ఈ విశ్వం లో ఏదీ స్థిరంగా
లేదు.ప్రతిది చలనం లో వుంది.ఏ వస్తువు శాశ్వతం
కాదు.చిన్నదైనా,పెద్దదైనా ప్రతిది మార్పు చెందవలసిదే .మారనిదేదీ విశ్వం లో లేదు.కేవలం
మార్పు మాత్రమే శాశ్వతం.గతిలో లేని దానికి విశ్వం
లో స్థితి లేదు.(Nothing in the Universe
is Eternal;Nothing is static;Everything,smaall or Big,Has to Change.No Object
is permanent.Only Change is Permanent).
ఈ విశ్వం లో వున్నా వస్తువులన్నీ ,వ్యవస్థలన్నీ మారుతుంటాయి
.గాలీ ,నీరు కదులుతుంటాయి
.ఘన పదార్థాలలోని
పరమానువుల్లో కదలిక ఉవంది.పర్వతాలు,భుఖందాల్లో కదలిక లున్నాయి సౌరమండలం ,పాలపుంత మొత్తం గిరగిరా తిరుగుతుంది..విశ్వం గమనం లో వుంది.విశ్వం విస్తరిస్తూ వుంది.మనిషి శరీరంలో కణాలున్నాయి. వాటిలో కదలిక వుంది.మరణం
తర్వాత శరీరం లోని అణువులు,కణాలు గాలిలో ,నీటిలో
భూమిలో కలవడం ఈ కదలిక
లో భాగమే!కాలం కదులుతుంటే
పదార్థంలో మార్పులు జరుగుతుంటాయి.కొన్ని మార్పులు నెమ్మదిగా కొన్ని త్వరగా జరుగుతాయి.మార్పు లేనిదంటూ ఏదీ లేదు.
మార్పు ఎందుకు జరుగుతుంది?పదార్థం లోని అంశాలు పరస్పరం
నియంత్రించుకుంటాయి.పరమాణువులో నున్న ప్రోటాన్,న్యూట్రాన్ పరస్పరం నియంత్రించుకుంటాయి.వస్తువులు కూడా అలాగే!
పరమాణువులోనున్న ధనా వేశిత ప్రోటాన్,ఋణావేశితఎలక్ట్రాన్ వుంటాయి.ఈ ధ్రువాల మధ్య
ఘర్షణ,ఐక్యతల సమన్వయ వ్యక్తీకరణే మార్పులు కలిగిస్తుంది.మార్పు పదార్థ స్వతః లక్షణం.మారేదాన్నే
పదార్థం అంటారు.గణిత ,బౌతిక ,రసాయన,జీవశాస్త్ర గ్రంధాలన్నీ
మారుతుంటాయి.కొత్త విషయాలు వస్తుంటే
పాతవాటిని త్యజిస్తుంటాయి.ఈ రోజు సైన్సు
వేరు.రేపటి సైన్సు వేరు.నిన్న టి సైన్సు మరోవిధం.ఇలా మార్పే శాశ్వతం.
సౌరమనాదళం అంటే ఏంటండి?
ReplyDeletethat is solar system.corrected spelling mistake.
Delete