(All Physical Entites are Quantised;NoPhysical Quantity can be Infinitismally Continuous).
బియ్యం గింజలుగా,లేదా నూకలుగా ఉంటాయి.అవన్నీ విడివిడిగా గులకలు గానే ఉంటాయి.ప్రపంచ జనాభా నిర్దిష్ట సంఖ్యారూపంలో ఉంటుంది. మన దగ్గర నగదు పూర్ణ సంఖ్యలో ఉంటుంది.భిన్నాల రూపం లో ఉండదు.
భౌతికరాశులయిన శక్తి,ద్రవ్యరాశి ఇలాంటివన్నీ కూడా శకలాలు గానే ఉంటాయి.నీరు నీటి అణువుల సముదా యమే కదా!అలాగే ఎంత మూలకాన్ని తీసుకున్నా అది ఆ మూలకపు పరమాణువుల పూర్ణ సం ఖ్య లోనే వుంటుంది ప్రదేశం(space)),శక్తి(energy),ద్రవ్యవేగం(momentum),కోణీయ ద్రవ్యవేగం(angular momentum) అయస్కాంత బలం (magnetic force), తదితర పలు రాశులు కూడా ఎక్కడో చోట కనిష్ట స్థాయిలో ఉంటాయి .
అయితే ఇలా భౌతిక రాశుల క్వాంటీకరణం చెందిన సంగతి స్థూల పదార్థాలలో(macroscopic bodies) కని పించదు .నేడు క్వాంటం సిద్ధాంతంతో అన్ని చర్యలను వివరించగలుగుతున్నారు.ఏదయినా ఒక కణం లేదా వస్తువు ఫలాని పరిమాణం లోనే ఓ భౌతిక రాశి విలువను ప్రదర్శిస్తుంది. కానీ ఎంత కావాలంటే అంత పరిమాణం లో ఉండటానికి వీల్లేదనే సిద్ధాంతాన్ని క్వాంటం సిద్ధాంతం అంటారు.
ప్రక్రుతి యేమిటి?
ReplyDeleteప్రకృటి అని సరిగా వ్రాస్తే తెలుగుభాషను గౌరవించినట్లవుతుందని శంకా?
ఇంగ్లీషులో spelling and grammer పట్ల నిష్టగా ఉండె తెలుగువాళ్ళు తెలుగులో సరిగా వ్రాయటం తప్పని భావించటం దేనికి?
ముద్రారాసం. మన్నించాలి. ప్రకృతి అనేచోట తప్పు అక్షరం పడింది.
ReplyDeleteమీ సూచనకు ధన్యవాదాలు.గూగుల్ లో ,ఒక్కోసారి అలావస్తుంది.ఇక విసుగు పుట్టి అలాగే పోస్ట్ చేస్తాం.లేఖిని లో మాత్రం అలాగే వస్తుంది.మీరు దేనిని ఉపయోగిస్తారు.అలాగే మీరు వ్రాసిన దాన్లో ముద్రా రాక్షసం అనాలి కదా!ముద్రా రాసం అని కూడా అనొచ్చా ! తెలిసి తప్పులు చెయ్యటం కాదండి,ఒక్కో సారి టైపింగ్ సమస్యలు,మరోసారి గూగుల్ సమస్యలు.ఏదేమైనా మీకు ధన్యవాదాలు.అలాగే నా ఇంకో బ్లాగు గమనించారో లేదో !.చూడగలరు.అలాగే ప్రకృటి అని కూడా వ్రాస్తారా!
Delete