ఆఫ్రికాలో ఆవిర్భవించిన మానవుడు భూమండలమంతటా ఎలా విస్తరించాడన్నది అతిపెద్ద సైన్స్ మిస్టరీల్లో ఒకటి.1987 లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్త అల్లెన్ విల్సన్జన్యు విశ్లేషణల ఆధారంగా జరిపిన పరిశోధనతో చరిత్రకు 2 లక్షల ఏళ్ల వయసుందని తేలింది.దాదాపు 50000 ఏళ్ళ క్రితం తొలుత ఆసియా, ఆ తర్వాత ఆస్ట్రేలియా తదుపరి యూరప్,చివరగా అమెరికా భూభాగాలను చేరుకున్నారు.3 రకాల ఆధారాల వల్ల ఇది తెలి సింది. 1)పురావస్తు అవశేషాలు 2)జన్యు విశ్లేషణలు 3) సాంస్కృతిక చిహ్నాలు
1) మారుమూలన ఉన్న గుహల్లో,విస్తారమైన తీర ప్రాంతాల్లోలభించిన శిలాజాలను అధ్యయనం చేయటం ద్వారా ఆయా ప్రాంతాలకు ఎప్పుడు వచ్చాడో తెలిసింది .
2) ఇక రెండో దైన జన్యు విశ్లేషణల విషయానికి వస్తే వలస వెళ్ళిన వాళ్ళు తమతో పాటు తమ పూర్వీకుల జన్యు ఉత్పరి వర్తనాలను తీసుకెళ్ళారు . ఉదాహరణకు M 130 అనే జన్యు సంకేతం మలేషియా ప్రజల్లో 10% ఉంటె ,న్యుగినియాలో 15% ఆస్ట్రేలియాలో 60% ఉంది.అంటే వరుసగా ఈ ప్రాంతాల ద్వారా వలసలు జరిగాయని స్పష్ట మైంది . అండమాన్ దీవుల ప్రజల మైటో కాండ్రియా ను పరిశీలించటం ద్వారా ఆ ప్రాంతానికి మనుషులు తొలిసారిగా 55-65 వేల ఏళ్ళ క్రితం వచ్చి ఉంటారని తెలిసింది.3 వ విషయానికి వస్తే తీర ప్రాంతాల్లో లభించిన సముద్ర గుల్లలు,రాతిపరికరాలు కొన్ని వివరాలను అందించాయి.ఇది మనిషి ప్రయాణించిన కాలం ,మార్గం .
ఎందుకు ?
stanford విశ్వ విద్యాలయం లోని క్లయిన్ ఇలా వివరణ ఇస్తారు. 50 వేల ఏళ్ళ క్రితం ఆఫ్రికాలో ఉన్న ప్రజల ఆలోచనా ధోరణిలో ఆకస్మిక మార్పులు వచ్చాయి. దీనికి కారణం భాషకు సంబంధించిన FOXP 2 అనే జన్యువు .దీని వలన మనుషుల ఆలోచనా సరళి,అనూహ్యంగా మారి ఇతర ప్రాంతాలు వలస వెళ్ళటానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇంకో వాదన ప్రకారం 80-70 వేల ఏళ్ళ క్రిందటే సాంకేతిక సామాజిక మార్పులు సంభవించాయి.మనిషి జీవన స్థితి మెరుగవటంతో విపరీతంగా పెరిగి దక్షిణ ఆసియా వైపు విస్తరించటం ప్రారంభించింది.ఇదే మానవ మహాప్రస్థానానికి నాంది అంటారు మెల్లర్స్.వాతావరణ మార్పులు
కూడా ఒక కారణం అంటారు .
(ఈ వ్యాసం ఈనాడు నుండి సేకరించినది వారికి ధన్యవాదాలు )