శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Thursday, 23 June 2022

విజ్ఞాన శాస్త్రాలు అవకాశాలు

 రచయితలు : A.P.J అబ్దుల్ కలాం, సృజన్ పాల్ సింగ్ అనువాదం :త్రిమూర్తి                           పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్                                       ఇతరుల జీవితాల్లో ఎటువంటి మార్పు తేగలం అన్న మనస్తత్వం కలిగి ఉంటారు శాస్త్రవేత్తలు.ఈ పుస్తకం 7 విభిన్న విజ్ఞాన  శాస్త్రాల శాఖల గురించి అందులో ఉన్న అవకాశాల గురించి తెలియ జేస్తుంది.1) రోబో విజ్ఞాన  శాస్త్రo:భవిష్యత్ రోబో శాస్త్రం ప్రగతిని గురించి,మానవాకార రోబో అసిమో, జీవ ప్రేరిత రోబోల గురించి వివరిస్తారు.2) వైమానిక శాస్త్రo :విల్బర్ రైట్, ఆర్విల్ రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు (1903). Bernouli  సూత్రాన్ని ఇందులో ఉపయోగిస్తారు.శబ్ద వేగం (1200km/hr)కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ విమానాలు,సూపర్ సోనిక్ విమానాలు(6000km/hr) వంటి ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెంది మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని ఇందులో తెలిపారు. 3) వ్యాధి నిర్ణయ శాస్త్రవేత్త:

మొదటగా లూయీ పాశ్చర్ సూక్ష్మ జీవుల గురించి అధ్యయనం చేశారు. సైనో బాక్టీరియా అనే సూక్ష్మజీవుల వలన 2.3 బిలియన్ సం. క్రితం భూమిపై ఆక్సిజన్ ఉత్పత్తి అయింది. బాక్టీరియా వైరస్ ల గురించి చక్కని వివరణ ఇచ్చారు. కాన్సర్, HIV వ్యాధులు కలిగించే కారకాల గురించి టీకా ల గురించి వివరించారు. రచయిత సృజన్ పాల్ సింగ్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ రూపకర్త.4) అంతరిక్ష శాస్త్రవేత్త:విశ్వం గురించి పరిశోధించిన శాస్త్రవేత్త ల ను పరిచయం చేస్తారు.విశ్వ పరిణామాన్ని అంచనా వేయడంలో జరిగిన ప్రయత్నాలను కూలంకషంగా వివరిస్తారు.అబ్దుల్ కలాం గారు ఇందులో తన విశేషమైన అనుభవాన్ని పంచుకుంటారు.       5) నాడీ శాస్త్రవేత్త:మనిషి మెదడు గురించి విశేష మైన, అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయి.మెదడు, యంత్రం సంధానం అప్పుడే ప్రారంభమయ్యింది. ఇందులోని అవకాశాలు నాడీ శాస్త్ర నిపుణుడు డా. జోగి వివరిస్తారు.6)పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్త:విమానాలు మెరుపుల తాకిడి కి గురికాకుండా అల్యూమినియం లోహ మిశ్రమాలు వాడుతారు. మానవ పరిణామ క్రమం లో రాగి, వెండి, ఇనుము లోహాలను ఉపయోగించి పరికరాలను తయారు చేసుకున్నాడు. తరువాత నేడు అనేక మిశ్రమ లోహాలను తయారు చేస్తున్నాడు.ఇందులో ఉన్న అవకాశాలను కలాం గారు వివరిస్తారు.   7)పురాజీవ శాస్త్రవేత్త:వీరు వేల, లక్షల సం. క్రితం భూమి మీద జీవ స్వరూపాలు ఎలా ఉండేవో శిలాజాలను అధ్యయనం చేసి తెలుసుకుంటారు. భూమి ఏర్పడ్డ 455 కోట్ల సం. నుండి భూమి మీద జరిగిన మార్పులను చక్కగా తెలిపారిందులో. ఈ రంగం లో నిపుణుడైన Dr. అశోక్ సాహని మంచి సూచనలు అందించారు.ఇలా విభిన్న మైన కోర్సులు ఉండగా డాక్టర్, software ఈ రెండు రంగాలనే మన విద్యార్థులు ఎంచుకోవడంతో అక్కడా సరయిన ఉపాధి అవకాశాలు కరువైతున్నాయి. ఉపాధ్యాయులు గా మనం ఈ పుస్తకం లోని కోర్సుల గురించి విద్యార్థులకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

No comments:

Post a Comment