శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Thursday 24 December 2015

పారిస్ లో పర్యావరణ సదస్సు(COP-21)--1

                       పారిశ్రామిక విప్లవం సాధించిన అత్యద్భుత ప్రగతి మానవులందరూ నివసించాల్సిన   ఈ భూమి అస్తిత్వానికే ప్రమాదంగా పరిణమించింది .20 వ శతాబ్దం లో మానవ జీవనం,జాతి ప్రగతి అనే రెండు విషయాలు పరస్పర విరుద్దాలుగా మారాయి .
             1972 లో UNO పరిసరాల పరిరక్షణ,పారిశ్రామిక ప్రగతి మధ్య ఎటువంటి వైరుధ్యమూ లేకుండా సమతుల్య త సాధించాలని పిలుపు నిచ్చింది.అభివృద్ధి పేరిట మానవాళి సృష్టిస్తున్న కాలుష్యం,అడవులు నరికివేస్తూ ప్రకృతితో చెలగాటం భూగోళం వేడెక్కి పోయేలా చేస్తున్నాయి.UNO 190 దేశాల భాగస్వామ్యం తో  November 30-Dec11 వరకు PARIS లో COP-21 జరిగింది.
                  పెట్రోలు డీజల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి భూతాపం పెరుగుతుంది పారిశ్రామిక విప్లవం  ముందరి కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి .1992 రియోడి జేనరీ క్యోటో,బాలి కోపెంహాగాన్ సదస్సుల్లో కొంత పురోగతి కనిపించింది .
   (ఈనాడు లో వచ్చిన వ్యాసాల సంక్షిప్త సారాంశం .వారికి ధన్యవాదాలు .వరుసగా ఈ అంశం పై వ్యాసాలూ వస్తాయి )

Wednesday 7 October 2015

మన ముత్తాతల్ని వెతకొచ్చు

             8 తరాల కిందట చీకటిఖండ మైన ఆఫ్రికా నుంచి మన దేశానికి వచ్చిన సిద్ధిస్ లు ఆఫ్రో ఇండియన్స్ అని తేలింది.5 వేల ఏండ్ల క్రిందట చీకటి ఖండంలో బంటు జాతులుగా గుర్తింపు పొందారు.వారు అటునుంచి 2500 ఏండ్ల క్రిందట సముద్ర మార్గం ద్వారా ఆ దేశాన్ని వీడారని ఆధారాలతో బయట పెట్టింది CCMB(centre for cellular and molecular biology).15 నుంచి 19 శతాబ్దాల మధ్య వీరంతా మన దేశంలోని గుజరాత్,కర్నాటకల్లో అడుగు పెట్టారు.అటునుంచి  హైదరాబాద్ కు చేరుకొని చార్మినార్ వద్ద స్థిర పడ్డారు.నల్లటి చర్మం,రింగులు తిరిగిన జుట్టు మలేరియా దోమ కాటులను తట్టుకునే వారే sidhdhis లని తేలింది.ప్రస్తుతం వీరు పహిల్వాన్లుగా వున్నారు.
          తాజాగా మరో పరిశోధనలో ఐరోపాకు మన దేశానికి మధ్య బందుత్వాన్ని నిరూపించింది.ఐరోపాలో వుండే జిప్పీ లపై పరిశోధించారు.25 వేల ఏండ్ల క్రిందట దక్షిణ భారత దేశం నుంచి ఉత్తరాదికి అటునుంచి ఐరోపా దేశాలకు వెళ్ళిన మన దళితులు జిప్సీలుగా మారినట్లు తెలిసింది.
  వై క్రోమోజోం:
మానవ దేహం ఏర్పడటానికి X,Yక్రోమోజోం లు ప్రధాన పాత్ర పోషిస్తాయి .స్త్రీ లలో X  క్రోమోజోం లే ఉండగా పురుషులలో రెండు రకాలు ఉంటాయి.ఇందులో Y క్రోమోజోం వ్యక్తీ పుట్టుకకు కీలక భూమిక వహిస్తుంది. దాన్ని విశ్లేషిస్తే తరాల రహస్యాన్ని చేదిస్తుంది.CCMB  శాస్త్ర వేత్తలు  DNA మార్కింగ్ విధానం
ద్వారా జన్యువుల సమాచారం తెలుసుకుని మానవ సమాజాల మూలాల్ని వెతికి పట్టుకుంటున్నారు.
  CH.Mohan Rao,director,Deepa selvarani,scientist ,K.Thangaraj,A.GReddy,Rakesh thamang,Neeraj  ఈ ప్రాజెక్ట్ పై పరిశోధనలు నిర్వర్తిస్తున్నారు .వారిని అభినందిద్దాము .
(ఈనాడు వారికి ధన్యవాదాలు )

Thursday 1 October 2015

ఆసియన్లకు మనమే ఆదిమూలం

ఎటునుంచి ఎటు ?
        ఆసియా ప్రాంతం లో మానవ ప్రస్థానం ఎటునుంచి ఎటు సాగింది ? దీనిపై ఎన్నో సిద్ధాంతాలు మన ముందుకు వచ్చాయి.వినిపించేది మాత్రం ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి తరలివచ్చి మైదాన ప్రాంతంమైన ఉత్తర భారతంలో స్థిర పడ్డారన్న వాదన!అయితే తాజా పరిశోధన ఈభావనను తల క్రిందులు చేస్తుంది. ఆది మానవులు ఆఫ్రికా నుంచి ఒక పంక్తిగా ప్రస్తుత భారత ఉపఖండ ప్రాంతం లో   స్థిర పడ్డారని అక్కడినుంచి ఆగ్నేషియాకు,తూర్పు ఆసియా ప్రాంతాలకు తరలి వెళ్ళారని ఈ జన్యు అధ్యయనం స్పష్ట మైన నిర్ధారణకు వచ్చింది .
*వారు  భూభాగం  ద్వారానే భారత్ లో ప్రవే శించి  నప్పటికీ కోస్తా తీరం వెంబడి సాగుతూ  దక్షిణ భారతం లోకి చొచ్చుకు పొతూ ఆసియా ప్రాంతాలకు విస్తరించారు. 
*ఎప్పుడు? సుమారు లక్ష సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం . 
ప్రాశస్త్యం అనూహ్యం :
ఆఫ్రికాలో ఆవిర్భవించిన ఆధునిక మానవులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ ఎక్కడికక్కడ స్థానిక   వాతావరణ పరిస్థితులకు అక్కడి ఒత్తిళ్లకు,అందుబాటులో ఉన్న ఆహార వనరులకు,పరిసర,సూక్ష్మ క్రిములకు అనుగుణంగా మారుతూ  వలసలు పోతూ భిన్న ప్రాంతాల్లో స్థిర పడ్డారన్నది నేడు శాస్త్ర ప్రపంచం బలంగా విశ్వసిస్తుంది . 
*ఆఫ్రికా నుంచి వచ్చిన ఆది మానవులు  వేర్వేరు బృందాలుగా భారత్ చైనా జపాన్ తదితర ప్రాంతాలను చేరుకున్నారని ఇప్పటి వరకు అంతా భావి స్తూ వచ్చారు. అయితే ప్రస్తుత అధ్యయనం ఈ నమ్మకాలను పూర్తిగా పటా పంచలు చేసింది. 
*ఈ అధ్యయనం ప్రకారం ఆసియా వాసుల ఉమ్మడి పూర్వీకులు తొలిగా భారత ప్రాంతానికి వచ్చారు . అక్కడినుంచి థాయ్ ల్యాండ్  దక్షిణ దిశగా ఇప్పటి మలేషియా ఇండోనేషియ తూర్పు దిశగా ఫిలిఫ్ఫీన్స్ ఇలా విస్తరించారు . అనంతరం దశల వారిగా ఉత్తర దిశలుగా వలస పో తూ అప్పటికే అక్కడ స్థిరపడిన వారితో మమేక మవు తూ  భిన్న ఆసియా జాతుల ఆవిర్భావానికి కారకులయ్యారు . 
*ఆసియా ఖండం లో దక్షిణం నుంచి ఉత్తర దిశగా పోతున్న కొద్దీ వివిధ జాతుల్లో జన్యు పరంగా వస్తున్న మార్పులేమిటన్నది దీనిలో స్పష్టంగా గుర్తించటం విశేషం .
*ప్రతిష్టాత్మక మానవ జీనోమ్ సంస్థ  (హ్యుగో ) ఆసియన్ల జన్యువుల పై జరిపిన తొలి అధ్యయనం ఇది . 
* ఐరోపా కేంద్ర భావన లకు ఇది చరమగీతం ..ఎడిసన్  లూ (సింగపూర్ జీనోం సంస్థ )
* ఫ్లూ H.I.V లాంటి వ్యాధులకు ఔషధాలు కనిపెట్టే టప్పుడు ఆ ఔషధ పరీక్షలను భారత్ లో నిర్వహిస్తే చాలు. అది  ఇతర ఆసియా ప్రాంత వాసులకు అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది . .సమీర్. కె . బ్రహ్మచారి డైరెక్టర్(CSIR)  

Saturday 26 September 2015

తరతరాల వంశ వృక్షం రెడీ

               మన పూర్వీకుల గురించి మనకే మాత్రం తెలుసు. మహా అయితే 4 తరాల వరకు తెలిసి ఉంటుంది .కనీసము 10,000 సంవత్సరాల నాటి మన పూర్వీకులు ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం అమెరికాలోని oxford Ancestors కంపెనీని సంప్ర దిమ్చాల్సిందే .. మన శరీరం లోని జన్యు సమాచారం ఆధారంగా ఇది సాధ్యం అవుతుంది . జన్యు అమరికకు దగ్గరగా ఉండే జన్యువులు ప్రస్తుతం ఎక్కడ వున్నాయో  గుర్తిస్తే చాలు . మానవ జన్యువుల్లో తేడాలు  తక్కువ కాబట్టి తప్పుడు సమాచారం అందుతుందని  అనుకునేందుకు వీలు  లేదు . ఈ కంపెనీ Mitochondrial DNA విశ్లేసిస్తుంది.ee రకమైన ప్రక్రియను  వంశా వ్రుక్షాలను  తెలుసుకునేందుకు  ఉప యోగిస్తారు .
              ఆక్స్ఫర్డ్  University లో human genetics professor అయిన brain syx కు తన పూర్వీకుల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం వల్లేMytocandrial DNA విశ్లేషణకు ప్రాధాన్యం లభించిందని చెప్పవచ్చు .ఈ పద్ధతిలో  జరిగిన  పరిశోధనలోsyx  తాను రష్యన్ చక్రవర్తి నికోలస్ 2 కు బంధువని తెలుసుకున్నాడు . ఆ తర్వాత oxford ancestor company ని స్థాపించాడు . తరాలు మారేకొద్దీ పూర్వీకుల సంఖ్య రెట్టింపవుతుంది . అంటే తల్లి తండ్రి ఇద్దరు ఒక తరం అనుకుంటే తాతల తరం వచ్చే నాటికి వీరి సంఖ్యా నాలుగుకు పెరుగుతుంది . ప్రత్యేకత ఏమిటి ? Mytocandrial DNA చాలా నెమ్మదిగా నాశనం అవుతుంటుంది .20000 ఏళ్లకు ఒకసారి ఇందులోని base pairs లో మార్పులు వస్తుంటాయి. అందు వల్లే  పురాతత్వ త్రవ్వకాలలో బయటపడే ఎముకలలో nuclearDNA నాశన మైన చాలా ఏండ్ల  తరువాత కూడా Mytocandrial DNA చాయలు కనిపిస్తాయి
                 syx ప్రతిపాదన ప్రకారం సుమారు 1,50,000 ఏళ్లకు ముందు ఆఫ్రికా ప్రాంతానికి చెందినా  ఒక మహిళా నివసించేది. ఆమె కెన్యా లేదా ఇథియోపియా ప్రాంతానికి చెందినది . అప్పట్లో నివసించిన మహిళా DNAనే తరువాత తరాలకు వారసత్వం గా వచ్చింది . ఈమెనే Mytocandrial ఈవ్ అన్నారు . ఆమె ఊహా చిత్రాన్ని కూడా తయారు చేసారు . కొన్ని వేల సంవత్సరాల అనంతరం ఆమె వారసులు ఆఫ్రికా ఖండం నుంచి ప్రపంచం నలుమూలలకు  వ్యాపించారు . వారు ఎ దిశగా ప్రయాణించారు ఎక్కడెక్కడ నివాసాలు ఏర్పరుచుకున్నారు అనే విషయం కనుగునే ప్రయత్నం లోsyx దాదాపు పదేళ్ళు గడిపాడు .దీని కోసం ఆయన కొన్ని వేల మంది Mytocandrial  sequence  లను పరిశీలించారు . ఆయన విశ్లేషణ ప్రకారం ఈవ్ సంతతికి చెందినా తెగలు ఆఫ్రికా  లో 13,మిగిలిన ప్రాంతం లో మరో 13 ఉన్నాయి . లక్ష సంవత్సరాల క్రితం ఈ తెగలు చిన్న చిన్న గుంపులుగా ఆఫ్రికా నుంచి తూర్పు ప్రాంతం వైపు వలస వెళ్లి ఆప్రాంతం లో దాదాపు 50000 సంవత్సరాలు  గడిపాయి . ఈ కాలం లో తెగల సభ్యుల   సంఖ్య  బాగా పెరిగిపోయింది. దానితో  పాటు Mytocandrial DNA లో మార్పులు కూడా జరిగాయి వీరిలో కొందరు యూరప్ లోకి వెళ్లి స్థిర పడ్డారు .
యురోపియన్స్ లో 95 శాతం మంది  7 Mytocandrial  తెగలకు చెందినా వారని syx  అంచనా .ఈ ఏడూ తెగలకు చెందినా తల్లులకు ఆయన హెలినా,జాస్మిన్,కేత్రీన్ తారా ,ఉర్సులా ,వెళ్దా ,జేనియా  అని నామకరణం చేసారు .
(  thanks to eenaadu) 

Friday 25 September 2015

ప్రాణ వాయువు పుట్టింది ఇలా !


                  భూమిపై ఒకప్పుడు ఆక్షిజన్ లేదు! ఉన్న కొన్ని ప్రాణులు సూర్య రశ్మి సాయం తో మనగలిగేవి. భూ   వాతావరణం ....ఈ దశ నుండి ఆక్షిజన్ ఆధారిత దశకు చేరిందేలా ?
           ఈ చిక్కుముడిని  విప్పేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాప్రయత్నం ఒకటి ఓ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది.దాని ప్రకారం ఒకప్పుడు మంచు ముద్దగా ఉన్న భూమి  కరిగి నీరయ్యే దశలో వాతావరణం లోకి సముద్రాల్లోకి ఆక్షిజన్ను  విడుదల చేయడంతో జీవ జాతులన్నీ ఆక్షిజన్ ఆధారంగా మనగలగడం సాధ్యమయింది.
       భూమిపై ఆక్షిజన్ లేని సమయంలో ప్రాణులు సూర్య రశ్మి సాయంతో బ్రతికేవని ముందుగానే చెప్పుకు న్నాము.ఇది కూడా ఒక రకమైన కిరన జన్య సంయోగ క్రియనే.వాతా వరణంలోని సల్ఫర్ ఇనుములను ఉప యోగించుకుని ప్రాణులు శక్తిని ఉత్పత్తి చెసుకునేవి.అయితే 230 ఏండ్ల క్రితం భూమి మొత్తం మంచు ముద్దగా మారిపోయింది.ఎంతగానంటే భూ ఉపరితలం పై కొన్ని మైళ్ళ  మందం లో మంచు పేరుకు పోయేంత .ఈ దశలో ఓ కీలక మైన మార్పు చోటు చేసుకుంది.అతి నీల లోహిత కిరణాల కారణంగా మంచు పొరల్లో H2O2  ఉత్పత్తి అవుతుంది.సాధారణంగా నయితే సూర్య రశ్మి సోకినప్పుడు H2O2 నాశనం అవుతుంది.అప్పట్లో భారీ స్థాయిలో మంచు పొరలు ఉండటం వలన  లోపలి పొరల్లో కొద్దిపాటి H2O2  అలాగే  ఉండి పోయింది. మంచు గ్రహంగా పేరొందిన గురుగ్రహం పై కూడా H2O2 ఆనవాళ్ళు ఉన్నట్టు శాస్త్ర వేత్తలు గుర్తించారు.
    మంచుయుగం ముగిసినప్పుడు H2O2 వాతావరణంలోకి సముద్రాల్లోకి విడుదలయ్యింది .ఇది కూడా దశల వారిగా నెమ్మదిగా జరగడం వలన అప్పటికి ఆక్షిజన్ లేకుండానే బ్రతికేస్తున్న ప్రాణులకు హాని జరగలేదు.కాక పోతే ఈ రకమైన పరిస్థితికి అలవాటు పడేలా ఈ ప్రాణులు కొన్ని enzymes ను తయారు చేసుకోవడం వీలయ్యింది .పరినామ క్రమంలో జీవులు ఈ enzymes ఆధారంగా ఆక్షిజన్ ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాయి .ఇలా భూమికి పచ్చదనం అబ్బింది అన్నమాట .
(ఈనాడు పత్రిక ఆధారంగా ,వారికి కృతజ్ఞతలు .)