శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Monday, 30 April 2012

ప్రకృతి సూత్రాలు: 4 వ సార్వత్రిక నియమం

ఈ విశ్వం లో కేవలం నాలుగు రకాల బలాలు మాత్రమే వున్నాయి.అవి 
ఎ.గురుత్వాకర్షణ బలాలు
బి.విద్యుదయస్కా౦తబలాలు 
సి.బలమైన కేంద్రక బలాలు
డి.బలహీనమైన కేంద్రక బలాలు 
(There are are Only Four Operating Forces in the Universe;they are 
(a)Gravitational forces;
(b) Electromagnetic Forces;
(c)Srong Nuclear Forces
(d)Weak Nuclear Forces
          విశ్వంలో జరిగే ప్రతి సంఘటన పై నాలుగు బలాల్లో ఏదో ఒకటి లేదా కొన్నింటి ప్రభావం వుంటుంది.ఈ  నాలుగిం టిని మించిన బలమేదీ ఈ విశ్వం లో లేదు.ఉన్నట్లు ఏ ఆధారాలు లేవు.
 ఎ)గురుత్వాకర్షణ బలాలు: 
      ప్రతి పదార్థానికి  ద్రవ్యరాశి వుంటుంది.ద్రవ్యరాశి వున్నఏదేని రెండు పదార్థాల మధ్య పనిచేసే బలాన్ని గురుత్వా కర్షణ బలం అంటాము.భూమి తనంత తానుగా సూర్యుడి చుట్టు తిరగటానికి కారణం ఇదే!నక్షత్రాల కదలికలు, సముద్రపు ఆటుపోటులు,పై నుండి వస్తువు క్రిందకు పడటం దీని వలననే! 
బి)విద్యుదయస్కాంత బలాలు:
     విద్యుత్తు,అయస్కాంతత్వం ఒకే నాణేనికి రెండు పార్స్వాల్లాంటివి.విద్యుత్తు వలన  అయస్కాంతత్వం, అయ స్కాంతం  లోని కదలికలవల్ల విద్యుత్తు జనిస్తాయి.ఈ  రెండు కలగలిసి వుంటాయి. ఉదా:రసాయనిక చర్యలు,జీవ చర్యలు ,ఎలెక్ట్రిక్ మోటర్,జెనరేటర్, పనిచేయడం.మనం పీల్చే గాలిలోని ఆక్షిజెన్  రక్తం లోని హీమోగ్లోబిన్ తో కలవ టానికి కారణం అయస్కాంతత్వం వల్లే!  శరీరం లోని మెదడు నుండి నాడులకు సంకేతాలు విద్యుత్తు రూపం లో వెళ్తాయి ఉదా:కంప్యూటర్,టి.వి,సెల్ పోన్  
సి)బలమైన  కేంద్రక బలాలు:
      పరమాణువులోని కేంద్రకం లో వున్న  ప్రోటాన్స్ వికర్శించుకుంటాయి.అవి విడి పోకుండా బంధించి ఉంచేవి కేంద్రక బలాలు.నాలుగు గ్రాముల హీలియం లో వున్న బలమైన కేంద్రక బలాలతో 5 టన్నుల బరువున్న10 to the power of 24  ట్రక్కులను ఒక సెకనులో పది మీటర్ల ఎత్తుకు లేప వచ్చు.ఈ  బలమైన  కేంద్రక  బలాల ప్రభావం వల్లననే కేంద్రక ,విచ్చిత్తి,కేంద్రక సంలీనం జరుగుతున్నాయి.విద్యుదయస్కాంత  బలాలకన్న గురుత్వాకర్షణ బలా లు ఎన్నో లక్షల కోట్ల రెట్లు బలహీనమైననవి.విద్యుదయస్కాంత బలాలు బలమైన కేంద్రక బలాల కన్నాసుమారు 1400 రెట్లు బలహీన మైనవి.
డి)బలహీన మైన కేంద్రక బలాలు:
ఇవి కేంద్రకం లో క్వార్కులన బడే మరింత చిన్న మౌలిక కణాల్ని పట్టి ఉంచుతాయి.ఇవి గురుత్వాకర్షన బలాల కన్నా లక్షల కోట్ల రెట్లు బలమైనవి.బలమైన కేంద్రక బలాలకన్నా ఇవి కేవలం లక్ష రెట్లు మాత్రమే బలహీనమైనవి.
                 ఈ నాలుగు రకాల బలాలు తప్ప మరే ఇతర బలాలు లేవన్నది ఈ నియమ సారాంశం.

5 comments:

 1. మీరు నిర్థారణ చేసి మాట్లాడుతున్నారు. విశ్వసంబంధమైన సమస్తమూ తెలుసుననుకోవటం కన్న మూఢత్వం ఉండదు.

  మీరు చెప్పిన నాలుగురకాల బలాలు తప్ప ఇతర బలాలు మనకు ప్రస్తుతానికి అవగాహనకు రాలేదని చెప్పటం శాస్త్రీయమైన ఉటంకింపు అవుతుంది.

  ఈ నాలుగురకాల బలాలు తప్ప ఇతర బలాలు లేనే లేవని చెప్పటం అశాస్త్రీయదృక్పథం అవుతుంది.

  ReplyDelete
  Replies
  1. సర్ మీరు మొదటి నుండి అన్ని పోస్ట్ లు చదవండి.అప్పుడు మీకే అన్ని అర్థమవుతాయి..ప్రకృతి సూత్రాలు:శాస్త్రీయ దృక్పథం అన్న వ్యాసం చదవండి.
   ఇక్కడ ఇచ్చే ఏ నియమాలు నేను ప్రతిపాదించినవి కావు.ప్రపంచము లోని నోబెల్ ప్రైజ్ పొందిన ఇంకా చాలామంది కలిసి తయారుచేసిన సూత్రాలను రచయిత వ్రాయగా విద్యార్థుల,ఉపాధ్యాయుల,సైన్సు పట్ల అభిరుచి కలిగిన వారి కోసం అవగాహనకి ప్రస్తావిస్తున్నాను.సైన్సు ఎప్పుడు ఇప్పటి వరకు కనుగొన్న వాటి గురించే మాట్లాడుతుంది.
   మీరన్నది నిజమే.
   ఇప్పటి వరకు ఇది కరెక్ట్.రేపు ఇంకేదయినా బలం వున్నట్లు నిరూపణ అయితే దానిని తీసు కుంటుంది.ఇంతకు ముందు సూత్రం లో చెప్పినట్లు మార్పు శాశ్వతం.
   ఏదేమైనా మీ ఆసక్తికి,మీ సైన్సు తెలుసుకోవాలన్న మీ అభిరుచికి ధన్యవాదాలు.

   Delete
 2. రవిశేఖర్ గారు,సి,బలహీనమైనకేంద్రకబలాలు బదులుగా బలమైనకేంద్రకబలాలు గా సరిచేయండి. ఓకే -కేదారి,ఏలూరు.

  ReplyDelete
 3. మీ కృషి కి ధన్యవాదాలు.
  సాంబశివ ప్రసాద్

  ReplyDelete