మానవ జాతికి చెట్లు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది .చెట్ల వలన మనం పొందే లాభాలు తెలుసుకోండి మరి .
ఇంత మేలు చేసే చెట్లను మనం కాపాడుకోవాలి.ప్రభుత్వం చేసిన walta చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
( ఈ సమాచారం ఈనాడు పత్రిక నుండి సేకరించినది.వారికి ధన్యవాదాలు)
- రెండు పెద్ద చెట్లు రోజుకు నలుగురున్న కుటుంబానికి సరిపడా ప్రాణ వాయువు నిస్తాయి .
- ఒక పెద్దచెట్టుకు రెండు నుండి నాలుగు లక్షల ఆకులు ఉంటాయి.ఇవన్నీ కూడా వడబోసే filters లాగా పనిచేస్తాయి.అంటే గాలిని శుభ్ర పరుస్తాయి.
- ఒక ఎకరం విస్తీర్ణం లో దట్టంగా ఉండే చెట్లు ఏటా 13 టన్నుల దుమ్ము,ధూళిలను తొలగిస్తాయి.
- చెట్లు లేని రోడ్ల దగ్గర లీటరు గాలిలో 10 నుండి 12 వేల ధూళి కణాలు ఉంటె చెట్లు ఉన్న రోడ్ల దగ్గర కేవలం 3 వేలే ఉంటాయి
- చెట్టు సహజ మయిన aircondition లాగా పనిచేస్తుంది.ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు 100 gallons నీటిని గాలి లోకి తేమ రూపంలో వదులుతుంది.అందుకే చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది.
- ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని అయిదు రూం ఎయిర్ కండీషనర్స్ రోజుకు ఇరవై గంటల వంతున పని చేస్తేనే గాని ఇవ్వలేవు.
- ఒక ఎకరం విస్తీర్ణం లోని చెట్లు ఏడాదికి 2.6 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను వాతావరణం నుండి తొలగిస్తాయి.
- చెట్ల వేళ్ళు భూగర్భ జలాలనుండి ప్రమాద కరమైన కాలుష్యాలను తొలగించి శుద్ధి చేస్తాయి.
- ఒక football ground ఆవరణలో ఉండే చెట్లు (సుమారు 400 ) వాహనం ఏడాది పాటు వదిలే కాలుష్యాన్ని వాతావరణం నుండి తొలగించ గలవు.
- 50 ఏళ్లలో ఒక చెట్టు 37,500 డాలర్ల (సుమారు 1,90,000) విలువైన ఆక్సిజన్ ను ఇస్తుంది.
ఇంత మేలు చేసే చెట్లను మనం కాపాడుకోవాలి.ప్రభుత్వం చేసిన walta చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
( ఈ సమాచారం ఈనాడు పత్రిక నుండి సేకరించినది.వారికి ధన్యవాదాలు)
No comments:
Post a Comment