శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Saturday, 15 September 2012

ప్రముఖ అణుశాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ కు శ్రద్దాంజలి

               ప్రముఖ అణుశాస్త్రవేత్త  కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గత శనివారం (8/9/2012) ముంబైలోమదుమేహం ,కిడ్నీ,కాలేయ సమస్యలతో బాధ పడుతూ కన్ను మూశారు.ఆయన ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబ రావు కుమారుడు.ఆయనకు భార్య(లలిత) ,కుమారుడు,కుమార్తె ఉన్నారు.ఈ యన 1949 september 14 న మద్రా స్ లో జన్మించారు.వృత్తి పరంగా అణుధార్మిక శాస్త్రవేత్త .మంచి సితార్ విద్వాంసుడిగా,రంగస్థల నటుడిగా,రచయిత గా పేరు గడించాడు మద్రాస్ university లో physics లో డిగ్రీ ,ఆంధ్ర university లో M.sc,Mumbai లో  phd చేసి బాబా అణు పరిశోధనా కేంద్రం లో పని చేసారు.మూడు దశాబ్దాలుగా అణు ధార్మిక పరిశీలనా పరికరాల రూప కల్పన లో పాల్గొంటున్నారు.అమెరికా లోని అట్లాంటా లో consultant గా ఉన్నారు.చాలా కాలంగా అనేక తెలుగు పత్రికలలో సంగీతం మీదా ,శాస్త్ర విజ్ఞానం మీదా రచనలు చేస్తున్నారు.
           ఈ 21 వ శతాబ్దంలోకూడా ప్రకృతి పట్లే,సమాజం పట్ల,మనిషి పట్ల ఉండవలసిన హే తుబద్ద ,భౌతికవాద ,శా స్త్రీయ ఆలోచనలు చాలా మందిలో ఉండడం లేదు.ఇటువంటి స్థితిలో తెలుగులో అందరికి అర్థమయే రీతిలో సూటిగా సరళంగా వీరి రచనలు సాగాయి.అణువుల శక్తి,ప్రకృతి పర్యావరణం,మనుషులు చేసిన దేవుళ్ళు ,విశ్వాంతరాళం జీవ కణాలు నాడీకణాలు,మానవ పరిణామం, జీవశాస్త్ర విజ్ఞానం -సమాజం లాంటి పుస్తకాలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి.
     ఈయన బ్లాగు కూడా వ్రాసేవారు.దీనిని నేను ఇంతకు ముందు చదివాను.ఆయన పుస్తకాలు మానవ పరిణామం విశ్వాంతరాళం  సమాచారం నాకు radio లో science సంభాషణలు చెప్పటంలో  చాలా ఉపయోగ పడింది.వారికి సర్వదా రుణపడి ఉంటాను.ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను.
ఈయన బ్లాగు 
http://rohiniprasadkscience.blogspot.in/

4 comments:

 1. రోహిణీప్రసాద్ గారిపై మీ నివాళి ఇఫ్పుడే చూశాను. ధన్యవాదాలు.

  మీ సైన్స్ బ్లాగ్ క్లుప్తంగా, సూటిగా చాలా బాగుంది. నా చందమామలు బ్లాగులో మీ సైట్ లింక్ ఇస్తాను. ప్రకృతిలోని సార్వత్రిక నియమాలను చక్కగా రాశారు.

  అభినందనలు

  ReplyDelete
 2. నెల వంక గారికి స్వాగతం.మీ స్పందనకు మరియు నా బ్లాగును చందమామలు లో చేర్చినందుకు మీకు ధన్యవాదాలు.నాకు స్పేస్ సైన్సు ,జీవ పరిణామం వంటి అంశాలు చాలా ఇష్టం.వాటిని రోహిణీ ప్రసాద్ గారు చాలా సాధికారంగా వివరించారు.ఆయన పుస్తకాలు విస్తృతంగా విద్యార్థులు,మేధావులు చదవాలి.అదే ఆయనకు మనమిచ్చే నివాళి.సార్వత్రిక నియమాలు ప్రొఫెసర్ A.రామచంద్రయ్య గారి రచన నుండి సేకరించినవి.

  ReplyDelete
 3. shekar gaaru chakkati posts peduthunnaru. mee blog arvantamgaa untundi. keep it up sir.

  ReplyDelete
 4. ధన్యవాదాలు మేరాజ్ గారు!ఈ బ్లాగును కూడా గమనించి వ్యాఖ్య వ్రాసినందుకు..ఎందుకంటే సైన్సు బ్లాగులు చదివే వారు తక్కువ కామెంట్ వ్రాసే వారు మరీ తక్కువ.

  ReplyDelete