ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దోర్నాలలో మినీ ఫారెస్ట్ ఏర్పాటు.
దోర్నాల(ప్రకాశం జిల్లా ) లో శ్రీశైలం వెళ్లేదారిలో గణపతి చెక్ పోస్ట్ వద్ద చిన్న అడవిని సృష్టిస్తున్నాము రండి అని దోర్నాల FRO విశ్వేశ్వర రావు గారు ఆహ్వానించడం తో APNGC తరపున నేను సజీవ రాజు, ప్రదీప్ వెళ్ళాము. దిగగానే Coffee shop ఏర్పాటు ఆకట్టుకునే design తో కనిపించింది. అలాగే ప్రక్కన అమరుడైన అటవీ ఉద్యోగి రాజారావు జ్ఞాపకంగా ఒక సమావేశపు గది నిర్మించారు.NSTR (Nagarjuna sagar Tiger reserve forest )వివరాలు తెలియజేసే విశాలమైన ద్వారం, చెక్ పోస్ట్, ఓ ప్రక్కన గణపతి మందిరం కొద్దిగా దగ్గరిలో హరిత resorts ఇలా ఈ ప్రాంతం అప్పటికే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక కుడివైపున అటవీ శాఖవారి ఖాళీస్థలం కొండకు దిగువగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని ఒక చిన్న అడవిగా మార్చాలని సంకల్పించారు FRO U.విశ్వేశ్వర రావుగారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం డివిజన్ DFO విగ్నేష్ గారు హాజరైయి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.విశ్వేశ్వరావు గారి మాటల్లో ఈ క్రింది విధంగా ఈ project ను అభివృద్ధి చేయాలని సంకల్పించారు.
1) NSTR ప్రజా ఉద్యానవనం :
April 22 న earth day సందర్భం గా కడియం నుండి 1000 పెద్ద మొక్కలు తెప్పించి మొదటి దశలో నాటారు అవన్నీ ప్రస్తుతం బాగా చిగుర్లు వేసి ఆహ్వానిస్తున్నాయి.ఇంకా 1000 మొక్కలు ఇందులో నాటాలి. ఇందులో 25 రకాల అటవీ, పూల, పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇందులో మర్రి చెట్టు దాని చుట్టూ ఒక అరుగును ఏర్పాటు చేయాలి.
2)సాహస క్రీడల ఉద్యానవనం :ఇందులో మొక్కలతో పాటు rope activities, Zip line, బంగీ jump, ల్యాండ్ zorbing, Body Zorbing, spring toys వంటి విభిన్న క్రీడా అంశాలు ఉంటాయి.
3)బహిరంగ వ్యాయామశాలను ఏర్పాటు చేయడం
4)ఖగోళ పరిశీలనా కేంద్రం :ఇందులో ఒక telescope ను అమర్చి అంతరిక్షాన్ని గ్రహ, నక్షత్ర గమనాలను పరిశీలించే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు.
5)NSTR People's memorial park:ఇందులో ప్రజలు ఎవరి మొక్కను వారు నాటుకునే విధంగా ప్రోత్సా హిస్తూ వారి నామ ఫలకం, ఒక ప్రశంసాపత్రం ఇచ్చి ప్రజా ఉద్యానవనంగా తీర్చి దిద్దాలని ప్రణాళికలు రచించారు
6) చెంచు కళా వేదిక: చెంచుల జీవనశైలి,సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేయబోతున్న ఒక సాంస్కృతిక వేదిక ఇది.
7)అకిరో మియావాకి పద్ధతి :అడవిని పోలిన వృక్షజాతులను దగ్గరిగా నాటి దట్టమైన అడవిని తక్కువ కాలంలో తయారు చేసే పద్ధతి. ఇది జపాన్ లో ఆవిష్కరించ బడిన సాంప్రదాయే తరపద్ధతి. canopy, వృక్షజాతులు,scrubs ఇలా విభిన్న రకాలు తక్కువ ప్రాంతం లో పెంచడం అవి పరస్పరం సహకరించుకుని చక్కని పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయి.మామూలు చెట్ల కంటే ఈ పద్దతిలో చెట్లు,మొక్కలు వాతావరణం నుండి 30% ఎక్కువగా CO2 ను గ్రహిస్తాయి. soil, moisture conservation దీనివల్ల బాగా జరుగుతుంది. దీన్ని చక్కటి ప్రణాళికతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
8)వెదురు వనం :భారత దేశం లోని విభిన్న వెదురు జాతుల మొక్కలను తెచ్చి ఒక వెదురువనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
9) మామిడి వనం :40 రకాల మామిడి మొక్కలు తెచ్చి పెంచాలనే నిర్ణయం జరిగింది
10) విభిన్న రకాలయిన వృక్ష జాతులు ఒక చోట ఉండే విధంగా ఒక Botanical garden ను ఏర్పాటు చేయబోతున్నారు.Bi.PC విద్యార్థులకు ఇది ఒక వరం.
*** ఇది అంతా Dornal FRO U. విశ్వేశ్వర రావు గారి brain child.
ఆయన చెబుతుంటేనే నాకు ఎంతో exiting గా అనిపించింది.ఇహ పూర్తి రూపు సంతరించుకున్న తరువాత ఈ project లో విహరిస్తే అన్నింటిని మరిచిపోయి ఆనందించ వచ్చు.అటవీశాఖ వారు మార్కాపురం ప్రాంత వాసులకు ఇవ్వబోయే అద్భుతమైన కానుకగా భావించవచ్చు. అంతే కాదు శ్రీశైలం వెళ్లే యాత్రికులు దోర్నాలలో ఒక రోజు ఆగి ఈ ఉద్యానవనాల్లో వివరించ వచ్చు. ఇహ పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇదో ఆనంద వేదిక అవుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది పండుగే. ఈ విషయాలు అన్ని తెలుసుకుని సమాజం లోని విభిన్న వర్గాలు Dornal FRO గారిని కలిసి తమ యొక్క సహకారాన్ని, మద్దతును తెలియజేయండి.ఈ కార్యక్రమానికి దోర్నాల వాస్తవ్యులు మణి అనే యువకుడు ఆర్ధిక, హార్థిక సహాయం అందిస్తూ అత్యంత ఉత్సాహం గా పాల్గొన్నారు. ఇటువంటి చైతన్య వంతమైన యువకులే ప్రస్తుతం అత్యవసరం. ఆయనకు అభినందనలు.ఇహ june 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2023 మొక్కలు నాటాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమానికి మీ APNGC ని ప్రత్యేకంగా ఆహ్వానించామని FRO గారు చెప్పడం చాలా ఆనందం కలిగించింది.ఇందులో ప్రకాశం జిల్లా APNGC coodinator M.సజీవ రాజు, మార్కాపురం APNGC క్లస్టర్ Coodinator ఒద్దుల రవిశేఖర్, గణిత ఉపాధ్యాయుడు ప్రదీప్, M.కృపాకర్ గార్లు హాజరయ్యారు......ఒద్దుల రవిశేఖర్
No comments:
Post a Comment