శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Sunday, 10 June 2012

ప్రకృతి సూత్రాలు: 17 వ సార్వత్రిక నియమం      (All Life is Based on the Same Genetic Code )
     జీవులను జీవంతో ఉంచేవి,కణం లోని వివిధ జీవ భౌతిక చర్యలేనని ,బహుకణ జీవుల్లో కణాలతో పాటు కణజాలాలు (tissue) కూడా కీలక ధర్మాలు నిర్వహిస్తాయని తెలిసిందే .కణాలతో జీవ రసాయనిక చర్యలు నడవాలంటే కొన్ని enjymes కావాలి. ఇవన్నీ రసాయనిక ప్రోటీన్ సంబంధ పదార్థాలు.ప్రోటీన్లు ఒక దండ అనుకుంటే ఆ దండలో పూసల్లాగా ఎమినో ఆమ్లాలు అనే చిన్న చిన్నఅణువులు ఉంటాయి.అంటే ఎమినో ఆమ్లాలను రసాయనిక బంధంతో కలిపి ఉంచితే ప్రోటీన్స్ ,enjymes,ఆ  ప్రోటీన్స్ తో కండరాలు ,రక్తనా ళాలు ,చర్మము  తదితర భాగాలు తయారవుతాయి.
         గుండె లోపల ఎన్నో బలమైన కండరాలున్నాయి.కండరాల సందానంతోనే ముఖ కవళికలు ఆధా రపడతాయి.అయితే ఈ ప్రోటీన్ లలో ఏయే ఎమినో ఆమ్లాలు ఏయే వరుసలో ఉండాలో అదే విధంగా తయారు చేసే యంత్రాంగం ఎక్కడుంది?అదే జన్యు స్మృతి.ఇది DNA అనే పెద్ద మెలేసిన నిచ్చెన లాంటి నిర్మాణంలోఉంటుంది.ఇది కాన కణ కేంద్రకం లోనే ఉంటుంది.ఈ మెలిక నిచ్చెనలో అటు,ఇటు న్యుక్లియో టైడ్స్  అనే భాగాలు వరుసలో వుంటాయి.క్రోమోజోములలో ఉన్న DNA కి శరీరపు కండరాలకు సంబం ధం వుండటం వల్లే తల్లిదండ్రుల పోలికలు బిడ్డలకు వస్తుంటాయి.
        మన శరీరానికి సుమారు 20 రకాల ఎమినో ఆమ్లాలు  అవసరం (ప్రకృతిలో సుమారు 100 రకాల ఎమినో ఆమ్లాలున్నాయి.)ఈ 20 ఎమినో ఆమ్లాలతో మాత్రమే అన్ని జీవులలోని ప్రోటీనులు ఏర్పడ్డాయి అమీబా అయినా ,ఏనుగు అయినా, వేపచెట్టు అయినా, దోమ అయినా మనిషిలో అయినా బల్లి లోను ఈ 20 ఎమినో ఆమ్లాలే ఉంటాయి.ఒక్కో ఎమినో ఆమ్లానికి DNA లోని కోడానులు ప్రతినిధులుగా ఉంటాయి ఫలాని కోడాను ఫలాని ఎమినో ఆమ్లానికి ప్రతినిధి అనడాన్ని జన్యు స్మృతి(genetic code) అంటారు.
     ఇంత సూక్ష్మ మైన జన్యు స్మృతి మొక్కలైనా జంతువులైనా అన్ని జీవులలోను ఒకే విధం గా ఉంటుంది.సైన్సు ప్రకారం జీవులు ఇంత గొప్పగా పాదార్తికంగా  ఏకమై ఉండగా మనుషుల్లోనే మనుషుల మధ్య కులాల ,మతాల పేరుతో చిచ్చు పెట్టటం ఎంత వరకు సబబు?  

2 comments: