వైవిధ్యం దెబ్బ తిన్నది.జొన్న,సజ్జ,రాగి,కొర్ర అంతరిస్తున్నాయి.వీటిల్లో ఉన్న పోషకాలతో పశువులు బ్రతుకుతున్నాయి.వాటి విసర్జితాలు పొలానికి బలమైన ఎరువులు.ఒకప్పుడు రైతు 10,000 రకాల పంటలు పండిం చేవాడు.ప్రస్తుతం  200 లోపే పండింస్తున్నాడు.ఈ గింజలను పక్షులు,జంతువులు అన్నీ తింటాయి.కానీ ఇప్పుడు అన్నీ వాణిజ్య పంటలే!లక్షలు పోసినా పంటకు దిక్కు లేదు.బహుళజాతి విత్తనాలు,రసాయనాలు,క్రిమి సంహార కాలు మట్టిని విషంగా మారుస్తున్నాయి.వాన పాములు,ఎండ్ర కాయలు అంతరిస్తున్నాయి.
         దోమల గుడ్లు కప్పలు తినేవి.కప్పల్ని పాములు తినేవి.పాముల్ని గద్దలు వేటాడేవి.పిచ్చుకలు మిడతలదండు   ను తిని పంటను కాపాడేవి.ఈ చక్రం మనిషి స్వార్ధానికి చిన్నాభిన్నం అవుతుంది.పాములతోలు తో ఫ్యాషన్ వస్త్రాలు  తయారు చేస్తున్నారు.గద్దలకు ఆహారం కరవైంది.ప్రతి 20 నిముషాలకు ఒక జీవ జాతి అంతరించి పోతుంది.
      cell phone towers radiation వలన ఇప్పటికే పిచ్చుకలు అంతరిస్తున్నాయి.కొండలపైకూడా ఏర్పా టు చేయటం తో తేనెటీగలు కూడా నాశనం అవుతున్నాయి.ప్రకృతి కోసం సాంకేతికతను ఉపయోగించాలి పారిశ్రామిక వ్యర్తాల్ని తగ్గించి,కాలుష్యాన్ని నివారించి,చెత్తను సద్వినియోగం చేసుకుంటే ప్రకృతి స్వచ్చంగా మారుతుంది.జీవ వైవిధ్యానికి నష్టం  కలిగించకుండానే ఆర్ధిక ప్రగతి సాధించడానికి చాలా మార్గాలున్నాయి.
       సృష్టిలో మూడు కోట్ల వృక్ష జంతు జాతులున్నాయి.ఇప్పటికి గుర్తించింది15 లక్షలు మాత్రమే!అధిక జనాభాను నియంత్రించుకోవాలి.ఇదే వేగంతో జనాభా పెరిగితే అడవి జంతువులనే కాదు.తోటి మనుషుల్ని పీక్కు తినాల్సి వస్తుం ది.అడవుల్ని,జంతువుల్ని,నదుల్ని,సముద్రాలను,ధ్వంసం చేయటం వలన కాలుష్యం,కరువు కాటకాలు,మాయ రోగాలు,green house effect దాపురిస్తున్నాయి.

Monday 1 October 2012

నేటి నుంచే అంతార్జాతీయ జీవ వైవిధ్య సదస్సు


          అంతార్జాతీయ జీవ వైవిధ్య సదస్సుహైదరాబాద్ లో ఈ రోజు ప్రారంభ మయింది.(Nature protects if she is protected) ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నది  ఈ సదస్సు ముఖ్య ఉద్దే శ్యం. సదస్సు పేరు cop-11. 193 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సు హైదరాబాద్ లోని HICCలో october 1 నుండి 19   తేది వరకు జరుగుతుంది.ఈ సందర్భంగా ఈనాడు,సాక్షి, ఆంధ్ర జ్యోతి పత్రికల్లోని సమాచారంలో కొంత భాగాన్ని ఇక్కడ మీకు అందిస్తున్నాను.వారికి ధన్యవాదాలు.
          ఈ సృ ష్టి కొన్ని లక్షల జీవరాశులకు నివాసం.మొదట్లో సృష్టి ఎంతో వైవిధ్యంగా ఉండేది.20 లక్షల సం:క్రితమే మనిషి పుట్టాడు.ప్రకృతిని తన కంటే చాలా బలమైనదిగా అంగీకరిస్తూ దానిని దేవతగా పూజిం చాడు.మొదట్లో ప్రకృ తి గురించి తెలుసుకుంటూ జీవులతో స్నేహం చేస్తూ ఉన్నాడు.జంతువుల మాంసం తినటం ప్రారంబించిన తరు వాత,పంటలు పండించుకునే తెలివివచ్చిన తరువాత అతనికి ధైర్యం వచ్చి ప్రకృ తి నాకోసం పుట్టిందని భావిస్తూ దానిని ఉపయోగించుకుంటూ దోచుకుంటూ,నాశనం చేస్తూ వస్తున్నాడు తాను ఈ సృష్టిలో ప్రత్యేక మని భావిస్తు న్నాడు.కానీ ప్రకృతి దృష్టిలో అందరు సమానమే!.
         వైవిధ్యమే ప్రకృతి లోని రహస్యం.మనుషుల వలన ఎన్నో జీవ జాతులు అంతరించి పోతున్నాయి ఆదిమ దశలో వన్య మృగాల్ని చంపి ఆకలి తీర్చుకున్నాడు.మనిషి నాగరికత నేర్చుకున్న కొద్ది అడవుల్ని నరికేసి గ్రామా ల్ని కట్టుకున్నాడు. జంతువుల తోలు తీసి అమ్ముకోవడానికి బొమ్మల్లాగా అలంకరించుకో వడానికి ఎన్నో అమా యక జీవుల్ని పొట్టన పెట్టుకున్నాడు.ప్రకృతిలో వచ్చేమార్పుల కనుగుణంగా జీవు లు అంతరించి పోవచ్చుకానీ మనిషి స్వార్థం మూలంగా అంతరించి పోకూడదు.గనుల త్రవ్వకాలు,రవాణా మార్గాలు,పారిశ్రామికీకరణ జంతు వులకు అవరోధంగా మారాయి.
         10 సం :క్రితం 10,000 పులులుండేవట ప్రస్తుతం 1500 లోపే ఉన్నాయి.ఎలుగుబంట్లు,ఏనుగులు ఊర్ల మీద దాడి చేస్తున్నాయంటే ఈ అసమ తౌల్యం వల్లనే.వన్యప్రాణులకు అడవి ఒక స్వర్గం.పులులుంటే చెట్లను వేటగాళ్ళు ఏమీ  చేయలేరు .చెట్లు ఎక్కువుంటే వేటగాళ్ళు ఏమీ చేయలేరని అడవి జంతువుల విశ్వాసం.చెట్లు,మృగాలను మని షి ధ్వంసం చేస్తున్నాడు.వాటిని ప్రేమించే గిరిజనులను తరిమి కొడుతు న్నాడు.భూమి వేడెక్కుతుంది అన్నా వరద లు ముంచెత్తినా,భూసారం క్షీనించినా కారణం అడవులు నాశనం కావటం వల్లనే .
        నదులను,సముద్రాలను మనిషి కలుషితం చేస్తున్నాడు.సముద్ర జీవులను వేటాడి ఎగుమతులు చేసి కోట్లు గడిస్తున్నాడు.నక్షత్ర తాబెల్లను,నీటి గుర్రాలను నాశనం చేస్తున్నాడు.అన్ని పారిశ్రామిక వ్యర్థాలను నీటిపాలు చేసి మత్యసంపదను ,అందులోని జీవుల  వినాశనానికి కారణమవుతున్నాడు.  

Saturday 15 September 2012

ప్రముఖ అణుశాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ కు శ్రద్దాంజలి

               ప్రముఖ అణుశాస్త్రవేత్త  కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గత శనివారం (8/9/2012) ముంబైలోమదుమేహం ,కిడ్నీ,కాలేయ సమస్యలతో బాధ పడుతూ కన్ను మూశారు.ఆయన ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబ రావు కుమారుడు.ఆయనకు భార్య(లలిత) ,కుమారుడు,కుమార్తె ఉన్నారు.ఈ యన 1949 september 14 న మద్రా స్ లో జన్మించారు.వృత్తి పరంగా అణుధార్మిక శాస్త్రవేత్త .మంచి సితార్ విద్వాంసుడిగా,రంగస్థల నటుడిగా,రచయిత గా పేరు గడించాడు మద్రాస్ university లో physics లో డిగ్రీ ,ఆంధ్ర university లో M.sc,Mumbai లో  phd చేసి బాబా అణు పరిశోధనా కేంద్రం లో పని చేసారు.మూడు దశాబ్దాలుగా అణు ధార్మిక పరిశీలనా పరికరాల రూప కల్పన లో పాల్గొంటున్నారు.అమెరికా లోని అట్లాంటా లో consultant గా ఉన్నారు.చాలా కాలంగా అనేక తెలుగు పత్రికలలో సంగీతం మీదా ,శాస్త్ర విజ్ఞానం మీదా రచనలు చేస్తున్నారు.
           ఈ 21 వ శతాబ్దంలోకూడా ప్రకృతి పట్లే,సమాజం పట్ల,మనిషి పట్ల ఉండవలసిన హే తుబద్ద ,భౌతికవాద ,శా స్త్రీయ ఆలోచనలు చాలా మందిలో ఉండడం లేదు.ఇటువంటి స్థితిలో తెలుగులో అందరికి అర్థమయే రీతిలో సూటిగా సరళంగా వీరి రచనలు సాగాయి.అణువుల శక్తి,ప్రకృతి పర్యావరణం,మనుషులు చేసిన దేవుళ్ళు ,విశ్వాంతరాళం జీవ కణాలు నాడీకణాలు,మానవ పరిణామం, జీవశాస్త్ర విజ్ఞానం -సమాజం లాంటి పుస్తకాలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి.
     ఈయన బ్లాగు కూడా వ్రాసేవారు.దీనిని నేను ఇంతకు ముందు చదివాను.ఆయన పుస్తకాలు మానవ పరిణామం విశ్వాంతరాళం  సమాచారం నాకు radio లో science సంభాషణలు చెప్పటంలో  చాలా ఉపయోగ పడింది.వారికి సర్వదా రుణపడి ఉంటాను.ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను.
ఈయన బ్లాగు 
http://rohiniprasadkscience.blogspot.in/

Sunday 26 August 2012

రోదసియానం(ఆడియో)

          విజ్ఞాన శాస్త్రంలోని పలు అంశాలపై మార్కాపురం radio station వారు నా తో జరిపిన సంభాషణలలో మొదటిది  అయిన "రోదసియానం"  ఈ లింక్ లో వినగలరు.ఈ కార్యక్రమాన్ని నాతో జరిపిన  శ్రీ మహేష్ గారికి ధన్యవాదాలు. మొత్తం 12 episodes గా ప్రసారం అయిన వీటిని ఇచ్చి నన్ను ప్రోత్సాహించిన శ్రీ మహేష్ గారికి సాంకేతిక  సిబ్బంది అయిన శ్రీ నరసింహారావు గారు,తదితరులకు నా కృతజ్ఞతలు.వీటిని తరువాత  ఈ బ్లాగులో పోస్ట్ చేస్తాను.      
http://www.4shared.com/music/Xyi7EIzn/1RODASIYANAM-EDITED.html

Sunday 19 August 2012

అంగారక గ్రహం(mars) విశేషాలు


       ఈ మధ్య curiocity అంగారకుని పైకి వెళ్ళిన తరువాత అందరి దృష్టి అంగారకుని వైపు మళ్ళింది.ఇది ఆకాశంలో ఎర్రగా కనబడుతుంది.ఇనుము oxide రూపంలో ఉండటం వలన అలా కనపడుతుంది.భూమి తరువాత కుజ గ్రహం పై జీవం ఉండవచ్చునని శాస్త్రజ్ఞులనమ్మకం.1964 లో merinar -4,అనే రోదసీ నౌక కుజుడి ప్రక్కనుండి ప్రయాణించిం ది.1976  లో అమెరికా ప్రయోగించిన vyking  నౌకలు తొలిగా కుజుడి మీదకు దిగి ఆరేళ్ళపాటు వర్ణ చిత్రాలను  ప్రసా రం చెయ్యగలిగాయి.1988, లో రష్యా కుజుడి ఉపగ్రహాలైన ఫోబోస్,daimose ల కోసం ప్రయోగించ బడ్డాయి. hubble telescope  సహాయంతో కుజుడిని ఫొటోలు తీస్తున్నారు.దీని యొక్క సరాసరి వ్యాసం 6780km భూమితో  పోలిస్తే సగం,చంద్రునితో పోలిస్తే రెట్టింపు ఉంటుంది.భూమిలో 10 వ వంతు ద్రవ్య రాశిని కలిగి ఉంటుంది.భూమితో పోలిస్తే 38%  గురుత్వాకర్షణ   శక్తి కలిగి ఉంటుంది.నీటికన్నా 3.9 రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది.భూమి సాంద్రత నీటి కన్నా 5.5 రెట్లు ఎక్కువ.
       అయ స్కాంత క్షేత్రం గ్రహమంతా విస్తరించి లేదు.ఇది సూర్యుడి నుండి దూరంలో నాలుగవది.భూమి తర్వాత ఉంటుంది .సూర్యుడి నుంచి 23 కోట్ల కి.మీ సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి 320  రోజులు  పడుతుంది వాతావ రణం లో 95%,co2 3% nitrogen,1.6% organ ఉంటాయి.దీని ఆత్మ భ్రమణ కాలం24 గంటల  39 నిమిషాల  35 సెకండ్స్ .సౌర వ్యవస్థలో అన్నింటికన్నా ఎత్తయిన శిఖరం కుజుడి మీద ఉంది.olympus mones ఒక చల్లారిన అగ్ని పర్వతం.ఇది evarest కు మూడింతలు ఉంటుంది.ద్రువాలు 25 డిగ్రీలు   ఒరి గి ఉండటం వలన రుతువులు ఏర్పడ తాయి.ఉపరితల వాతావరణ పీడనం భూమితో పోలిస్తే 1/100 వ వంతు ఉంటుంది.ఉపరితల గాలులు గంటకు 0-20 మైళ్ళ వేగంతో వీస్తుంటాయి.ధూళి తుఫాన్స్ వస్తుం టాయి.ఉపరితలం పై సరాసరి ఉష్ణోగ్రత -55 డిగ్రీల  సెల్సియస్  ధ్రువ  ప్రాంతాల్లో  రాత్రి  పూట  -128 డిగ్రీల  celsius  ఉష్ణోగ్రత ఉంటుంది.పగటి సమయంలో అంగారక మధ్య ప్రాంతం లో 27 డిగ్రీలు ఉంటుంది.
      కుజుడి పై ఉల్కలు డీ కొట్టిన క్రేటర్ సాక్ష్యాలు ఎక్కువే.లోయలు పెద్దవే నాలుగు వేల కి.మీ లోతు ఉన్నవి ఉన్నా యి.భూమి మీద కదిలినట్లుగా ఫలకాలు ,plate tectanics ప్రక్రియల ద్వారా కదలడం వంటిది కుజుడి మీద కనబడ దు.అగ్నిపర్వతాలు ప్రవహించిన గురుతులున్నాయి.ఉల్కా పాతాల గోతులు కనిపిస్తాయి.కుజుడి పై సగటు ఉష్ణోగ్రత -55  డిగ్రీలు.ఉష్ణోగ్రత  -133 నుండి  27 డిగ్రీలు  వుంటుంది .భూమి తరువాత జలరాశి,జీవ కణాల ఉనికికి కుజుడి మీద అవకాశం ఉందని భావిస్తున్నారు.ధ్రువాల్లో మంచు గడ్డ కట్టి కనిపిస్తుంది.గతంలో నీరు వరదగా పారిన దాఖలా లు నదీశయ్యా ప్రాంతాలు కనిపిస్తున్నా యి.నీరుంటే తప్ప రూపొందలేని hematite వంటి ఖనిజాల జాడ తెలిసింది కుజుడి పైనుండి భూమి పైకి పడ్డ ఉల్కలో సేంద్రియ పదార్థాలు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మార్స్ పైకి pathfinder, spirit, sojourner వంటి కొన్ని ప్రయోగాలు జరిగాయి.ఇవి కుజుడి పై దిగి ఫొటోస్ తీసాయి.కుజుడి పైకి మనుషు లు వెళ్ళే ప్రయోగాలు అమెరికా ప్రారంభించింది.కాని దానికి మరో పాతిక సంవత్సరాలు పట్టవచ్చు.ప్రస్తుతం జరిగిన ఈ curiocity ప్రయోగం దానికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు.

Wednesday 8 August 2012

అంగారకుని పై జీవాన్వేషణ


                 అంతరిక్ష పరిశోధనల్లో  అత్యంత అధునాతనమైన వ్యోమ నౌక /రోవర్ curiocity  సోమవారం       ఉదయం11 గంటలకు అంగారకుని పై దిగింది.NASA లోని జెట్ ప్రొపల్షన్ laboratory లో శాస్త్ర వేత్తలు ఒకరినొకరు హత్తుకొని ఆనందంతో పొంగిపోయారు.గతంలో ఎప్పుడైనా జీవం ఉనికిలో ఉందా!భవిష్యత్తు లో జీవం ఉనికి లో ఉండటానికి అవసరమైన పరిస్థితులు అక్కడున్నాయా!వంటి ప్రశ్నలకు ఇది సమా ధానం కనుగొనబోతుంది.దిగిన కొద్ది సేపటికే చిన్న సైజు ఫోటోను ,మరొక భారీ సైజు ఉన్నమరో  ఫోటోను  పంపించి అక్కడి మట్టిని,రాళ్ళను భూమి పైకి తీసుకు వచ్చి వాటిని పరీక్షించి project లకు  వ్యోమగా ముల్ని అక్కడికి పంపించాలన్నఆలోచనకు మార్గం వేయనుంది.జీవం ఉనికికి అత్యవసరమైన  corbon,nitrogen,phospurus,sulphur,oxygen వంటి మూలకాలను ఇది అన్వేషిస్తుంది.
           ఈ వ్యోమ నౌక plutonium వేడి నుంచి పుట్టే విద్యుత్తు ద్వారా పనిచేస్తుంది.ఇందులో భారత శాస్త్ర వేత్తలు అశ్విన్,అమితాబ్ ఘోష్,అనితాసేన్ గుప్త,రవి ప్రకాష్ పాల్గొన్నారు.ఇందులో అశ్విన్ ఈ యాత్రకు deputy project scientist గా ఎదిగారు.రానున్న రోజుల్లో ఆయన నేతృత్వం లోని శాస్త్రవేత్తల బృందం దాదాపు 400 మంది అంగారకుడిపై లోగడ ఎప్పుడైనా జీవం ఉనికికి అనువైన  పరిస్థితులు ఉన్నాయా,  లేవా అని తేలుస్తుంది.ఇప్పటి వరకు అంగారకుని పైకి మేరైనర్ 4,6,7,9 vyking1,2 mars global surveyor,odissee ,mars express,mars pathfinder,mro,spirit,opportunity,feeniks వంటి అనేక రోబోటిక్ యాత్రలు జరిగాయి.

Saturday 4 August 2012

అంగారక గ్రహం పైకి curiocity


           ఈ విశ్వంలో భూమి మీద తప్ప మరెక్కడా జీవం ఉన్న ఆధారాలు మనకు దొరకలేదు.మన సౌర కుటుం బంలోజీవం మనుగడ సాగించడానికి కొంత మేరకు అనువైనది అంగారక గ్రహమని భావిస్తున్నారు ఒకప్పుడు ఇక్కడ నీరు ఉండేదని ,జీవుల మనుగడకు అనుకూల పరిస్థితులు ఉండేవని అనుకుంటున్నారు.USA వారిNASA   26/11/2011  తేదీన  ఫ్లోరిడా లోని cape canavaral వైమానిక స్థావరం నుండి అంగారక గ్రహం పైకి "curiocity"అనే rovar ను ప్రయోగించింది.ఇది 5.6 కోట్ల కిలోమీటర్స్ దూరం ప్రయాణించి సోమవారం అంగారక గ్రహం పైకి దిగనుంది. .నీటి ఆనవాళ్ళున్నగేల్ బిలం లోకి దీన్ని దించుతున్నారు.ఇది ఒక సంచార ప్రయోగశాల.శిలలను చూసి,నేలను త్రవ్వి జీవం ఆనవాళ్ళను పసిగడుతుంది.దీనిలో నీటిని గుర్తించే పరికరాలు,ఆధునిక కెమెరాలు ఉన్నాయి.ఇది 900 కిలోగ్రాముల బరువు కలిగి ఉంది.దీన్ని నిర్మించటానికి 250 కోట్ల dollars ఖర్చు అయ్యాయి .గంటకు 13 వేల మైళ్ళ వేగంతో అంగారకుడి వాతావరణంలోకి దూసుకు వచ్చి ఏడు నిమిషాల వ్యవధిలో దానిపై దిగాలి.రాకెట్ సాయంతో పనిచేసే skycrane ద్వారా ఈ రోవర్ ను క్రిందికి దించుతారు.

Saturday 16 June 2012

ప్రక్రుతి సూత్రాలు:చివరి మాట


                 పదార్ధమంతా  మిధ్య అనేవాళ్ళు ,జీవ పరిణామాన్ని వ్యతిరేకించే వాళ్ళు 18  వ నియమాన్ని చూసైనా కళ్ళు తెరవాలి.మానవుడు,ప్రక్రుతి పరిశీలన  ద్వారా ,శ్రమ ద్వారా ఆధునిక మానవ సమాజానికి బీజం వేసాడు.పైన పేర్కొన్న సూత్రాల పరిధిలో సాగుతున్న నేటి శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగానో అభి వృద్ది చెందాయి.అయితే ఈ విజ్ఞాన శాస్త్ర ఫలితాలను కొందరు మాత్రమే అనుభవిస్తున్నారు.సామాన్య ప్రజా నీకానికి ఈ ఫలితాలు నేటికీ అందుబాటులో లేవు.అత్యంత ధనిక వర్గం ప్రపంచ వనరులలో 85% మేరకు వినియోగిస్తున్నారు.కాగా అత్యంత పేద వర్గాలకు కేవలం ప్రపంచ వనరులలో 1% మాత్రమే  అందుబాటు లోఉంది .సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్ర సాంకేతిక రంగాల పరి జ్ఞానాన్ని ఉపయోగించాలి.ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని  శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధనలు సాగాలి.
        ఆధునికతను సంతరించుకున్న శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో పరోక్షంగాను,ప్రత్యక్షం గాను అందరి సమిష్టి కృషి వున్నా ప్రజా బాహుళ్యం అనేక అశాస్త్రీయ  పోకడలతోనూ,మూఢాచారాలతోను   చాందసత్వం తోను కొట్టుమిట్టాడుతోంది.ప్రాంతీయ ,కుల ,మత,వర్ణ,భాషా తదితర అనేకానేక అశాస్త్రీయ  ప్రాతిపదికల ఆధారంగా ప్రజలలో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు.యుద్ధ వాతావరణం ,అరాచకత్వం ఉగ్రవాదం,మతోన్మాదం,మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి.ఇది అశాష్ట్రీయం.సైన్సు సూత్రాలకు విరుద్ధం.ప్రజలందరిలో సౌభ్రాతృత్వం,సాంస్కృతిక వికాసము,వివేకం కలిగించడం ద్వారా  ఐకమత్యాన్ని పెంపొందించాలి.తద్వారా ప్రపంచ శాంతిని శాశ్వతం చేయాలి.ఈ లక్ష్య సాధనకు ప్రజా సైన్సు ఉద్యమాల ఆవశ్యకత ఎంతో ఉంది.ఈ ఉద్యమాల తీవ్రతను బట్టే ప్రజలకు శాస్త్ర సాంకేతిక రంగ ఫలితాలు దక్కుతాయి .ప్రజా సైన్సు ఉద్యమం పట్ల సరియైన అవగాహన కలిగిన నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్య మవుతుంది.
            "ప్రకృతి సూత్రాలు-శాస్త్రీయ దృక్పధం" అనే అంశాన్ని అధ్యనం చేయడం ప్రజా సైన్సు ఉద్యమ నిర్మాణం లో ఒక అత్యవసర భాగం.సమసమాజ స్థాపనకు కృషి చేసే శక్తుల పట్ల సానుభూతి ప్రకటిస్తూ స్వతంత్రంగా ప్రజా బాహుళ్యంలో ప్రజలకోసం సైన్సు,ప్రగతి కోసం సైన్సు ,ప్రపంచ శాంతి కోసం సైన్సు ,అనే నినాదాలతో కృషి చేస్తున్న అల్ ఇండియా పీపుల్స్ సైన్సు నెట్ వర్క్ (APSN) అనుబంధ సంస్థ జనవిజ్ఞాన వేదిక ఉద్యమాల్లో భాగమై భారత రాజ్యాంగం సూచించిన శాశ్త్రీయ దృక్పద వ్యాప్తిలో అందరం ఉద్యమిం చవలసిన తరుణమిదే!    

Tuesday 12 June 2012

ప్రకృతి సూత్రాలు :18 వ సార్వత్రిక నియమం


                                             జీవులన్నింటి మధ్య పాదార్థిక బంధం వుంది.
                                                 (All Life Forms are Connected).
     జీవులన్నీ పరిణామ క్రమంలో ఉద్భవించాయని మనకు తెలుసు.పరిణామమనే జీవ వృక్షంలో రెండు ప్రధాన మైన కొమ్మలున్నాయి.ఒకటి వృక్ష జాతి.మరొకటి జంతు జాతి.ఈ రెండు జాతుల్లో దేనికీ చెందని మిగిలిన జాతులు కూడా ఆ పెను జీవ వృక్షానికి అంటుకునే వున్నాయి.
         వృక్ష జాతులనే అతి పెద్ద కొమ్మలో పలు శాఖలు ఉన్నాయి.అవి ఎన్నోకుటుంబాల రూపంలో ఉండవచ్చును. ఆ శాఖలు మళ్ళీ శాఖోపశాఖలై అన్ని రకాల వృక్ష జాతులకు ఆలంబనగా వుంది.అలాగే ఆ మహావృక్షంలోని మరో కొమ్మ జంతు జాతి.అందులోమళ్ళీ ఎముకలు లేని జీవులు(invertibrates),ఎముకలున్నజీవులు(vertibrates) అనే రెండు ప్ర ధాన గ్రూపులున్నాయి.ఇవన్నీమళ్ళీ ఎన్నోవర్గాలుగా వున్నాయి.ఈ శాఖల్లో కోతులు,మానవుడుండే క్షీరదాల శాఖ అందులో మళ్ళీ primates శాఖలు ఉద్భవించాయి.కాబట్టి ఆ వృక్షపు ప్రధాన శాఖలు ,ఉపశాఖలు ఆ తర్వాతి శాఖోప శాఖల్లో ఉన్నఅన్ని రకాల జీవులు సందానించబడి ఉన్నాయనే అర్థం కదా!
   ఈ ఉదాహరణ ప్రకారం భౌతికంగా అన్నీ కలిసి ఉన్నట్టు అర్థం కాదు.ఈ కాలగమనంలో పరిణామక్రమంలో ఎక్కడో ఎప్పుడో ఒకప్పుడు అవి,ఇవీ అన్నీ బంధువులే !ఒక కుటుంబంలో వంశ వృక్షమని ,వారి మధ్య ఏదో ఒక విధమైన రక్తసంబందాన్ని (blood relation) చూడగలుగుతున్నాము.అలాగే ఇంకా వెనక్కిపోతే మనుషులందరికీ సంబంధం ఉన్నట్లు అర్థం.
  కాలగమనంలో ఒక చోటునుంచి కోతులు,మనుష్యులు అటు ఇటు పరిణామం చెందారు,కాబట్టి కోతులు మనుషులు మధ్య కూడా పాదార్థిక (he,she తదితర జన్యు బాంధవ్యం )ఉండే ఉండాలి.కోతులకు మనుషులకు,అమీబాలకు ఆ తర్వాత యుగ్లీనా,అల్గేలకు,అక్కణ్ణించి వేప చెట్లకు గోంగూరకు కూడా జన్యు పరంగా దూర బంధుత్వం ఉన్నట్లు అర్థం.ఇలా జంతువులకు,వృక్షాలకు,మనుషులకు బంధుత్వం ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.ఇక మనుషులంతా బంధువులు అని చెప్పటానికి సందేహమే లేదు.

Sunday 10 June 2012

ప్రకృతి సూత్రాలు: 17 వ సార్వత్రిక నియమం



      (All Life is Based on the Same Genetic Code )
     జీవులను జీవంతో ఉంచేవి,కణం లోని వివిధ జీవ భౌతిక చర్యలేనని ,బహుకణ జీవుల్లో కణాలతో పాటు కణజాలాలు (tissue) కూడా కీలక ధర్మాలు నిర్వహిస్తాయని తెలిసిందే .కణాలతో జీవ రసాయనిక చర్యలు నడవాలంటే కొన్ని enjymes కావాలి. ఇవన్నీ రసాయనిక ప్రోటీన్ సంబంధ పదార్థాలు.ప్రోటీన్లు ఒక దండ అనుకుంటే ఆ దండలో పూసల్లాగా ఎమినో ఆమ్లాలు అనే చిన్న చిన్నఅణువులు ఉంటాయి.అంటే ఎమినో ఆమ్లాలను రసాయనిక బంధంతో కలిపి ఉంచితే ప్రోటీన్స్ ,enjymes,ఆ  ప్రోటీన్స్ తో కండరాలు ,రక్తనా ళాలు ,చర్మము  తదితర భాగాలు తయారవుతాయి.
         గుండె లోపల ఎన్నో బలమైన కండరాలున్నాయి.కండరాల సందానంతోనే ముఖ కవళికలు ఆధా రపడతాయి.అయితే ఈ ప్రోటీన్ లలో ఏయే ఎమినో ఆమ్లాలు ఏయే వరుసలో ఉండాలో అదే విధంగా తయారు చేసే యంత్రాంగం ఎక్కడుంది?అదే జన్యు స్మృతి.ఇది DNA అనే పెద్ద మెలేసిన నిచ్చెన లాంటి నిర్మాణంలోఉంటుంది.ఇది కాన కణ కేంద్రకం లోనే ఉంటుంది.ఈ మెలిక నిచ్చెనలో అటు,ఇటు న్యుక్లియో టైడ్స్  అనే భాగాలు వరుసలో వుంటాయి.క్రోమోజోములలో ఉన్న DNA కి శరీరపు కండరాలకు సంబం ధం వుండటం వల్లే తల్లిదండ్రుల పోలికలు బిడ్డలకు వస్తుంటాయి.
        మన శరీరానికి సుమారు 20 రకాల ఎమినో ఆమ్లాలు  అవసరం (ప్రకృతిలో సుమారు 100 రకాల ఎమినో ఆమ్లాలున్నాయి.)ఈ 20 ఎమినో ఆమ్లాలతో మాత్రమే అన్ని జీవులలోని ప్రోటీనులు ఏర్పడ్డాయి అమీబా అయినా ,ఏనుగు అయినా, వేపచెట్టు అయినా, దోమ అయినా మనిషిలో అయినా బల్లి లోను ఈ 20 ఎమినో ఆమ్లాలే ఉంటాయి.ఒక్కో ఎమినో ఆమ్లానికి DNA లోని కోడానులు ప్రతినిధులుగా ఉంటాయి ఫలాని కోడాను ఫలాని ఎమినో ఆమ్లానికి ప్రతినిధి అనడాన్ని జన్యు స్మృతి(genetic code) అంటారు.
     ఇంత సూక్ష్మ మైన జన్యు స్మృతి మొక్కలైనా జంతువులైనా అన్ని జీవులలోను ఒకే విధం గా ఉంటుంది.సైన్సు ప్రకారం జీవులు ఇంత గొప్పగా పాదార్తికంగా  ఏకమై ఉండగా మనుషుల్లోనే మనుషుల మధ్య కులాల ,మతాల పేరుతో చిచ్చు పెట్టటం ఎంత వరకు సబబు?  

Friday 8 June 2012

ప్రకృతి సూత్రాలు: 16 వ సార్వత్రిక నియమం



                                         జీవం కేవలం కణాల్లో మాత్రమే ఉండగలదు
                                                 (Life Exists only Inside a Cell)
            భూమ్మీద మాత్రమే జీవం ఉన్నఆధారాలున్నాయి .భూమి లాంటి పరిస్థితులు విశ్వంలో కొన్నికోట్ల గ్రహాల్లో ఉన్నట్లు అంచనావేశారు .అయినా భూమికి తోడుగా మరెక్కడా జీవులు ఉన్న దాఖలాలు ఇంత వరకు రుజువు కాలేదు.భూమ్మీద జీవులు ఏర్పడే పరిస్థుతులు 300 కోట్ల  సం :క్రితం ఒనగూరాయి అప్పు డున్న పరిస్థితుల్లో తొలి జీవ రూపాలు చిన్న చిన్న nitrogen భరిత అణువుల రూపం లోను ఎమినో ఆమ్లాలు,ఫాస్పోలిపిడ్ల రూపం లోను నిండి ఉండవచ్చును.
       అయితే నేడు మనం జీవులు అంటే ఏమిటో కొన్ని లక్షణాల ఆధారం గా నిర్వచిస్తున్నాము.తమ  లాంటి వాటినే నిర్జీవ పదార్థాల సహాయంతో నిర్మించుకొనే శక్తి ఉన్న పదార్థ రాశులని ,ప్రకృతిలోజరిగే సహజ మార్పుల్ని ఎదురొడ్డి అసహజ రసాయనిక చర్యల్ని స్వతహాగా కొనసాగించు కోగలిగిన శక్తి ఉన్న పదార్థ స్వరూపాల్ని జీవులు అని స్థూలంగా నిర్వచించు కోవచ్చును.
     అలాంటి లక్షణాలకు నిలబడే పదార్థాలే జీవులనుకుంటే అవి కణ నిర్మితాలు.కణం లేకుండా జీవం నేడు ఎక్కడా లేదు.దాన్నే జీవ కణం అంటారు.కణం అంటే కణ కవచం .అందులో కేంద్రకం లోపల న్యూక్లిక్ ఆమ్లాలు (DNA or RNA) క్రోమోజోములు,కేంద్రకం బయట కణ కవచానికి లోపల సైటోప్లాజం ,అందులో ఎన్నో కార్యక్రమాల్ని నెర వేర్చేందుకు కణాంగాలు ఉన్నాయి.
        ఆఖరికి నిర్జీవియో,జీవియో తేల్చలేని పరిస్థితిలో ఉన్న వైరస్ లకు కూడా కణ స్వరూపం ఉంది.అవి ఇతర జీవులలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకోగలవు.తమంత తాముగా నిర్జీవ పదార్థాల  నుంచి  ప్రత్యుత్పత్తి జరపలేవు.కణాల్లో ఏ రకమైన జీవ రసాయనిక విడిగా ఉన్నప్పుడు జరగవు.అయినా ఎంతోకొంత జీవ లక్షణం వైరస్ల కుందని అనుకోవచ్చును.
     దెయ్యాలు,భూతాలు అంటూ నమ్మే వాళ్ళు టి.విలు,సినిమాల నిండా అలాంటి పాత్రల్నిగుప్పించేవాళ్ల కు  ఈ నియమం పెద్ద సవాలు.దయ్యాలు భూతాలు కదులుతున్నట్లు,పగ సాధిస్తున్నట్లు,ఘన కార్యా లు చేస్తున్నట్లు చెప్పడమే కాకుండా అవి వున్నట్లు వాదిస్తుంటారు.దయ్యాలు,భూతాలు చేసే పను లు నిర్జీవ పదార్య్హాలు చేయ లేవు.కేవలం జీవ ధర్మాలున్న పదార్థాలు మాత్రమే చేయగలవు.జీవం కణాల్లో  తప్ప మరెక్కడా ఉండ లేదని ప్రకృతి నియమాలు తెలియచేస్తున్నాయి.మరి దయ్యాలకు భూతా లకు కణాలెక్క డివి? కణాల తయారికి పదార్థా లెక్కడివి?జీవ కణాలు జీవ కణాల తోనే తయారు కాగల వు. మరి ఏ జీవ కణాలతో ఈ దయ్యపు కణాలు తయారయ్యాయి?ఒక వేళ అవి కూడా మనుషుల్లాగే బహుక ణ జీవులే అయితే మరెందుకు అవి కనిపించవు?కొందరికే ఎందుకు కనిపిస్తాయి?

Tuesday 5 June 2012

ప్రకృతి సూత్రాలు:15 వ సార్వత్రిక నియమం



               భూమ్మీద జీవం నిర్జీవ పదార్థాల నుండే పుట్టింది.జీవం పరిణామం చెందుతూ పలు రూపాల్లోకి             ప్రకృతికి అనుగుణంగా విస్తరిస్తోంది.మానవుడు జీవ పరిణామం ద్వారానే సంభవించాడు.
(Life Originated from Innanimate Matter and Has Been Diversifying by Natural Selection;Man is Part of the Organic Evolution)
      కొంత మంది విశ్వాసం ప్రకారం దేవుడు ముందు మనుషుల్నిసృష్టించాకే వారి తోడు కోసం మిగిలిన జీవ జాతుల్ని   సృష్టించాడనే  విషయాన్ని పరిశీలిస్తే భూమి వయస్సు క్రీస్తు జన్మించేనాటికి సుమారు 6000 సం : మాత్రమే!అంటే నేటికి దాదాపు 8000 సం :రాలు అన్న మాట.నిజానికి ఆ పాటికే మానవ జాతి ఎంతో బాగా పరిణామం చెందింది.
      విశ్వం పుట్టిన  1000 కోట్ల  సం :రాల తర్వాతనే భూమి పుట్టింది.1500 కోట్ల సం :రాల క్రితం బిగ్ బాంగ్ ద్వారా విశ్వం ఆవిర్భవించిందని అందులోంచి నెబ్యూలాలు,గేలాక్సీలు ఏర్పడ్డాయనీ ఖగోళ శాస్త్రం చెబుతోంది.సుమారు 600 కోట్ల సం:రాల క్రితం పాలపుంత గెలాక్సీలో తన చుట్టూ తాను తిరుగుతున్న వేడి ముద్దలోని మధ్య భాగం సూర్యుడు గాను అంచులలో భాగాలు గ్రహాలూ గాను మారాయి.భూమి 550 కోట్ల సం:రాల తర్వాత ఏర్పడింది.
     భూమిపై 80 కోట్ల సం:తర్వాత అనుకూల పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత నీటిలో కరిగిన సేంద్రియ (organic),నిరేoద్రియ (inorganic) పదార్థాల నుంచి జీవ కణాలు ఏర్పడ్డాయి.ఆ కణాలే పరిణామం చెంది అనేక జంతుజాలాలుగా ,వృక్షజాతు లుగా అభివృద్ది చెందాయి.సుమారు 300 కోట్ల సం:క్రితమే జీవకణాలు భూమ్మీద ఏర్పడ్డట్టు ప్రబలమైన ఆధారాలు  న్నాయి.
          కానీ మానవజాతి ఆవిర్భావం జరిగింది సుమారు ఇర వై  లక్షల సం:క్రితమే.భూమి మీద జీవం నిర్జీవ పదార్థాల నుంచి పుట్టిందని ఎన్నో ప్రయోగాలు రుజువు చేసాయి.అందులోమిల్లర్ ప్రయోగం అత్యంత ప్రసిద్ది చెందింది.మామూలు వాయు పదార్థాలు నీటిని అత్యంత వేడిమికి ,వెలుతురుకు గురిచేయగా ,జీవానికి మూలకణాలయిన అమ్మోనియా తదితర పదార్థాలు తయారయ్యాయి.      

Friday 1 June 2012

ప్రకృతి సూత్రాలు: 14 వ సార్వత్రిక నియమం


    పదార్థం అంతిమంగా క్వార్కుల మయము.
(Matter is Ultimately Made Up of Quarks)
   పరమాణువులను విడగొట్టుకుంటూ వెడితే ఇంకా ఏ మాత్రం విడదీయడానికి వీలులేని మూల కణాలు  వస్తాయి.ఆ మూల కణాలు అభేద్యాలు.అవే పరమాణువులు అని డాల్టన్ అన్నాడు.ఈ సిద్ధాంతం తప్పని   పరమాణువుల్లో కూడా ఇంకా మౌలిక కణాలున్నాయని 19 వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు గుర్తించారు 20 వ శతాబ్దం లో బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి.పరమాణువులో కేంద్రకం,అందులో ప్రోటాన్స్, న్యూట్రాన్లు ఉన్నాయని,కేంద్రకం చుట్టూ చాలా దూరంలో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయని రుజువు  చేశారు.పరమాణువులో చాలా భాగం శూన్యమనీ కూడా తెలియ జేశారు.
         పదార్థం కూడా పరమాణువుల  మయం కాబట్టి పదార్థం లో కూడా శూన్య ప్రదేశం ఎక్కువే.ప్రోటాను న్యూట్రాను ప్రాధమిక కణాలని చాలా కాలం వరకు భావించారు.ప్రోటాను,న్యూట్రానుకు కూడా నిర్మాణం ఉందనీ అందులో క్వార్కులు అనబడే చిన్న చిన్న మౌలిక ధాతువు లున్నాయని వాటికి నిర్మాణం అంటూ ఏమీ ఉండదనీ అయితే వాటికి విద్యుదావేశం ,స్పిన్ వంటి లక్షనాలుంటాయనీ ఆధునిక కణ బౌతిక శాస్త్రం (particle physics) చెబుతుంది.
          ఇంతవరకు  ఎలక్ట్రాన్ ,ప్రోటాన్  దగ్గరవున్న 1.6 into 10 to the power of -19 కూలుంబుల విద్యుదావేశమే విద్యుత్తుకు ప్రాధమిక ప్రమాణం గా భావించేవారు.కనీ అందులో 2/3 వంతు ధనావేశం   1/3 వ వంతు రుణావేశం ప్రాధమిక మంటున్నారు.అంటే విశ్వంలో ఈవిధంగా చూస్తే న్యూట్రాన్లో మూడు  క్వార్కులు,ప్రోటాను లో మూడు క్వార్కులు ఉన్నాయని రుజువు చేసారు.ఈ క్వార్కులు గుయాన్లనబడే ద్రవ్యరాశిలేని శక్తివంతమైన రూపాలతో బలమైన కేంద్రక బలాల సాయంతో బంధించబడి వుంటాయి.పదా ర్థం ప్రధానం గా క్వార్కులన బడే అత్యంత మౌలిక కణాలచేత నిర్మించబడ్డదనీ క్వార్కులేవీ ఏకాంతంగా ఉండవనీ రుజువయింది.ఆ నూతన సిద్ధాంతాలను క్వాంటం క్రోమో డైనమిక్స్ (quantum chromo dynamics) అంటారు.  

Monday 28 May 2012

ప్రకృతి సూత్రాలు :13 వ సార్వత్రిక నియమం



                    పరమాణువులు ఎలక్ట్రాన్ల  చలనాలతోనే సంధానించుకొని ఉంటాయి.
                          (Atoms are Bound Together by Electronic Interactions)
      రెండు కాగితాల్ని అంటించినపుడు వాడినటువంటి బంక సంధానకర్త గా వ్యవహరిస్తుంది.ఇటుకలు కలిసివుండా లంటే సిమెంట్ సంధానకర్తగా వాడాలి.అలాగే పదార్థాలన్నీ పరమాణు సముదాయాలని తెలుసుకున్నాము బంధాలను ఏర్పర్చేది పరమాణువులలో ఉండే  ఎలక్ట్రాన్లే . ఎలక్ట్రాన్లు అనే గొలుసు చేత బంధించ బడ్డ రెండు పరమాణువుల మధ్య ఉన్న బంధాన్ని రసాయనిక బంధం(chemical bond) అంటారు.దయ్యాలు,భూతాలు,ఆత్మలు ఏ పదార్థాలతో తయార య్యాయో,ఆ పదార్థాలలోని పరమాణువులు ఎక్కడనుంచి వచ్చాయో నిరూపణలు లేవు.జీవ కణంలో జరిగే చర్యలన్నీ రసాయనిక బంధాలను తెంచడం,కొత్త బంధాలను ఏర్పర్చడమే.రసాయనిక చర్యల్లో జరిగేది ఇదే !
         

Saturday 26 May 2012

ప్రకృతి సూత్రాలు: 12 వ సార్వత్రిక నియమం.


పదార్థాలలో పరమాణువులు సంధానించుకున్న  పద్ధతిని బట్టి ఆయా పదార్థాలు తమ ధర్మాలను ప్రదర్శిస్తాయి.
    (Properties of the Materials are Due to the Atomic Arrangement in Them.)
పరమాణువుల నిర్మాణాన్ని బట్టి పదార్థాల ధర్మాలు ఉంటాయి.నీరు H2O అనే రూపం లో 3పరమాణువులు కలిసి ఉన్న అణువులమయం .CO2 కూడా 3 పరమాణువులు కలిసివున్నదే. కాని CO2 అణువు సరళ రేఖా కృతిలో ఉంటుంది.కనుక అది మామూలు ఉష్ణోగ్రత దగ్గర వాయు స్థితిలో ఉంటుంది.కానీ నీటి అణువు సరళ రేఖాకృతిలో కాకుండా కోణీయంగా వంగి ఉంటుంది.అందువలన నీరు ద్రవరూపంలో ఉండగలుగుతుంది.జీవ రహస్యమంతా నీటి అణువు వంకర లోనే దాగుంది.
        C2H6O పరమాణువుల అమరికనుబట్టి ఇది రెండు వేర్వేరు పదార్థాలను ఏర్పరచగలదు.1)H3C-O-CH3 ఇది ఈథర్ 2)CH3-CH2-O-H ఇదిఇథైల్ ఆల్కహాల్ .గ్లూకోజు ,ఫ్రక్టోజ్ లు రెండింటిలోను C6H12O6 అనే సంఖ్య లోనే అణువు లున్నాయి అయినా అమరిక వేరు వేరు.
       

Friday 18 May 2012

ప్రకృతి సూత్రాలు : 11 వ సార్వత్రిక నియమం



                                     పదార్థాలన్నీ పరమాణు నిర్మితాలు.
                                      (Matter is Made Up of Atoms)
  మన చుట్టూ ఎన్నో రకాల పదార్థాలు ,వస్తువులు ఉన్నాయి.లోహాలు,కొన్ని వాయువులు,కొన్ని ద్రవాలు తప్ప చాలా వరకు మనకు తారస పడేవి సంయోగ పదార్థాలు.  మనకు కనిపించే భౌతిక జగత్తులో కేవలం  100 లోపే మూలకా లున్నాయి .110 వ మూలకాన్ని కూడా మనుషులు కనుగొన్నారు.అయినా కేవలం 92 మూలకాలే  మనకు స్పష్టం గా తెలిసిన పదార్థాల్లో ఉంటాయి.
        మూలకాలు రకరకాల పద్ధతుల్లో,పరిమాణాల్లో కలిస్తే సంయోగ పదార్థాలు ఏర్పడ   తాయి.మూలకాలన్నింటిలో ఒకే తరహా పరమాణువులుంటాయి. సంయోగ పదార్థాలలో వేర్వేరు మూలకాలుంటాయి.   కాబట్టి వేర్వేరు తరహా పర మాణువులుంటాయి. ఉదా:నత్రజని లో దాని పరమాణువులే వుంటాయి.అలాగే బంగారు, వెండి,రాగి వంటి వాటిల్లో వాటి పరమాణువులే వుంటాయి.కనుక ఇవన్నీ మూలకాలు.కాని నీరు సంయోగ పదార్థము దీనిలో రెండు  హైడ్రోజన్ పరమాణువులు,ఒక ఆక్సిజన్ పరమాణువు వుంటాయి.పరమాణువుల మొత్తం ద్రవ్యరాశే పదార్థపు ద్రవ్యరాశి.    

Thursday 17 May 2012

ప్రకృతి సూత్రాలు :10 వ సార్వత్రిక నియమం


శక్తి రూపాలన్నీ ఉష్ణరూపంలోకి మారుతున్నాయి.
(Energy Tends to Reform into Heat)
విశ్వంలో మనచుట్టూ రకరకాలయిన శక్తి రూపాలున్నాయి.కాంతి శక్తి,గురుత్వ శక్తి ఇలా .ప్రతి చోటా ప్రతిక్షణం మార్పు లు జరుగుతున్నాయి.ఈ సంఘటనలలో శక్తి మార్పిడులు కూడా జరుగుతున్నాయి.కాలక్రమేనా శక్తి రూపాలన్నీ ఉష్ణ రూపం లోకి మారడానికి ఎక్కువ సంభావ్యతను ప్రదర్సిస్తాయి.ఉష్ణ మంటే పదార్థాలలోని అణువుల లేదా పరమాణు  వుల లేదా ఇతర కణ  సంబంధిత ప్రకంపనలే.అంటే చలనాన్ని ఎక్కువ చేసే మరో శక్తి రూపం లోకి మిగిలిన శక్తి రూపా లు మారుతున్నట్టు. నీటిలో ఉప్పు తనంత తాను కరిగిపోవడం ,టపాసులు ప్రేలడం,బెజ్జం వేస్తె బెలూన్ పగలడం,బిగ్ బాంగ్ ,అత్తరు వాసన గది అంతా విస్తరించడం,ప్రిజ్,కూలర్స్ ,ప్రతిజీవి ఏదో ఒకరోజు  మరణించడం ఇవన్నీ ఈ నియమా నుసారమే జరుగుతున్నాయి.
      బాగా ఉపయోగ పడే రూపాల్లోంచి శక్తి తక్కువగా ఉపయోగపడే రూపం లోకి చేరుకుంటుంది.(Energy flows from more useful form into less useful form) చలికాలంలో 15 డిగ్రీల  దగ్గరున్న చన్నీల్లను 45  డిగ్రీల  వరకు  వేడిచేసి వా డుతున్నామనుకుందాము.ఇలా 50 లీటర్ల నీటిని వేడిచేయడానికి సుమారు 15 లక్షల కేలరీల విద్యుచ్చక్తి అవసరం. మరి 45 డిగ్రీ ల నుండి 15 డిగ్రీల  వరకు చల్లబర్చాలంటే అందులోంచి 15 లక్షల కేలరీ ల ఉష్ణ శక్తిని తీసేసి దాన్ని విద్యు చ్చక్తిగా మార్చాలని ప్రయత్నిం చామనుకుందాము.ఎంత గొప్ప పరికరాన్ని వాడినా 15 లక్షల కేలరీల విద్యుచ్చ క్తిని రాబట్టలేము.అంటే నీటిని 15 డిగ్రీ దగ్గరకు అంతే శక్తిని లాగి తీసు కెల్లలేము.వేడి చేయటం కన్నా చల్లబరచడం కష్టం.

Wednesday 16 May 2012

ప్రకృతి సూత్రాలు: 9 వ సార్వత్రిక నియమం


              అన్ని సంఘటనలలోను ద్రవ్య-శక్తి నిత్యత్వమే!.పదార్థం -శక్తి రూపాల్లో మారవచ్చునే గానీ పదార్ధం-శక్తి పరిమాణం సంఘటనకు ముందు సంఘటన తర్వాత ఒకే విధంగా వుంటాయి.సంఘటనలలో పదార్ధం -శక్తిని నూతనం గా సృష్టించలేము.నాశనం చేయలేము.
(Matter-Energy are Conserved During Any Process.Energy and Matter May change Their forms but the Net Quantity of Matter-Energy is fixed During all Processes..Matter-Energy can Neither be Created Nor Destroyed During Processes.)
         ఈ విశ్వం లో ఉన్న మొత్తం పదార్థం,మొత్తం శక్తిని కలగలిపి ద్రవ్య-శక్తి లేదా పదార్ధం -శక్తి అంటారు.శక్తి కూడా ఓ రకమైన పదార్థ రూపమే.శక్తికి ద్రవ్యానికి మధ్య  E=mc2(c squred). అనే అనుసంధానం ఉంది.విశ్వం లో ఉన్న కనిపిం చని,కనిపించే ద్రవ్యశక్తి మొత్తం 1500 కోట్ల సంవత్సరాల క్రితం ,నేడు ,రేపు స్థిరంగా ఉంటుంది.ఉదా:విత్తనం మొక్క గా మారిన సంఘటన ,ఇనుము త్రుప్పు పట్టు సంఘటన .ఈ రెండు సంఘటనల్లో ద్రవ్య-శక్తి నిత్యత్వ సూత్రం వర్తిస్తుంది.
                సంఘటనకు ముందున్న ద్రవ్య-శక్తి=సంఘటన తరువాత ద్రవ్య-శక్తి
శక్తి నుంచి పదార్థాన్ని ,పదార్థాలనుంచి శక్తిని సృష్టించగలం.ద్రవ్య-శక్తి నిత్యత్వసూత్రానికి  విరుద్ధంగా ఇంతవరకు మానవ చరిత్రలో ఏ సంఘటనా జరిగిన దాఖలాలు లేవు.గాలి లోంచి వస్తువులు సృష్టించడం ,టెలిపతి ,భూతవైద్యం బాణామతి,యోజనం,దయ్యాలు,పునర్జన్మ,ఆత్మ అనే భావనలు పై నియమం ప్రకారం రుజువు చేయలేరు . 

Sunday 13 May 2012

ప్రకృతి సూత్రాలు: 8 వ సార్వత్రిక నియమం

భౌతిక రాశులన్నీ గులకలుగా(క్వాంటాలు)గా ఉంటాయి.ఏ భౌతిక రాశిని అవిచ్చిన్నంగా సూక్ష్మీకరించలేము.
(All  Physical Entites are Quantised;NoPhysical Quantity can be Infinitismally Continuous).
     బియ్యం గింజలుగా,లేదా నూకలుగా ఉంటాయి.అవన్నీ విడివిడిగా గులకలు గానే ఉంటాయి.ప్రపంచ జనాభా నిర్దిష్ట సంఖ్యారూపంలో ఉంటుంది. మన దగ్గర నగదు పూర్ణ సంఖ్యలో ఉంటుంది.భిన్నాల రూపం లో ఉండదు.
        భౌతికరాశులయిన శక్తి,ద్రవ్యరాశి ఇలాంటివన్నీ కూడా శకలాలు గానే ఉంటాయి.నీరు నీటి అణువుల సముదా యమే కదా!అలాగే ఎంత మూలకాన్ని తీసుకున్నా అది ఆ మూలకపు పరమాణువుల పూర్ణ సం ఖ్య లోనే వుంటుంది      ప్రదేశం(space)),శక్తి(energy),ద్రవ్యవేగం(momentum),కోణీయ ద్రవ్యవేగం(angular momentum) అయస్కాంత బలం (magnetic force), తదితర  పలు రాశులు కూడా ఎక్కడో  చోట కనిష్ట  స్థాయిలో ఉంటాయి .
      అయితే ఇలా భౌతిక రాశుల క్వాంటీకరణం చెందిన సంగతి  స్థూల పదార్థాలలో(macroscopic bodies) కని   పించదు .నేడు క్వాంటం సిద్ధాంతంతో అన్ని చర్యలను వివరించగలుగుతున్నారు.ఏదయినా ఒక కణం లేదా వస్తువు ఫలాని పరిమాణం లోనే ఓ భౌతిక రాశి విలువను ప్రదర్శిస్తుంది. కానీ ఎంత కావాలంటే అంత పరిమాణం లో ఉండటానికి వీల్లేదనే సిద్ధాంతాన్ని క్వాంటం సిద్ధాంతం అంటారు.

Friday 11 May 2012

ప్రకృతి సూత్రాలు: 7 వ సార్వత్రిక నియమము.



    ఒకే సూత్రాల  సమూహం తో చలనాలన్నింటినీ వివరించగలం
(One Set of Laws Explain All Motions)
           విశ్వంలో అన్నిచోట్లా  చలనాలు ఉన్నట్లు తెలుసుకున్నాము .అణువు ,పరమాణువు గ్రహాలూ,నక్షత్రాలు,గెలా క్సిలు,నెబ్యూలాలు ఇలా దేనిలోనైనా జరిగే చలనాలను వివరించటానికి ఒకే విధమైన సూత్రాలు సరిపోతాయి.
           నిశ్చలం గా వున్న వస్తువును కదిలించేందుకు ఆ వస్తువు ఏ పరిమాణం లో వున్నా ఎంతో కొంత బలమవ సరమే!వస్తువుల కదలికలు,చలనాలలో ద్రవ్యవేగం(dynamics) శక్తి ,ద్రవ్యరాశి .కోణీయ  ద్రవ్యవేగం ,ఇలాంటి  రాసులెన్నోఇమిడి ఉన్నాయి .అవి  నిత్యత్వమై వున్నాయి(conserved)
         ప్రతి మనిషి వయసుతో పాటు ముసలితనంతో చనిపోవటం ఖాయం.పరమాణువు లో తిరిగే ఎలెక్ట్రాన్   అబికేంద్ర బలం ,సూర్యుని చుట్టూ తిరిగే భూమికి ,గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరిగే నక్షత్రాలకు మధ్య అపకేంద్ర బలానికి కూడా ఒకే సూత్రం వర్తిస్తుంది. భూమి పై  కొంత ఎత్తు నుండి  నుండి  వేరు ,వేరు  ద్రవ్యరాసులు    కల  వస్తువులను ఒకేసారి వదిలితే అవి ఒకే సారి నేలను తాకుతాయి.నేలను తాకేతప్పుడు అన్నింటికీ ఒకే వేగం వుంటుంది.కాబట్టి ఒకే విధమైన సూత్రాల తోనే  అన్ని చలనాలను వివరించగలం.

Friday 4 May 2012

ప్రకృతి సూత్రాలు: 6 వ సార్వత్రిక నియమం

             కేంద్రక శక్తే  అన్ని రకాల శక్తులకు మూలం. కేంద్రక శక్తి పదార్థ వినిమయం తో విడుదల అవుతుంది.పదార్థ రూపాంతరమే శక్తి .
(Nuclear energy is the Source of other Forms of  Energy.Nuclear Energy Comes from the Annihilation of Matter.Energy is an Alternative Form of Matter)
            మనం ఇంట్లో వాడే విద్యుచ్చక్తి జల విద్యుత్తు ద్వారా వచ్చింది అనుకుందాము.ఇది ఆనకట్టకు అటువైపున ఎక్కువ ఎత్తులో వున్ననీరు సొరంగం గుండా దూకుతున్న క్రమంలో ఎలెక్ట్రిక్ జెనరేటర్లో నుండి విద్యుచ్చక్తి వచ్చింది.అంటే నీటి యాంత్రిక శక్తి మనకు విద్యుచ్చక్తిగా మారింది.నీటికి యాంత్రిక శక్తి అక్కడ నీరు ఎత్తుగా వుండటం వలన వచ్చింది.ఆ నీరు వర్షాల వలన  వచ్చాయి.వర్షాలు  మేఘాలనుంచి   వచ్చాయి.మేఘాలు సముద్రపు నీరు ఆవిరి కావడం వలన  ఏర్పడ్డాయి.సముద్రపు నీరు సూర్యుని వేడి వలన ఆవిరయ్యింది.సూర్యునిలో వేడి అక్కడ జరిగే కేంద్రక సంలీన చర్య వలన ఉద్భవించింది.ఇది కేంద్రక శక్తి కాబట్టి  మన ఇంట్లోని బల్బు కాంతి శక్తి వెనుక ,పరోక్షంగా సూర్యునిలో జరిగే కేంద్రక చర్య ద్వారా విడు దలైన కేంద్రక శక్తి వుంది.ఈ విధం గా పై నియమాన్ని వివరించవచ్చు.
                                                                                                                                                                                                           
                                                                                                                                                                                            
                                                                                                                                                                                                                       





Thursday 3 May 2012

ప్రకృతి సూత్రాలు: 5 వ సార్వత్రిక నియమము


 విశ్వం క్రమబద్దంగా వుంది.కాబట్టి దాన్ని సంపూర్ణం గా అధ్యయనం చేయవచ్చును 
(The Universe is Regular and is hence predictable).
            విశ్వం అనుక్షణం మారుతుంది . మార్పులో క్రమత్వం వుంది.కాబట్టి దాని గురించి పరిశోధించి నిజాలు తెలుసుకునేందుకు ఆస్కారముంది. నియమ నిబంధనలు లేక పోతే విశ్వంలో దేన్నీ గురించి తెలుసు కోవటం వీలు కాదు.విజ్ఞాన శాస్త్రసారమంతా విశ్వపు సౌష్టవాన్ని గురించి పూర్తి సమాచారం రాబట్టాలనే ప్రయత్నమే!
           నియమాల ద్వారానే విశ్వం 1500  కోట్ల సం:క్రితం బిగ్ బాంగ్ ద్వారా నేడున్న విశ్వరూపంలో పుట్టిందని అది క్రమేపీ విస్తరిస్తూ అన్ని వైపులా సమానమైన విధంగా వెళ్తోందని తెలుస్తోంది.విశ్వం క్రమత్వానికి కారణం పదార్థ లక్షణం లోని క్రమత్వమే!విశ్వంలో క్రమత్వం ఆధారంగానే విశ్వం ఆవిర్భావాన్ని అంచనా వేస్తున్నారు.గేలక్సీలలోని క్రమత్వా న్నిబట్టి సౌరమండలాన్ని పరిశీలించవచ్చు. సౌరమండలంలోని క్రమత్వాన్ని బట్టే ఎప్పుడు గ్రహణాలొస్తున్నాయో ఖచ్చితంగా తెలుసుకుంటున్నాము.భూమిలోని క్రమత్వం ఆధారంగానే రుతువులు,రేయింబవళ్ళు,ఉష్ణోగ్రతా వ్యత్యా సాలను అంచనా వేస్తున్నారు.బంగారంలోని క్రమత్వమే దాని అరుదైన ప్రకృతి స్థిరతకు చిహ్నం.మానవ శరీర నిర్మాణం అందరిలోనూ అదే క్రమంలో వుంటుంది.కాబట్టే వైద్యం చేయగలుగుతున్నారు.
                 

Monday 30 April 2012

ప్రకృతి సూత్రాలు: 4 వ సార్వత్రిక నియమం

ఈ విశ్వం లో కేవలం నాలుగు రకాల బలాలు మాత్రమే వున్నాయి.అవి 
ఎ.గురుత్వాకర్షణ బలాలు
బి.విద్యుదయస్కా౦తబలాలు 
సి.బలమైన కేంద్రక బలాలు
డి.బలహీనమైన కేంద్రక బలాలు 
(There are are Only Four Operating Forces in the Universe;they are 
(a)Gravitational forces;
(b) Electromagnetic Forces;
(c)Srong Nuclear Forces
(d)Weak Nuclear Forces
          విశ్వంలో జరిగే ప్రతి సంఘటన పై నాలుగు బలాల్లో ఏదో ఒకటి లేదా కొన్నింటి ప్రభావం వుంటుంది.ఈ  నాలుగిం టిని మించిన బలమేదీ ఈ విశ్వం లో లేదు.ఉన్నట్లు ఏ ఆధారాలు లేవు.
 ఎ)గురుత్వాకర్షణ బలాలు: 
      ప్రతి పదార్థానికి  ద్రవ్యరాశి వుంటుంది.ద్రవ్యరాశి వున్నఏదేని రెండు పదార్థాల మధ్య పనిచేసే బలాన్ని గురుత్వా కర్షణ బలం అంటాము.భూమి తనంత తానుగా సూర్యుడి చుట్టు తిరగటానికి కారణం ఇదే!నక్షత్రాల కదలికలు, సముద్రపు ఆటుపోటులు,పై నుండి వస్తువు క్రిందకు పడటం దీని వలననే! 
బి)విద్యుదయస్కాంత బలాలు:
     విద్యుత్తు,అయస్కాంతత్వం ఒకే నాణేనికి రెండు పార్స్వాల్లాంటివి.విద్యుత్తు వలన  అయస్కాంతత్వం, అయ స్కాంతం  లోని కదలికలవల్ల విద్యుత్తు జనిస్తాయి.ఈ  రెండు కలగలిసి వుంటాయి. ఉదా:రసాయనిక చర్యలు,జీవ చర్యలు ,ఎలెక్ట్రిక్ మోటర్,జెనరేటర్, పనిచేయడం.మనం పీల్చే గాలిలోని ఆక్షిజెన్  రక్తం లోని హీమోగ్లోబిన్ తో కలవ టానికి కారణం అయస్కాంతత్వం వల్లే!  శరీరం లోని మెదడు నుండి నాడులకు సంకేతాలు విద్యుత్తు రూపం లో వెళ్తాయి ఉదా:కంప్యూటర్,టి.వి,సెల్ పోన్  
సి)బలమైన  కేంద్రక బలాలు:
      పరమాణువులోని కేంద్రకం లో వున్న  ప్రోటాన్స్ వికర్శించుకుంటాయి.అవి విడి పోకుండా బంధించి ఉంచేవి కేంద్రక బలాలు.నాలుగు గ్రాముల హీలియం లో వున్న బలమైన కేంద్రక బలాలతో 5 టన్నుల బరువున్న10 to the power of 24  ట్రక్కులను ఒక సెకనులో పది మీటర్ల ఎత్తుకు లేప వచ్చు.ఈ  బలమైన  కేంద్రక  బలాల ప్రభావం వల్లననే కేంద్రక ,విచ్చిత్తి,కేంద్రక సంలీనం జరుగుతున్నాయి.విద్యుదయస్కాంత  బలాలకన్న గురుత్వాకర్షణ బలా లు ఎన్నో లక్షల కోట్ల రెట్లు బలహీనమైననవి.విద్యుదయస్కాంత బలాలు బలమైన కేంద్రక బలాల కన్నాసుమారు 1400 రెట్లు బలహీన మైనవి.
డి)బలహీన మైన కేంద్రక బలాలు:
ఇవి కేంద్రకం లో క్వార్కులన బడే మరింత చిన్న మౌలిక కణాల్ని పట్టి ఉంచుతాయి.ఇవి గురుత్వాకర్షన బలాల కన్నా లక్షల కోట్ల రెట్లు బలమైనవి.బలమైన కేంద్రక బలాలకన్నా ఇవి కేవలం లక్ష రెట్లు మాత్రమే బలహీనమైనవి.
                 ఈ నాలుగు రకాల బలాలు తప్ప మరే ఇతర బలాలు లేవన్నది ఈ నియమ సారాంశం.

Sunday 29 April 2012

ప్రకృతి సూత్రాలు:3వ సార్వత్రికనియమం


     ఈ విశ్వం లో ఏదీ స్థిరంగా లేదు.ప్రతిది చలనం లో వుంది. వస్తువు శాశ్వతం కాదు.చిన్నదైనా,పెద్దదైనా ప్రతిది మార్పు చెందవలసిదే .మారనిదేదీ విశ్వం లో లేదు.కేవలం మార్పు మాత్రమే శాశ్వతం.గతిలో లేని దానికి  విశ్వం లో స్థితి లేదు.(Nothing in the Universe is Eternal;Nothing is static;Everything,smaall or Big,Has to Change.No Object is permanent.Only Change is Permanent).
         విశ్వం  లో  వున్నా    వస్తువులన్నీ  ,వ్యవస్థలన్నీ  మారుతుంటాయి .గాలీ ,నీరు  కదులుతుంటాయి .ఘన  పదార్థాలలోని పరమానువుల్లో కదలిక ఉవంది.పర్వతాలు,భుఖందాల్లో కదలిక లున్నాయి సౌరమండలం      ,పాలపుంత మొత్తం గిరగిరా తిరుగుతుంది..విశ్వం గమనం లో వుంది.విశ్వం విస్తరిస్తూ వుంది.మనిషి శరీరంలో కణాలున్నాయి. వాటిలో కదలిక వుంది.మరణం తర్వాత శరీరం లోని అణువులు,కణాలు గాలిలో ,నీటిలో భూమిలో కలవడం కదలిక లో భాగమే!కాలం కదులుతుంటే పదార్థంలో మార్పులు జరుగుతుంటాయి.కొన్ని మార్పులు నెమ్మదిగా కొన్ని త్వరగా జరుగుతాయి.మార్పు లేనిదంటూ ఏదీ లేదు.
      మార్పు ఎందుకు జరుగుతుంది?పదార్థం లోని అంశాలు పరస్పరం నియంత్రించుకుంటాయి.పరమాణువులో నున్న   ప్రోటాన్,న్యూట్రాన్ పరస్పరం నియంత్రించుకుంటాయి.వస్తువులు కూడా అలాగేపరమాణువులోనున్న ధనా వేశిత ప్రోటాన్,ఋణావేశితఎలక్ట్రాన్ వుంటాయి. ధ్రువాల మధ్య ఘర్షణ,ఐక్యత సమన్వయ వ్యక్తీకరణే మార్పులు కలిగిస్తుంది.మార్పు పదార్థ స్వతః లక్షణం.మారేదాన్నే పదార్థం అంటారు.గణిత ,బౌతిక ,రసాయన,జీవశాస్త్ర గ్రంధాలన్నీ మారుతుంటాయి.కొత్త విషయాలు వస్తుంటే పాతవాటిని త్యజిస్తుంటాయి. రోజు సైన్సు వేరు.రేపటి సైన్సు వేరు.నిన్న టి సైన్సు మరోవిధం.ఇలా మార్పే శాశ్వతం.          

Friday 27 April 2012

ప్రకృతి సూత్రాలు:రెండవ సార్వత్రిక నియమం


మనం  చూస్తున్న నేటి విశ్వం మహా విస్పోటనం అనబడే ఒక సంఘటన లో ఏర్పడింది.అప్పట్నుంచి విశ్వం పలు మార్పులకు లోనయి నేతిస్తితిలో వుంది.మహా విస్పోతనానికి ముందు కూడా విశ్వం వుంది.మరో తెలీని రూపం లో వుంది.
(The universe as we see it today originated from bingbang and has been gradually evolving and expanding.The universe must have existed even before the event of bigbang in an untraceable form.)
      నేటి  విశ్వం 1500  కోట్ల సం:క్రితం మహా విస్పోటనం ద్వారా ఏర్పడింది.అప్పుడే కాలము,స్థలము ఏర్పడ్డాయి .Bigbang జరిగినట్లు 1920  లో అలెగ్జాందర్ ఫ్రెడ్ మాన్ ,అబ్బే జార్జి లేమాట్రి   తర్వాత  1940 లో జార్జి గేమొల్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్తలు ప్రవేశ పెట్టారు.  1965 లో పెంజియాస్ ,రాబర్ట్ విల్సన్ అనే ఇద్దరు ఖగోళ శాస్త్రజ్ఞులు Bigbang  కు సాక్ష్యాధారాలు చూపారు.
                  భావవాదుల నమ్మకం ప్రకారం భూమి కేంద్రంగా గ్రహాలూ తిరుగుతాయని పై పొరలో  నక్షత్రాలు వుంటాయి.వారు చెప్పే గ్రహాల్లో సుర్యచంద్రులిరువురు వుంటారు.నవగ్రహాలలో రాహువు,కేతువు వుంటారు.
        కాని Bigbang  సిద్ధాంతం ప్రాయోగిక రుజువులకు నిలబడింది .విశ్వం తో పాటే కాలం ఏర్పడింది కాబట్టి '' సెకండ్స్ కి ప్రస్తుత బౌతిక విశ్వం ఏర్పడింది ప్లాంక్ సమయ కాలం లో (10 to the power of _43) గురుత్వ ,విద్యుద యస్కాంత,బలమైన,బలహీన కేంద్రకబలాలు ఏర్పడ్డాయి.తరువాత హైడ్రోజెన్  వాయువు ఏర్పడింది.
       సూర్య కుటుంబం వయస్సు   500 కోట్ల సం:వుంటుంది.భూమి మీద జీవం పుట్టి సుమారు 400 కోట్ల సం:లు అయివుంటుంది.కొన్ని విశ్వాసాల ఆధారంగా భూమి వయస్సు 6 వేల సం:లే .కాని వాస్తవంగా మనిషి  20 లక్షల సం:నుంచే భూమి పై వున్నాడు.అరిస్టాటిల్ భూమి చుట్టూ గ్రహాలూ తిరుగుతున్నాయని చెప్పిన విషయము     సుమారు 2000 సం:పాటు కొనసాగింది.క్రీ.. 150 లో  టొలెమి కూడా భూ కేంద్రక సిద్ధాంతం గురించే చెప్పాడు.1473 లో కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతం ప్రవేశ పెట్టాడు. సిద్ధాంతం విశ్వాసాలకు వ్యతిరేకంగా వుందని ఆయనను అనేక వ్యధలకు గురిచేశారు. 1548 లో జన్మించిన బ్రునో కోపెర్నికాస్ ను సమర్థిస్తూ ఇలాంటి సౌరమండలాలు ఇంకా ఉండవచ్చునన్నాడు.అందుకు 1600 సం :లో అతనిని సజీవదహనం చేసారు.గెలీలియో గురుత్వ సిద్ధాంతాన్ని తెలియ జేశాడు.కెప్లర్ గ్రహగతుల గురించి చెప్పాడు.ఇలా విశ్వ ఆవిర్భావం గురించి బలమైన ఆధారాలున్న సిద్దాంతాలున్నాయి .సైన్సు ప్రకారం విశ్వం తనంతతానుగా ఎప్పుడూ వుంది.Bigbang  కు ముందు కూడా విశ్వం వుండే వుండాలి. వర్తమాన దూర  _కాల చట్రం లో వివరించలేము.విశ్వం పలు మార్పులకు లోనవుతుంది.
      విశ్వాన్ని ఎవరు సృష్టించలేదని అది ఒక పదార్థ స్వతసిద్ధఘటన   లో రూపొందిందని అప్పట్నుంచి మార్పులకు లోనవుతుందని  సూత్ర సారాంశం.

Thursday 26 April 2012

ప్రకృతి సూత్రాలు-మొదటి సార్వత్రిక నియమం

   మొదటి నియమం :సహజ సంఘటనలు పరిశీలకుని ఇష్టానుసారం జరగవు.వాస్తవ మనుగడలో ఉన్నదాన్నే పరిశీలకులు గమనిస్తారు సంఘటనలు పరిశీలకుడు గమనించడం కోసం జరగవు.(Events Occur Independent of the Observer.Observatio May Perturb Perturb the Event but the Event Itself Occurs Independent of this Observation)
                    మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది.పరిసరాలగురించి,విశ్వం గురించి మనం ఏ విధం గా పరిజ్ఞానం పొందు తాము.మేధావులు ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబులు రెండు దృక్కోణాల్లో వుంటాయి.
              1)భావ  వాదం  2)బౌతిక వాదం 
1)భావ  వాదం :మనిషి ఆత్మ ప్రధానం.దీన్నే జీవాత్మ అంటారు.జీవాత్మను పరమాత్మ నియంత్రిస్తుంది. ప్రకృతి ,దేహం ,విశ్వం,సమాజం,జీవన్మరణాలు,సంఘతనలన్నే కల్పనే!వాస్తవాలు కావు.అంతా మిధ్య .జగమే మాయ అంటోంది.
2)బౌతిక వాదం:సైన్సు ప్రకారం భావవాదాన్ని ఏ కోశానా రుజువుచేయలేము.ఈ సృష్టి ఎల్లప్పుడూ వుంది.ప్రకృతి సంఘటనలు ఏదో అతీత శక్తి అభీష్టం మేరకు కాకుండా వాటికవే జరుగుతాయి.భూమి ఏర్పడ్డాకే మనిషి ఏర్పడ్డాడు మనిషి ఎదుగుదల,జ్ఞాన సముపార్జనా శక్తి,సామాజిక పరిణామం ఇవన్నీ మనిషి మనసుకు సంబందించక సహజ  సిద్ధంగా  జరుగుతూనే వుంటాయి.
                     మనిషి మనసు అనుకోవడం వలన  గ్రహణాలు,రేయి ,పగలు  చావు బ్రతుకులు కలగడం లేదు.ప్రకృతి సంఘటనలు ఒక నిర్నీతమైన చట్రాలలో పరిశీలకులందరికీ ఒకే విధం గా కనిపిస్తాయి సూర్యుడి చుట్టూ భూమి తిరగ టం  వలన రాత్రి పగలు ఏర్పడుతున్నాయనేది పరమ సత్యం.ఈ సూత్రం ప్రకారం దెయ్యాలు, భూతాలు అబద్ధం. ఎందు కంటే ఒక వ్యక్తికి కనిపించి మరో వ్యక్తికి కనిపించని లక్షణాలను దెయ్యాలకు ఆపాదిస్తారు.
               ఒక భౌతిక పరిశీలనా చట్రం పరిశీలకులందరికీ ఒకే విధమైన అనుభవాలు జరగాలనేది ఈ సూత్ర సారాంశం.

Tuesday 24 April 2012

ప్రకృతి సూత్రాలు _శాస్త్రీయ దృక్పథం


   
     మన భూమి వయస్సు 500  కోట్ల సంవత్సరాలుగా పరిగనిస్తారు.మొదటి  100 కోట్ల సంవత్సరాలు విపరీతమైన ఉష్ణోగ్రత వలన  భూమి  మరుగుతున్న ద్రవం గా ఉండటం వలన  అప్పటి ఆనవాళ్ళేమీ శిలా జాల రూపం లో ఏర్పడక పోవటం తో భూమి చరిత్రకు ఆనవాళ్ళేమీ లేవు.మొదటగా 400 కోట్ల  సం :క్రితం నీటిలో జీవం ఆవిర్భవించిందని కనుగొన్నారు.ఈ పరిణామ క్రమంలో భూమి మీద మానవ జాతి అవతరిం చి ఇరవై లక్షల సంవత్సరాలయ్యింది..ఇది ఒక ఉన్నత దశ.చేతి వ్రేళ్ళు  నాలుగు ఒక వైపు,బొటన వేలు వ్యతిరేక దిశలో మడవ గలిగే  నేర్పు వలన పని ముట్ల తయారీ,వాటి వాడకం అబ్బింది.
        ఆహారం,రక్షణ ,సంతానోత్పత్తి కోసం పరిసరాలను గమనించటం లో మనిషికి కుతూహలం ,ఆసక్తి కలి గాయి.వాటిని తన జీవన విధానం లో ఆచరిస్తూ ప్రకృతి పట్ల తన అవగాహనను తర్వాతి తరానికి అందిం చాడు .ఇలా పాత తరం అందించిన జ్ఞానం తీసుకొని ప్రతి తరం ప్రాపంచిక ,బౌగోళిక,అంతరిక్ష,ఇతర బౌతిక అంశాల పట్ల సవివరమైన అవగాహన ఏర్పరుచుకున్నాడు.కొన్ని లక్షల సంవత్సరాల పాటు  సంపాదించిన ఈ విజ్ఞాన సర్వస్వానికి మానవ జాతి సమిష్టి నిర్మాత.ఇలా సాదిం చుకున్నదే  విజ్ఞాన శాస్త్రం ఇందులో భౌతిక  శాస్త్రం,రసాయన శాస్త్రం,జీవ శాస్త్రం,ఖగోళ శాస్త్రం,వంటివి ప్రకృతిని వివరించే ప్రధాన విజ్ఞాన శాస్త్రాలు.
            ప్రతి శాస్త్రం లోను సూత్రాలు వుంటాయి.ఇవన్నీ ప్రకృతి సూత్రాలే! మనకు కనిపించే ప్రతి సంఘట న,దృగ్విషయానికి ఈ సూత్రాల ఆధారం గా వివరణ ఇవ్వ గలుగుతున్నాము.ఒక శాస్త్రం లోని సూత్రాలు మరో శాస్త్రం లోని సూత్రాలతో వైరుధ్యాన్ని ప్రదర్శించవు.ఈ సూత్రాల సమిష్టి తాత్విక  అవగాహనే శాస్త్రీయ దృక్పథం (scientific temper)అంటారు.వీటి గురించి  కనీస పరిజ్ఞానం శాస్త్రీయ అవగాహన కోరుకునే వారికి అవసరం.
       ఏ  సూత్రము లేని పరికరం,శాస్త్రం,సాంకేతిక విధానం వుండవు.ప్రతి వ్యక్తి సైన్సు సాధనాలను వాడక తప్పదు.మనం వాడే ప్రతి వస్తువు  t.v,radio,computer,cell phone,current, అన్ని లోహ వస్తువులు ,అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు,చెక్క వస్తువులు,ఇంటి సామాగ్రి,అన్ని రవాణా సాధనాలు,అన్నిపరిశ్రమల  యంత్రాలు,ఇలా ప్రతిది శాస్త్ర,సాంకేతిక రంగ ఫలాలే!సైన్సు లేని జీవితాన్ని నేడు ఊహించలేము.
        ప్రజలు సైన్సు పరిజ్ఞానాన్ని పొందుటకు ఉత్సాహం చూపటం లేదు.ప్రశ్నించడం సైన్సు కు ప్రధాన లక్షణం.సైన్సు ద్వారా మానవ జీవనం ఎంతో మెరుగుపడింది.భారతదేశం లో ఒకప్పుడు సగటు వయస్సు 30 సం నేడు అది 60 సం పైగా అయింది. information,bio,nano,technology లు ఎంతగానో అభివృద్ది చెందాయి.కొన్ని లక్షల జంతు,వృక్ష జాతుల జీవిత పద్ధతుల్ని అన్వేషించారు.ఆరోగ్యం పై అత్యాధునిక స్థాయి చికిత్సలను అభివృద్ది చేసుకున్నాము.1960 వరకు భూమిపై  ఉన్న  సహజ,స్వతంత్ర  పదార్థాల కన్నా ఈ 44 సం లలోనే మానవుడు ఎక్కువ పదార్థాల్ని సృష్టించాడు.
                   సమాజాన్ని సైన్సు ప్రభావితం చేసింది,అలాగే సైన్సు ను సమాజం ప్రభావితం చేసింది .సమా జానికి ఆలోచనను,తాత్విక దృష్టిని ఇచ్చింది.తత్వశాస్త్రానికి పరాకాష్ట సత్యాన్వేషణ.ఇది తాత్విక దృష్టి ఉంటే నే వీలవుతుంది .సైన్సు ను అభివృద్ది చేసిన తాత్విక దృష్టి పేరే శాస్త్రీయ పద్ధతి.(method of science) అంటాము.శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలంటే శాస్త్రీయ పద్ధతి గురించి కనీస అవగాహన అవసరం సైన్సు పద్ధతికి,అశాస్త్రీయ పద్ధతికి ప్రధానం గా ఉన్న తేడా రుజువులు.సైన్సు వీటిని ప్రోత్సాహిస్తుంది .అశాస్త్రీయ భావాలు రుజువుల మీద ఆధారపడక గుడ్డిగా నమ్ముతుంటాయి.
         ఎక్కువమంది నమ్మినంత మాత్రాన నమ్మకం వాస్తవం కాదు.ఊహల ద్వారా ఏర్పడినవే నమ్మకా లు .ప్రయోగం ద్వారా పరిశీలనలోనే సత్యమేదో తెలుస్తుంది.ఉదాహరణకు బరువైన,తేలికైన రాళ్ళలో బరు వైనదే ముందు పడుతుందని అరిస్టాటిల్,క్రీ పు నాలుగవ శతాబ్దం లో అన్నాడు.క్రీ.శ పదహారవ శతాబ్దం లో గెలేలియో  రుజువు చేసే దాకా రెండు రాళ్ళు ఒకేసారి పడతాయని ప్రపంచానికి తెలియదు.శాస్త్రీయ పద్ధతి లోపరిశీలన అనేది మొదటి దశ.దీనిలో ఖాయం చేసుకోవడం కోసం కొలతలు వాడతాము.అలాగే ప్రశ్న రెండోది.ఎందుకు?ఏమిటి?ఎలా?ఎక్కడ?ఎవరు?ఎప్పుడు? అనే జిజ్ఞాసే సైన్సు కు ప్రేరకం.ప్రశ్న లోంచే విజ్ఞానం పుట్టింది.ఈ ప్రశ్న శాస్త్రీయం గా ఉండాలి.(scientific query).మూడో మెట్టు ఊహన!అంతకు ముందు  సైన్సు నిరూపించిన సిద్దాంతాలకు సూత్రాలకు ఈ ఊహలను ప్రయోగ పూర్వకంగా తేల్చుకోవాలి                                                                                                                బల్ల పరుపు భూమి అనే ఊహనుండి  గోలీయ భూమిగా భావించటం సైన్సు లో గొప్ప   విజయం.భూమి చుట్టూ గ్రహాలూ,నక్షత్రాలు తిరుగుతాయనే ఊహలకు వ్యతిరేకం గా ఆలోచించిన బ్రునో, హైపెశియా  హత్యకు గురికాగా గెలేయియో శిక్షిం పబడ్డాడు..కోపెర్నికాస్  ఎన్నో వేదనలను అనుభవిం చాడు .ఊహించడం మూడవ మెట్టు అయితే ఆ ఊహ తప్పని తేలితే  కొత్త ఊహలు చేపట్టాలి.ఆ ఊహను రుజువు చేయడమే సైన్సు పద్ధతిలో అత్యంత కీలక దశ .ప్రయోగం ద్వారా రుజువు కానిదేది సైన్సు పరిధి లోకి రాదు.రుజువు కానిది అశాస్త్రీయం అవుతుంది.
     జంతువుల ,పక్షుల దేహ నిర్మాణం లో కోట్ల సం నుంచి స్వల్పం గా మార్పులకు గురి అయ్యాయి.కాని మానవ శరీరం ఈ వేలసం లలోనే అనేక మార్పులకు లోనయింది.మానవుడు తన పరిశీలనలను ప్రయో గం ద్వారా రుజువు చేసుకొనడం వలన  ప్రకృతి నియమాలను ఖరారు చేసుకొనడం ద్వారా సైన్సును జీవి త విధానం లోనికి ఇముడ్చు కోగాలిగాడు.
                      ప్రయోగం ద్వారా రుజువైన తర్వాత మూడవ  దశలో పేర్కొన్న నమూనా సిద్ధాంత స్థాయికి చేరుకొ నడం శాస్త్రీయ పద్ధతి.ఇదే చివరి దశ.ఎన్నో సార్లు పరీక్షలకి,పరిశీ లనలకి,  సవాళ్ళకు నిలబడి నిలి చేదే ప్రకృతి నియ మం అవుతుంది.సైన్సు లో ఎన్ని వేల సుత్రాలున్న అవన్నీ మౌలికం గా  పద్దెనిమిది ప్రాథమిక సూత్రాల సమాహార మని ఆధునిక శాస్త్రజ్ఞులు రుజువు చేసారు.2000 సం ఆరంభం లో అంతర్జా తీయ స్థాయిలో జరిగిన శాస్త్రజ్ఞుల మహా సభలో ఈ సూత్రాలను తీర్మానించారు.వీటిని ప్రశ్నించే పరిశీల నలు,సైన్సు పద్ధతి ద్వారాప్రయోగ పూర్వకం గా మన కు తారస పడే వరకు ఈ సూత్రాలను మనం సత్యా లుగా ఆమోదిస్తాము.వీటినే శాస్త్రజ్ఞులు సమకాలీన శిఖరాగ్ర సూత్రాలుగా భావిస్తారు.ఈ సూత్రాలలో ఏ  ఒక్కదాన్ని లేదా కొన్నింటిని లేదా అన్నింటిని ప్రశ్నిం చే విధం గా నమ్మకాలు,ఆచారాలు,విశ్వాసాలు వుంటే అవి అశాస్త్రీయమని సైన్సు పద్ధతి అంటుంది.
                 ఈ సూత్రా;లతో ప్రతి వాదనను పోల్చుకోవాలి.ఆ వాదన ఈ సూత్రాలను ప్రశ్నించే దైతే రుజువు చేసుకోవాలి.రుజువు చేసుకోలేక పోతే  ఆ వాదనను తప్పుగా భావించుకోవాలి.అందుకే  18 ఈ  సూత్రాల ను rules of acceceptance  గా కాకుండా rules of exclusion  గా సైంటిస్ట్ లు పేర్కొంటారు.వీటి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన వుండాలి.ఒక్కొక్క  సూత్రాన్నిగురించి తెలుసుకొందాము.    

Sunday 22 April 2012

ప్రకృతి సూత్రాలు (LAWS OF NATURE)


                 ఈ విశ్వాన్ని సృష్టించిదెవరు?ముందుకు నడిపిస్తున్నదెవరు?దీన్ని ఎవరు శాసిస్తున్నారు?ఈ ప్రశ్నలన్నీ
మానవుడు ఈ ప్రకృతిని చూసి వేసినవి.ప్రకృతి అంత సహజంగా ఈ ప్రశ్నలు పుట్టాయి.ఈ ప్రశ్నలవలననే సైన్సు,చరిత్ర, మానవ నాగరికత పుట్టాయి.మరి వీటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి?గణితం లాగా ఖచ్చితమయిన సమాధా నాలు వాటికున్నాయా?
              ఆధునిక సైన్సు పై ప్రశ్నలకు సమాధానాలు వున్నాయని అంటుంది.ఈ ప్రకృతి కేవలం  18 సూత్రాల మీద ఆధారపడి నడుస్తోందని నోబెల్ గ్రహీతలైన శాస్త్రవేత్త లంతా కలిసి వడబోసిన సిద్ధాంతీకరణ ఇది.ఈ సూత్రాల పరిధి దాటి  ప్రకృతి లో పరమానువునుంచి గేలక్సీ ల దాకా ఏదీ ఒక్కక్షణం కూడా మనుగడ సాగించలేవనేది ఈ సూత్రాలసారాంశం.            
            
                 ఇది వరంగల్  NIT లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎ.రామచంద్రయ్య గారి రచించిన "ప్రకృతి సూత్రాలు" అనే పుస్తకం నుండి సేకరించినది . ఈ సూత్రాలను  బ్లాగులో పెడుతున్నాను సర్ అని అడిగిన వెంటనే సైన్సు అందరిదయ్యా అని ఓ.కే చేసిన ఈ పుస్తక రచయితకు జనవిజ్ఞాన వేదికకు ,ప్రజాశక్తి బుక్ హౌస్ కు  ధన్యవాదాలు.కాని పుస్తకం లోని ప్రధాన భావనను మాత్రమే తీసుకొని సరళంగా ప్రస్తావిస్తున్నాను.ఇది కేవలం శాస్త్ర ప్రచారం కోసం మాత్రమే !

శాస్త్రీయదృక్పథం

                              Developing Scientific Temper
               Humanism and Spirit of inquiry
               and Reform........
                                            Constitution of India
        శాస్త్రీయ దృక్పథాన్ని ,మానవతా దృక్కోణాన్ని 
        తార్కిక సత్యాన్వేషనా తత్పరతను,సంస్కర
        శీలాన్నిపెంపొందించుకోవటం ప్రతి భారత పౌరుడి విధి.
                                          భారత రాజ్యాంగం 


Friday 2 March 2012

సైన్సు@మొబైల్

సైన్సు@మొబైల్
జాతీయ సైన్సు దినోత్సవాల్లో భాగంగా విజ్ఞాన్ ప్రసార్,ఇగ్నో కలిసి సైన్సు@మొబైల్  ను ప్రవేశ పెట్టారు.సైన్సు కు సంభందించిన వార్తలు ,ముఖ్యమైన రోజులు,నిజాలు,సూక్తులు,శాస్త్ర వేత్తల వివరాలు,ఆరోగ్య చిట్కాలు ఉచితంగా sms రూపంలో అందిస్తుంది.SCIMBL అని టైపు చేసి 092230516161 కు sms పంపించాలి . లేదా  www.vigyanprasar.gov.in  లో SCIMBL  అని సెర్చ్ లో టైపు చేస్తే ఒక రిజిస్ట్రేషన్ form  వస్తుంది  అది  పూర్తి చేస్తే సరి.
దీనిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.అందరు దీనిని వినియోగించుకొని సైన్సు గురించి తెలుసుకోండి

Thursday 9 February 2012

ప్రకృతి సూత్రాలు

ప్రకృతి సూత్రాలు అనే పుస్తకం ప్రొఫెసర్ A.రామచంద్రయ్య గారు రచించారు .ఈ పుస్తకం లో ప్రకృతి ఎలా నడుస్తుంది అన్న విషయాన్ని చక్కగా వివరించారు .ఈ ప్రకృతి క్రింద చెప్పిన 18 సూత్రాల ఆధారం గా నడుస్తున్నదని శాస్త్ర వేత్తలంతా కలిసి తీర్మానించారు.
1)సహజ సంఘటనలు పరిశీలకుని ఇష్టానుసారంగా జరగవు.
2)మనం చూస్తున్న నేటి విశ్వం మహా విస్పోటనం అనబడే ఒక సంఘటనలో ఏర్పడింది.
3).ఈ విశ్వంలో ఏదీ స్థిరంగా లేదు.ప్రతిదీ చలనం లో వుంది. ఎ   వస్తువు శాశ్వతం కాదు.మార్పు మాత్రమే శాశ్వతం
4) విశ్వం లో కేవలం నాలుగు రకాల బలాలు మాత్రమే వున్నై.అవి
a)గురుత్వాకర్షణ బలాలు,
b)విద్యుత్ అయస్కాంత బలాలు 
c)బలమైన  కేంద్రక  బలాలు 
d)బలహీనమైన కేంద్రక బలాలు.
5)విశ్వం క్రమబద్ధంగా వుంది కాబట్టి దాని గురించి సంపూర్ణంగా అధ్యయనం చేయవచ్చును.
6)కేంద్రక శక్తే అన్ని రకాల శక్తులకు మూలం . కేంద్రక శక్తి పదార్థ వినిమయం తో విడుదల అవుతుంది.పదార్థ రూపాంతరమే శక్థి.
7)ఒకే  సూత్రాల సముహంతో చలనాలనన్నింటిని వివరించగలము.  
8)భౌతిక రాశులన్ని   గులకలుగా ఉంటాయి.ఏ భౌతిక రాశి ని అవిచ్చిన్నంగా సూ క్ష్మీకరించ లేము
9)విశ్వం లో అన్ని సంఘటనలలోను ద్రవ్య శక్తి నిత్యత్వమే .పదార్ధము, శక్తిని నూతనముగా  సృష్టించలేము ,నాశనం చేయలేము.
10)శక్తి రూపాలన్నీ  ఉష్ణ రూపం లోకి మారుతున్నాయి.
11)పదార్ధాలన్నీ పరమాణు నిర్మితాలు.
12)పదార్ధాలలో పరమాణువులు సంధానించుకున్న పద్ధతినిబట్టి ఆయా పదార్థాలు తమ ధర్మాలను ప్రదర్శిస్తాయి 
13)పరమాణువులు ఎలక్ట్రాను చలనాలతోనే సంధానించుకుని వుంటాయి 
14)పదార్థం అంతిమంగా క్వార్కులమయం.
15)భూమ్మీద జీవం నిర్జీవ పదార్తాలనుండే  పుట్టింది. జీవం పరిణామం చెందుతూ పలురుపాల్లోకి ప్రకృతికి అనుగుణంగా విస్తరిస్తోంది.మానవుడు జీవ పరిణామం ద్వారానే సంభావించాడు.
16)జీవం కేవలం కణాల్లో మాత్రమే ఉండగలదు.
17)జీవులు వేరయినా అన్ని జీవులలోను ఒకే విధమయిన జన్యుస్మ్రుతి ఉంది
18)జీవులన్నింటి మధ్య పాదార్తిక బంధం ఉంది.

ప్రకృతి సూత్రాల మధ్య ఐక్యత(hiddenen unity in nature's laws)


HIDDEN UNITY IN NATURES LAWS(ప్రకృతి సూత్రాల మధ్య  ఐక్యత) 
 భౌతిక శాస్త్రములోని ఒక  వైరుధ్యమేమంటే మన  జ్ఞానం పురోగమించేకొద్ది  విభిన్న భౌతిక విషయాలు  తక్కువ అంతర్లీన చట్టాలు, లేదా సూత్రాలు పరంగా వివరించబడ్డాయి. హిడెన్ యూనిటీ లో, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త జాన్ టేలర్   స్పష్టంగా సంబంధం లేని భౌతిక విషయాల మధ్య సమన్వయము లో  పురోగతి సాధించారు ఈయన   ఖగోళ మరియు భూగోళ డైనమిక్స్ ఐక్యత (17 వ శతాబ్దం),ఉష్ణం లో ఐక్యత  (18 వ శతాబ్దం), విద్యుత్ ఐక్యత, అయస్కాంతశక్తి లోపల వేడి ఐక్యత  మరియు కాంతిఐక్యత ( 19 వ శతాబ్దం), స్పేస్ మరియు సమయం మరియు విద్యుత్ తో అణు దళాలు ఏకీకరణ(20 వ శతాబ్దం )వంటి వాటిని ఇందులో వివరించారు.. గణిత శాస్త్ర వివరాలు మీద ఆధారపడకుండా , టేలర్ యొక్క దృష్టి కణ భౌతిక మరియు విశ్వశాస్త్రం వంటి మీద వుంది. Unestablished సిద్ధాంతాలు మరియు ఇప్పటికీ జవాబు పొందని ప్రశ్నలకు  అర్థం ఇందులో  పాఠకులు కనపడుతుంది . జాన్ సి టేలర్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఫిజిక్స్ ప్రొఫెసర్ .. నోబెల్ గ్రహీత Abdus సలాంకు  విద్యార్థి, టేలర్ యొక్క పరిశోధన కెరీర్ 1950 నుండి ప్రాథమిక కణ భౌతికశాస్త్రం  కొనసాగుతుంది. అతను ఇంపీరియల్ కాలేజీ, లండన్, లో  మరియు ఆక్స్ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల లో  బోధించారు, మరియు అతను ప్రపంచవ్యాప్తంగా ఉపన్యసించారు.. ఆయనకు  రాయల్ సొసైటీ లో మరియు ఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ లో ఒక ఫెలోషిప్  ఉంది.
Front Cover                             గూగుల్ బుక్స్ లో నెట్ లో ఈ పుస్తకం చదవండి.


                            read this book on net in google books.