శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Thursday, 1 October 2015

ఆసియన్లకు మనమే ఆదిమూలం

ఎటునుంచి ఎటు ?
        ఆసియా ప్రాంతం లో మానవ ప్రస్థానం ఎటునుంచి ఎటు సాగింది ? దీనిపై ఎన్నో సిద్ధాంతాలు మన ముందుకు వచ్చాయి.వినిపించేది మాత్రం ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి తరలివచ్చి మైదాన ప్రాంతంమైన ఉత్తర భారతంలో స్థిర పడ్డారన్న వాదన!అయితే తాజా పరిశోధన ఈభావనను తల క్రిందులు చేస్తుంది. ఆది మానవులు ఆఫ్రికా నుంచి ఒక పంక్తిగా ప్రస్తుత భారత ఉపఖండ ప్రాంతం లో   స్థిర పడ్డారని అక్కడినుంచి ఆగ్నేషియాకు,తూర్పు ఆసియా ప్రాంతాలకు తరలి వెళ్ళారని ఈ జన్యు అధ్యయనం స్పష్ట మైన నిర్ధారణకు వచ్చింది .
*వారు  భూభాగం  ద్వారానే భారత్ లో ప్రవే శించి  నప్పటికీ కోస్తా తీరం వెంబడి సాగుతూ  దక్షిణ భారతం లోకి చొచ్చుకు పొతూ ఆసియా ప్రాంతాలకు విస్తరించారు. 
*ఎప్పుడు? సుమారు లక్ష సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం . 
ప్రాశస్త్యం అనూహ్యం :
ఆఫ్రికాలో ఆవిర్భవించిన ఆధునిక మానవులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ ఎక్కడికక్కడ స్థానిక   వాతావరణ పరిస్థితులకు అక్కడి ఒత్తిళ్లకు,అందుబాటులో ఉన్న ఆహార వనరులకు,పరిసర,సూక్ష్మ క్రిములకు అనుగుణంగా మారుతూ  వలసలు పోతూ భిన్న ప్రాంతాల్లో స్థిర పడ్డారన్నది నేడు శాస్త్ర ప్రపంచం బలంగా విశ్వసిస్తుంది . 
*ఆఫ్రికా నుంచి వచ్చిన ఆది మానవులు  వేర్వేరు బృందాలుగా భారత్ చైనా జపాన్ తదితర ప్రాంతాలను చేరుకున్నారని ఇప్పటి వరకు అంతా భావి స్తూ వచ్చారు. అయితే ప్రస్తుత అధ్యయనం ఈ నమ్మకాలను పూర్తిగా పటా పంచలు చేసింది. 
*ఈ అధ్యయనం ప్రకారం ఆసియా వాసుల ఉమ్మడి పూర్వీకులు తొలిగా భారత ప్రాంతానికి వచ్చారు . అక్కడినుంచి థాయ్ ల్యాండ్  దక్షిణ దిశగా ఇప్పటి మలేషియా ఇండోనేషియ తూర్పు దిశగా ఫిలిఫ్ఫీన్స్ ఇలా విస్తరించారు . అనంతరం దశల వారిగా ఉత్తర దిశలుగా వలస పో తూ అప్పటికే అక్కడ స్థిరపడిన వారితో మమేక మవు తూ  భిన్న ఆసియా జాతుల ఆవిర్భావానికి కారకులయ్యారు . 
*ఆసియా ఖండం లో దక్షిణం నుంచి ఉత్తర దిశగా పోతున్న కొద్దీ వివిధ జాతుల్లో జన్యు పరంగా వస్తున్న మార్పులేమిటన్నది దీనిలో స్పష్టంగా గుర్తించటం విశేషం .
*ప్రతిష్టాత్మక మానవ జీనోమ్ సంస్థ  (హ్యుగో ) ఆసియన్ల జన్యువుల పై జరిపిన తొలి అధ్యయనం ఇది . 
* ఐరోపా కేంద్ర భావన లకు ఇది చరమగీతం ..ఎడిసన్  లూ (సింగపూర్ జీనోం సంస్థ )
* ఫ్లూ H.I.V లాంటి వ్యాధులకు ఔషధాలు కనిపెట్టే టప్పుడు ఆ ఔషధ పరీక్షలను భారత్ లో నిర్వహిస్తే చాలు. అది  ఇతర ఆసియా ప్రాంత వాసులకు అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది . .సమీర్. కె . బ్రహ్మచారి డైరెక్టర్(CSIR)  

No comments:

Post a Comment