1) క్వాంటం కంప్యూటింగ్: ఉమేష్ వజిరాని దీనిపై పరిశోధనలు చేస్తున్నారు.క్వాంటం కంప్యూటర్లు సిలికాన్ చిప్ లతో కాకుండా హైడ్రోజెన్ అణువులతో పనిచేస్తాయి.
2) విశ్వం ఎలా పుట్టింది?: శ్రీనివాస కులకర్ణి లాస్ ఏంజెల్స్ దగ్గరలోని kaaltech యూనివర్సిటీ లో ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్ర వేత్తగా పనిచేస్తున్నారు.విశ్వం పుట్టుక రహస్యాన్ని చేధించటానికి గామా కిరణాల గురించి పరిశోధనలు చేస్తున్నారు.
3)మూర్చ : Dr హితేన్ జవేరీ మూర్చను నియంత్రించటానికి pacemaker లాంటి సాధనాన్ని కనిపెట్టాలనే లక్ష్యం తో పనిచేస్తున్నారు.
4) మనుషులకు జంతువులకు మధ్య తేడా!: ఈ తేడాను వివరించేందుకు తద్వారా మానవ పరిణామం లోని చిక్కుముడులు విడగొట్టెందుకు కాలిపోర్నియా యూనివర్సిటీ కి చెందినా అజిత్ వర్కీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకై ఆయన తనపైనే ప్రయోగం చేసుకున్నారు.ఈ అధ్యయనానికి గ్లైకో బయాలజీ అనిపేరు పెట్టారు .
5) అతి సూక్ష్మ మైన జెట్ ఇంజెన్స్ ద్వారా ఎలెక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ ను అందించే టెక్నాలజీ ని అమిత్ మెహ్రా రూపొందిస్తున్నారు. ఇది ఇంధనం లోని రసాయన శక్తిని విద్యుత్ గా మారుస్తుంది.
6) మందుల అభివృద్ధిలో పేరు పొందిన ఖోస్లా ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో celiac sprue అనే ఆటో ఇమ్యూన్ జబ్బుపై పరిశోధనలు పెట్టారు .
7) శరీరం లోకి చిన్న చిన్న క్యాప్సుల్స్ నిర్దేశించిన మందులు వదిలేసే అంశం పై పరిశోధిస్తున్నారు,మల్లాప్రగ్గడ సూర్య .ఈమెను 100 మంది అత్యుత్తమ ఆవిష్కర్తల్లో ఒకరిగా MIT ప్రస్తుతించింది. మధుమేహ రోగులకు ఇంజెక్షన్ల బాధ తప్పించేందుకు బోస్టన్ యూనివర్సిటీలో biomedical ఇంజినీరింగ్ లో ప్రొఫెసర్ గా ఉన్న తేజాల్ దేశాయ్ ప్రయత్నిస్తున్నారు.
8)Activematerials పై ప్రొఫెసర్ కౌశిక్ భట్టాచార్య పరిశోధనలు ప్రపంచ ప్రఖ్యాతి నార్జించి పెట్టాయి లోహాలలో ఉన్న PATERN ను మార్చి మనకు నచ్చిన లోహాలను డిజైన్ చేసుకోగలమా? అని కాలిఫోర్నియా institute లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కౌశిక్ పరిశోధనలు ఫలిస్తే నానో టెక్నాలజీ రంగమే కొత్త మలుపు తిరుగుతుంది .
9) మెదడు ఏ విధంగా అభివృద్ది చెందుతుంది ?దీనిని ప్రభావితం చేసే అంశాలేమిటి? MIT లో బ్రెయిన్ and కాగ్నిటివ్ డిపార్టుమెంటుకు హెడ్ గా పనిచేస్తున్న మృగాంక సుర్ చేసిన పరిశోధనలు కొత్త ఊపు నిచ్చాయి.
10) రోటో వైరస్ చాలా ప్రమాదకరమైనది.ఈ విషయం పై టెక్సాస్ మెడికల్ సెంటర్ లో B.V.V ప్రసాద్ పరిశొధిస్తున్నారు.
వీరందరి పరిశోధనలు ఫలించి నోబెల్ బహుమతులు పొందాలని ఆశిద్దాం .
(ఈ సమాచారం ఈనాడు పేపర్ నుండి సేకరించినది వారికి ధన్యవాదాలు )