మొదటి నియమం :సహజ సంఘటనలు పరిశీలకుని ఇష్టానుసారం జరగవు.వాస్తవ మనుగడలో ఉన్నదాన్నే పరిశీలకులు గమనిస్తారు సంఘటనలు పరిశీలకుడు గమనించడం కోసం జరగవు.(Events Occur Independent of the Observer.Observatio May Perturb Perturb the Event but the Event Itself Occurs Independent of this Observation)
మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది.పరిసరాలగురించి,విశ్వం గురించి మనం ఏ విధం గా పరిజ్ఞానం పొందు తాము.మేధావులు ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబులు రెండు దృక్కోణాల్లో వుంటాయి.
1)భావ వాదం 2)బౌతిక వాదం
1)భావ వాదం :మనిషి ఆత్మ ప్రధానం.దీన్నే జీవాత్మ అంటారు.జీవాత్మను పరమాత్మ నియంత్రిస్తుంది. ప్రకృతి ,దేహం ,విశ్వం,సమాజం,జీవన్మరణాలు,సంఘతనలన్నే కల్పనే!వాస్తవాలు కావు.అంతా మిధ్య .జగమే మాయ అంటోంది.
2)బౌతిక వాదం:సైన్సు ప్రకారం భావవాదాన్ని ఏ కోశానా రుజువుచేయలేము.ఈ సృష్టి ఎల్లప్పుడూ వుంది.ప్రకృతి సంఘటనలు ఏదో అతీత శక్తి అభీష్టం మేరకు కాకుండా వాటికవే జరుగుతాయి.భూమి ఏర్పడ్డాకే మనిషి ఏర్పడ్డాడు మనిషి ఎదుగుదల,జ్ఞాన సముపార్జనా శక్తి,సామాజిక పరిణామం ఇవన్నీ మనిషి మనసుకు సంబందించక సహజ సిద్ధంగా జరుగుతూనే వుంటాయి.
మనిషి మనసు అనుకోవడం వలన గ్రహణాలు,రేయి ,పగలు చావు బ్రతుకులు కలగడం లేదు.ప్రకృతి సంఘటనలు ఒక నిర్నీతమైన చట్రాలలో పరిశీలకులందరికీ ఒకే విధం గా కనిపిస్తాయి సూర్యుడి చుట్టూ భూమి తిరగ టం వలన రాత్రి పగలు ఏర్పడుతున్నాయనేది పరమ సత్యం.ఈ సూత్రం ప్రకారం దెయ్యాలు, భూతాలు అబద్ధం. ఎందు కంటే ఒక వ్యక్తికి కనిపించి మరో వ్యక్తికి కనిపించని లక్షణాలను దెయ్యాలకు ఆపాదిస్తారు.
ఒక భౌతిక పరిశీలనా చట్రం పరిశీలకులందరికీ ఒకే విధమైన అనుభవాలు జరగాలనేది ఈ సూత్ర సారాంశం.
తెలుగులో science terms అన్ని అర్ధం అవుతాయో లేదో అని అనిపించింది. కాని ఈ పోస్ట్ అర్ధం అయ్యైంది.ఇలాగే రాయండి. క్లిష్టమైన పదాలు వచ్చినప్పుడు కొద్దిగా english words కూడా రాయండే..
ReplyDeleteసైన్సు పట్ల మీ అభిరుచికి ధన్యవాదాలు.మీ సూచన పాటిస్తాను.వెనుకటి పోస్ట్ లు కూడా చూడండి.విలువైన సమాచారం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.అక్కడ మీకు తెలిసిన పిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ బ్లాగు ను పరిచయం చేయండి.
ReplyDelete