(Matter is Made Up of Atoms)
మన చుట్టూ ఎన్నో రకాల పదార్థాలు ,వస్తువులు ఉన్నాయి.లోహాలు,కొన్ని వాయువులు,కొన్ని ద్రవాలు తప్ప చాలా వరకు మనకు తారస పడేవి సంయోగ పదార్థాలు. మనకు కనిపించే భౌతిక జగత్తులో కేవలం 100 లోపే మూలకా లున్నాయి .110 వ మూలకాన్ని కూడా మనుషులు కనుగొన్నారు.అయినా కేవలం 92 మూలకాలే మనకు స్పష్టం గా తెలిసిన పదార్థాల్లో ఉంటాయి.
మూలకాలు రకరకాల పద్ధతుల్లో,పరిమాణాల్లో కలిస్తే సంయోగ పదార్థాలు ఏర్పడ తాయి.మూలకాలన్నింటిలో ఒకే తరహా పరమాణువులుంటాయి. సంయోగ పదార్థాలలో వేర్వేరు మూలకాలుంటాయి. కాబట్టి వేర్వేరు తరహా పర మాణువులుంటాయి. ఉదా:నత్రజని లో దాని పరమాణువులే వుంటాయి.అలాగే బంగారు, వెండి,రాగి వంటి వాటిల్లో వాటి పరమాణువులే వుంటాయి.కనుక ఇవన్నీ మూలకాలు.కాని నీరు సంయోగ పదార్థము దీనిలో రెండు హైడ్రోజన్ పరమాణువులు,ఒక ఆక్సిజన్ పరమాణువు వుంటాయి.పరమాణువుల మొత్తం ద్రవ్యరాశే పదార్థపు ద్రవ్యరాశి.
No comments:
Post a Comment