ఈ క్రింది నియమాలు పాటించటం ద్వారా రోజుకొక యూనిట్ విద్యుత్ ఆదా చెయ్యవచ్చు .
1) పగటి వేళ దీపాలు వెలిగించ వద్దు.
2) గదిని వదిలినా,ఇంటిని వదిలినా దీపాలు,పంఖాలు ఆర్పి వెళ్ళండి.
3) t.v,కంప్యూటర్,microvave ,వి.సి ఆర్ ,d.v.d వంటి వాటిని main switch వద్ద ఆపండి .
3) CFL బల్బులు వాడండి ఇవి తక్కువ వాటేజితో ఎక్కువ వెలుగు నిస్తాయి.
4) FANS కి ELECTRONIC REGULATOR వాడండి . ఫ్రిజ్ లకు సరిపోయే ధర్మోస్టాట్ అమర్చండి ఫ్రిజ్ ను తరచూ ఎక్కువ సేపు తెరచి ఉంచవద్దు .
5) ఇంటిలో నీరు ఆదా చేయండి వాటిని మోటార్ ద్వారా పైకి తోడుతున్నామని గుర్తించండి .
రోజుకు ఒక యూనిట్ అంటే నెలకు 30 యూనిట్స్ ఆదా చేస్తే ఏడాదికి 1800 --2000 రూపాయలు విద్యుత్ బిల్లు తగ్గుతుంది .ఇలా చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే 30 లక్షల మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వినియోగ దారుల ద్వారా నెలకు 9 కోట్ల యూనిట్స్ విద్యుత్ ను అనగా రు 4.50 చొప్పున 40-50 కోట్ల రూపాయలు ఆదా చేయగలము.పవర్ హౌస్ వద్ద రు 1440 కోట్ల మూల ధనం ఖర్చు కాగల 240 మెగా వాట్స్ సామర్థ్యము తో సమానం.నెలకు లక్ష టన్నుల బొగ్గు అనగా ఏటా 12 లక్షల టన్నుల బొగ్గు వనరు ఆదా అన్నమాట.ఈ ఆదా పర్యావరణంలో 18 లక్షల టన్నుల co2 కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
ఈ విషయాలు గ్రహించి పొదుపు సూత్రాలు పాటించి రోజుకో యూనిట్ ఆదా చేద్దాం .
బాగుంది.
ReplyDeleteనేనూ నా మాటలు కొన్ని వ్రాసాను. చూడండి నా టపా: విద్యుత్తు వినియోగమూ - పొదుపూ.
ధన్యవాదాలండి.చూస్తాను
DeleteGood Post
ReplyDeleteThank you sir.
Delete