శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Friday, 1 June 2012

ప్రకృతి సూత్రాలు: 14 వ సార్వత్రిక నియమం


    పదార్థం అంతిమంగా క్వార్కుల మయము.
(Matter is Ultimately Made Up of Quarks)
   పరమాణువులను విడగొట్టుకుంటూ వెడితే ఇంకా ఏ మాత్రం విడదీయడానికి వీలులేని మూల కణాలు  వస్తాయి.ఆ మూల కణాలు అభేద్యాలు.అవే పరమాణువులు అని డాల్టన్ అన్నాడు.ఈ సిద్ధాంతం తప్పని   పరమాణువుల్లో కూడా ఇంకా మౌలిక కణాలున్నాయని 19 వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు గుర్తించారు 20 వ శతాబ్దం లో బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి.పరమాణువులో కేంద్రకం,అందులో ప్రోటాన్స్, న్యూట్రాన్లు ఉన్నాయని,కేంద్రకం చుట్టూ చాలా దూరంలో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయని రుజువు  చేశారు.పరమాణువులో చాలా భాగం శూన్యమనీ కూడా తెలియ జేశారు.
         పదార్థం కూడా పరమాణువుల  మయం కాబట్టి పదార్థం లో కూడా శూన్య ప్రదేశం ఎక్కువే.ప్రోటాను న్యూట్రాను ప్రాధమిక కణాలని చాలా కాలం వరకు భావించారు.ప్రోటాను,న్యూట్రానుకు కూడా నిర్మాణం ఉందనీ అందులో క్వార్కులు అనబడే చిన్న చిన్న మౌలిక ధాతువు లున్నాయని వాటికి నిర్మాణం అంటూ ఏమీ ఉండదనీ అయితే వాటికి విద్యుదావేశం ,స్పిన్ వంటి లక్షనాలుంటాయనీ ఆధునిక కణ బౌతిక శాస్త్రం (particle physics) చెబుతుంది.
          ఇంతవరకు  ఎలక్ట్రాన్ ,ప్రోటాన్  దగ్గరవున్న 1.6 into 10 to the power of -19 కూలుంబుల విద్యుదావేశమే విద్యుత్తుకు ప్రాధమిక ప్రమాణం గా భావించేవారు.కనీ అందులో 2/3 వంతు ధనావేశం   1/3 వ వంతు రుణావేశం ప్రాధమిక మంటున్నారు.అంటే విశ్వంలో ఈవిధంగా చూస్తే న్యూట్రాన్లో మూడు  క్వార్కులు,ప్రోటాను లో మూడు క్వార్కులు ఉన్నాయని రుజువు చేసారు.ఈ క్వార్కులు గుయాన్లనబడే ద్రవ్యరాశిలేని శక్తివంతమైన రూపాలతో బలమైన కేంద్రక బలాల సాయంతో బంధించబడి వుంటాయి.పదా ర్థం ప్రధానం గా క్వార్కులన బడే అత్యంత మౌలిక కణాలచేత నిర్మించబడ్డదనీ క్వార్కులేవీ ఏకాంతంగా ఉండవనీ రుజువయింది.ఆ నూతన సిద్ధాంతాలను క్వాంటం క్రోమో డైనమిక్స్ (quantum chromo dynamics) అంటారు.  

No comments:

Post a Comment