శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Saturday, 16 June 2012

ప్రక్రుతి సూత్రాలు:చివరి మాట


                 పదార్ధమంతా  మిధ్య అనేవాళ్ళు ,జీవ పరిణామాన్ని వ్యతిరేకించే వాళ్ళు 18  వ నియమాన్ని చూసైనా కళ్ళు తెరవాలి.మానవుడు,ప్రక్రుతి పరిశీలన  ద్వారా ,శ్రమ ద్వారా ఆధునిక మానవ సమాజానికి బీజం వేసాడు.పైన పేర్కొన్న సూత్రాల పరిధిలో సాగుతున్న నేటి శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగానో అభి వృద్ది చెందాయి.అయితే ఈ విజ్ఞాన శాస్త్ర ఫలితాలను కొందరు మాత్రమే అనుభవిస్తున్నారు.సామాన్య ప్రజా నీకానికి ఈ ఫలితాలు నేటికీ అందుబాటులో లేవు.అత్యంత ధనిక వర్గం ప్రపంచ వనరులలో 85% మేరకు వినియోగిస్తున్నారు.కాగా అత్యంత పేద వర్గాలకు కేవలం ప్రపంచ వనరులలో 1% మాత్రమే  అందుబాటు లోఉంది .సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్ర సాంకేతిక రంగాల పరి జ్ఞానాన్ని ఉపయోగించాలి.ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని  శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధనలు సాగాలి.
        ఆధునికతను సంతరించుకున్న శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో పరోక్షంగాను,ప్రత్యక్షం గాను అందరి సమిష్టి కృషి వున్నా ప్రజా బాహుళ్యం అనేక అశాస్త్రీయ  పోకడలతోనూ,మూఢాచారాలతోను   చాందసత్వం తోను కొట్టుమిట్టాడుతోంది.ప్రాంతీయ ,కుల ,మత,వర్ణ,భాషా తదితర అనేకానేక అశాస్త్రీయ  ప్రాతిపదికల ఆధారంగా ప్రజలలో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు.యుద్ధ వాతావరణం ,అరాచకత్వం ఉగ్రవాదం,మతోన్మాదం,మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి.ఇది అశాష్ట్రీయం.సైన్సు సూత్రాలకు విరుద్ధం.ప్రజలందరిలో సౌభ్రాతృత్వం,సాంస్కృతిక వికాసము,వివేకం కలిగించడం ద్వారా  ఐకమత్యాన్ని పెంపొందించాలి.తద్వారా ప్రపంచ శాంతిని శాశ్వతం చేయాలి.ఈ లక్ష్య సాధనకు ప్రజా సైన్సు ఉద్యమాల ఆవశ్యకత ఎంతో ఉంది.ఈ ఉద్యమాల తీవ్రతను బట్టే ప్రజలకు శాస్త్ర సాంకేతిక రంగ ఫలితాలు దక్కుతాయి .ప్రజా సైన్సు ఉద్యమం పట్ల సరియైన అవగాహన కలిగిన నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్య మవుతుంది.
            "ప్రకృతి సూత్రాలు-శాస్త్రీయ దృక్పధం" అనే అంశాన్ని అధ్యనం చేయడం ప్రజా సైన్సు ఉద్యమ నిర్మాణం లో ఒక అత్యవసర భాగం.సమసమాజ స్థాపనకు కృషి చేసే శక్తుల పట్ల సానుభూతి ప్రకటిస్తూ స్వతంత్రంగా ప్రజా బాహుళ్యంలో ప్రజలకోసం సైన్సు,ప్రగతి కోసం సైన్సు ,ప్రపంచ శాంతి కోసం సైన్సు ,అనే నినాదాలతో కృషి చేస్తున్న అల్ ఇండియా పీపుల్స్ సైన్సు నెట్ వర్క్ (APSN) అనుబంధ సంస్థ జనవిజ్ఞాన వేదిక ఉద్యమాల్లో భాగమై భారత రాజ్యాంగం సూచించిన శాశ్త్రీయ దృక్పద వ్యాప్తిలో అందరం ఉద్యమిం చవలసిన తరుణమిదే!    

No comments:

Post a Comment