శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Tuesday, 5 June 2012

ప్రకృతి సూత్రాలు:15 వ సార్వత్రిక నియమం               భూమ్మీద జీవం నిర్జీవ పదార్థాల నుండే పుట్టింది.జీవం పరిణామం చెందుతూ పలు రూపాల్లోకి             ప్రకృతికి అనుగుణంగా విస్తరిస్తోంది.మానవుడు జీవ పరిణామం ద్వారానే సంభవించాడు.
(Life Originated from Innanimate Matter and Has Been Diversifying by Natural Selection;Man is Part of the Organic Evolution)
      కొంత మంది విశ్వాసం ప్రకారం దేవుడు ముందు మనుషుల్నిసృష్టించాకే వారి తోడు కోసం మిగిలిన జీవ జాతుల్ని   సృష్టించాడనే  విషయాన్ని పరిశీలిస్తే భూమి వయస్సు క్రీస్తు జన్మించేనాటికి సుమారు 6000 సం : మాత్రమే!అంటే నేటికి దాదాపు 8000 సం :రాలు అన్న మాట.నిజానికి ఆ పాటికే మానవ జాతి ఎంతో బాగా పరిణామం చెందింది.
      విశ్వం పుట్టిన  1000 కోట్ల  సం :రాల తర్వాతనే భూమి పుట్టింది.1500 కోట్ల సం :రాల క్రితం బిగ్ బాంగ్ ద్వారా విశ్వం ఆవిర్భవించిందని అందులోంచి నెబ్యూలాలు,గేలాక్సీలు ఏర్పడ్డాయనీ ఖగోళ శాస్త్రం చెబుతోంది.సుమారు 600 కోట్ల సం:రాల క్రితం పాలపుంత గెలాక్సీలో తన చుట్టూ తాను తిరుగుతున్న వేడి ముద్దలోని మధ్య భాగం సూర్యుడు గాను అంచులలో భాగాలు గ్రహాలూ గాను మారాయి.భూమి 550 కోట్ల సం:రాల తర్వాత ఏర్పడింది.
     భూమిపై 80 కోట్ల సం:తర్వాత అనుకూల పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత నీటిలో కరిగిన సేంద్రియ (organic),నిరేoద్రియ (inorganic) పదార్థాల నుంచి జీవ కణాలు ఏర్పడ్డాయి.ఆ కణాలే పరిణామం చెంది అనేక జంతుజాలాలుగా ,వృక్షజాతు లుగా అభివృద్ది చెందాయి.సుమారు 300 కోట్ల సం:క్రితమే జీవకణాలు భూమ్మీద ఏర్పడ్డట్టు ప్రబలమైన ఆధారాలు  న్నాయి.
          కానీ మానవజాతి ఆవిర్భావం జరిగింది సుమారు ఇర వై  లక్షల సం:క్రితమే.భూమి మీద జీవం నిర్జీవ పదార్థాల నుంచి పుట్టిందని ఎన్నో ప్రయోగాలు రుజువు చేసాయి.అందులోమిల్లర్ ప్రయోగం అత్యంత ప్రసిద్ది చెందింది.మామూలు వాయు పదార్థాలు నీటిని అత్యంత వేడిమికి ,వెలుతురుకు గురిచేయగా ,జీవానికి మూలకణాలయిన అమ్మోనియా తదితర పదార్థాలు తయారయ్యాయి.      

No comments:

Post a Comment