మన అమ్మమ్మ ఇల్లు అక్కడే.....
మీ అమ్మమ్మ పేరు ఏంటి? మరి వాళ్ళ అమ్మమ్మ పేరు? ఉహూ తెలీదు కదూ!మన మైటో కాండ్రియా ఈవ్ (అంటే మనందరి అమ్మమ్మమ్మ.......) పుట్టిన ఊరు ఆఫ్రికా ఖండం లో ఉందట.ఈ విషయం మైటో కాండ్రియా DNA ద్వారా Scientist లు నిరూపించారు. ఇంతకు ముందు post మొత్తం చదవండి, మానవులంతా బంధువులే ననే వాస్తవం తెలుస్తుంది.విద్యార్థుల్ని నేను ఎప్పుడు మీ నాన్న పేరు ఏమిటి, వాళ్ళ నాన్న పేరు ఏమిటి? అంటూ వెనక్కి అడుగుతూ ఉంటాను. 3,4 తరాలు చెప్పగలరు ఎవరయినా!మా నాన్న గోవిందరెడ్డి 13 తరాల మా వంశ వృక్షం నా కందించి వెళ్లారు.అలాగే ప్రస్తుతం జనాభా ఎంత? అలా 100,200, 1000,10,000 ఏండ్ల క్రిందట జనాభా ఎంత ఉండొచ్చు అని అడుగుతుంటా!అలా 2,00,000 ( రెండు లక్షల) సం.క్రితంకొద్ది మంది హోమో సే పియన్స్ సమూహమే ప్రస్తుత మానవజాతి అంతా.DNA ఆధారంగా మానవులంతా బంధువులే అని నిరూపించింది సైన్స్. ఈ ఆధారం మరో తిరుగులేని సాక్ష్యం. ప్రతి ఒక్కరిలో ఈ భావం పాఠశాల స్థాయి నుంచే నేర్పితే ప్రపంచం ఇలా ఉండదు.... ఒద్దుల రవిశేఖర్.
No comments:
Post a Comment