కేంద్రక శక్తే అన్ని రకాల శక్తులకు మూలం. కేంద్రక శక్తి పదార్థ వినిమయం తో విడుదల అవుతుంది.పదార్థ రూపాంతరమే శక్తి .
(Nuclear energy is the Source of other Forms of Energy.Nuclear Energy Comes from the Annihilation of Matter.Energy is an Alternative Form of Matter)
(Nuclear energy is the Source of other Forms of Energy.Nuclear Energy Comes from the Annihilation of Matter.Energy is an Alternative Form of Matter)
మనం ఇంట్లో వాడే విద్యుచ్చక్తి జల విద్యుత్తు ద్వారా వచ్చింది అనుకుందాము.ఇది ఆనకట్టకు అటువైపున ఎక్కువ ఎత్తులో వున్ననీరు సొరంగం గుండా దూకుతున్న క్రమంలో ఎలెక్ట్రిక్ జెనరేటర్లో నుండి విద్యుచ్చక్తి వచ్చింది.అంటే నీటి యాంత్రిక శక్తి మనకు విద్యుచ్చక్తిగా మారింది.నీటికి యాంత్రిక శక్తి అక్కడ నీరు ఎత్తుగా వుండటం వలన వచ్చింది.ఆ నీరు వర్షాల వలన వచ్చాయి.వర్షాలు మేఘాలనుంచి వచ్చాయి.మేఘాలు సముద్రపు నీరు ఆవిరి కావడం వలన ఏర్పడ్డాయి.సముద్రపు నీరు సూర్యుని వేడి వలన ఆవిరయ్యింది.సూర్యునిలో వేడి అక్కడ జరిగే కేంద్రక సంలీన చర్య వలన ఉద్భవించింది.ఇది కేంద్రక శక్తి కాబట్టి మన ఇంట్లోని బల్బు కాంతి శక్తి వెనుక ,పరోక్షంగా సూర్యునిలో జరిగే కేంద్రక చర్య ద్వారా విడు దలైన కేంద్రక శక్తి వుంది.ఈ విధం గా పై నియమాన్ని వివరించవచ్చు.
No comments:
Post a Comment