స్టీఫెన్ హాకింగ్ రచించిన ఎ బ్రీఫ్ హిస్టరీ అఫ్ టైం అనే పుస్తకాన్ని "కాలం కథ" పేరుతో ఎ.గాంధీ గారు తెలుగులోకి అనువదించారు.చాలా కాలం నుండి ఈ పుస్తకాన్ని చదవాలని అనుకుంటూ అలా గడిచి పోయింది పీకాక్ క్లాసిక్స్ వారి ప్రయత్నం వలన ఈ అనువాదం సాధ్యమయింది.తెలుగు లో సైన్స్ పై ప్రామాణిక పుస్తకాల లోపాన్ని ఇది తీర్చింది.సైన్స్ అభిమానులు చదవతగ్గ పుస్తకం.
ఇందులో 1)మనకు తెలిసిన విశ్వం,2)స్థల కాలాలు,3)విస్తరిస్తున్న విశ్వం 4)అనిశ్సితా సూత్రం ,5)ప్రాథమిక కణాలు 6)ప్రకృతి శక్తులు ,7)కాల బిలాలు,8)కాల బిలాలు కారు నలుపేమీ కాదు,9)విశ్వం పుట్టుక దాని భవితవ్యం10) కాల బాణం 11)భౌతిక శాస్త్ర ఏకీకరణ వంటి విభాగాల్లో విశ్వం గురించి వివరించారు. చివరలో ఇచ్చిన పదజాలం చాలా ఉపయుక్తంగా ఉంది.science teachers,lecturers,స్టూడెంట్స్ తప్పక చదవతగ్గ పుస్తకం.
No comments:
Post a Comment