జీవం కేవలం కణాల్లో మాత్రమే ఉండగలదు
(Life Exists only Inside a Cell)
భూమ్మీద మాత్రమే జీవం ఉన్నఆధారాలున్నాయి .భూమి లాంటి పరిస్థితులు విశ్వంలో కొన్నికోట్ల గ్రహాల్లో ఉన్నట్లు అంచనావేశారు .అయినా భూమికి తోడుగా మరెక్కడా జీవులు ఉన్న దాఖలాలు ఇంత వరకు రుజువు కాలేదు.భూమ్మీద జీవులు ఏర్పడే పరిస్థుతులు 300 కోట్ల సం :క్రితం ఒనగూరాయి అప్పు డున్న పరిస్థితుల్లో తొలి జీవ రూపాలు చిన్న చిన్న nitrogen భరిత అణువుల రూపం లోను ఎమినో ఆమ్లాలు,ఫాస్పోలిపిడ్ల రూపం లోను నిండి ఉండవచ్చును.
అయితే నేడు మనం జీవులు అంటే ఏమిటో కొన్ని లక్షణాల ఆధారం గా నిర్వచిస్తున్నాము.తమ లాంటి వాటినే నిర్జీవ పదార్థాల సహాయంతో నిర్మించుకొనే శక్తి ఉన్న పదార్థ రాశులని ,ప్రకృతిలోజరిగే సహజ మార్పుల్ని ఎదురొడ్డి అసహజ రసాయనిక చర్యల్ని స్వతహాగా కొనసాగించు కోగలిగిన శక్తి ఉన్న పదార్థ స్వరూపాల్ని జీవులు అని స్థూలంగా నిర్వచించు కోవచ్చును.
అలాంటి లక్షణాలకు నిలబడే పదార్థాలే జీవులనుకుంటే అవి కణ నిర్మితాలు.కణం లేకుండా జీవం నేడు ఎక్కడా లేదు.దాన్నే జీవ కణం అంటారు.కణం అంటే కణ కవచం .అందులో కేంద్రకం లోపల న్యూక్లిక్ ఆమ్లాలు (DNA or RNA) క్రోమోజోములు,కేంద్రకం బయట కణ కవచానికి లోపల సైటోప్లాజం ,అందులో ఎన్నో కార్యక్రమాల్ని నెర వేర్చేందుకు కణాంగాలు ఉన్నాయి.
ఆఖరికి నిర్జీవియో,జీవియో తేల్చలేని పరిస్థితిలో ఉన్న వైరస్ లకు కూడా కణ స్వరూపం ఉంది.అవి ఇతర జీవులలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకోగలవు.తమంత తాముగా నిర్జీవ పదార్థాల నుంచి ప్రత్యుత్పత్తి జరపలేవు.కణాల్లో ఏ రకమైన జీవ రసాయనిక విడిగా ఉన్నప్పుడు జరగవు.అయినా ఎంతోకొంత జీవ లక్షణం వైరస్ల కుందని అనుకోవచ్చును.
దెయ్యాలు,భూతాలు అంటూ నమ్మే వాళ్ళు టి.విలు,సినిమాల నిండా అలాంటి పాత్రల్నిగుప్పించేవాళ్ల కు ఈ నియమం పెద్ద సవాలు.దయ్యాలు భూతాలు కదులుతున్నట్లు,పగ సాధిస్తున్నట్లు,ఘన కార్యా లు చేస్తున్నట్లు చెప్పడమే కాకుండా అవి వున్నట్లు వాదిస్తుంటారు.దయ్యాలు,భూతాలు చేసే పను లు నిర్జీవ పదార్య్హాలు చేయ లేవు.కేవలం జీవ ధర్మాలున్న పదార్థాలు మాత్రమే చేయగలవు.జీవం కణాల్లో తప్ప మరెక్కడా ఉండ లేదని ప్రకృతి నియమాలు తెలియచేస్తున్నాయి.మరి దయ్యాలకు భూతా లకు కణాలెక్క డివి? కణాల తయారికి పదార్థా లెక్కడివి?జీవ కణాలు జీవ కణాల తోనే తయారు కాగల వు. మరి ఏ జీవ కణాలతో ఈ దయ్యపు కణాలు తయారయ్యాయి?ఒక వేళ అవి కూడా మనుషుల్లాగే బహుక ణ జీవులే అయితే మరెందుకు అవి కనిపించవు?కొందరికే ఎందుకు కనిపిస్తాయి?
No comments:
Post a Comment