.శాస్త్రీయ దృక్పధానికి పునాదులు వేసిన కొందరు మహనీయుల సాధన ,అనుభవాలు,ఆలోచనలు
ఐజాక్ న్యూటన్(1642-1727)
ప్రపంచానికి నేనెట్లా కనిపిస్తానో తెలియదు కానీ నా మటుకు నేను సత్యం అనే సాగరం ముందు ఆడుకుంటూ ,ఏ గుండ్రటి గులకరాయినో ,అంద మైన గవ్వనొ ఏరుకునే బాలునిగానే భావిస్తాను.
సి.వి రామన్ (1888-1970):
నుదిటి నుంచి స్వేదం చిందకుండా చేసే పనికి విలువ లేదు.భారతీయ మేధ ఏ ఒక్కరికి తీసి పోదు. కానీ మనకు ధైర్యం పాలు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తానన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించడం ,విజయాభిలాషను పెంపొందించుకోవడం".
రవీంద్రనాథ్ టాగూర్(1861-1941):
ఈ అనంత విశ్వం తన రహస్యాలను తనలోనే ఇముడ్చు కోవాలని ప్రయత్నిస్తుంటుంది కాని మానవుడు సామాన్యుడు కాదు. విశ్వం విసిరిన సవాళ్ళను స్వీకరించి సృష్టి రహస్యాలను బహిర్గత పరిచి ,విశ్వం పై విజయం సాధించాడు .ఈ ప్రస్తానం లో అనంత దూరాలను తనకు దగ్గరగా తెచ్చుకున్నాడు .కనరాని శక్తులను వీక్షించాడు. వివరించలేని ప్రక్రియల విశ్లేషణకు ఒక భాషను ఏర్పరుచుకున్నాడు .ఈ సంకల్పం నెరవేరడానికి కావలిసిన అభిలాష భూమిపై కొందరికే ఉంటుంది .
జవహర్ లాల్ నెహ్రు(1889-1964):
సుదీర్ఘ మైన చరిత్రలో మానవ జీవితం పై సైన్స్ చూపినంత ప్రభావాన్ని మరేదీ చూపలేదని నా నమ్మకం . సైన్స్ మనలను అనూహ్య మైన తీరాలకు తీసుకుని వెళ్ళింది .క్షీణ దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థను సమృద్ధి దిశగా రూపాంతరం చెం దిం చగల సామర్థ్యం సైన్స్లు కు ఉన్న సంగతి అందరికీ తెలి సిందే ఇన్నాల్లూ తత్వ శాస్త్ర పరిధిలోని విషయాలు సైన్స్ పరిధి లోకి వచ్చాయి.స్థల కాలాల (space-time) భావన క్వాంటం సిద్ధాంతం భౌతిక ప్రపంచ అవగాహనలో మార్పు తెచ్చాయి.శాస్త్ర అవగాహనతో మానవుడు తననూ ప్రకృతినీ వేర్వేరుగా భావించడం లేదు. మానవుని తుది గమ్యం ప్రకృతిలోని శక్తులతో ముడి వడి ఉంది.
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (1879-1955):
సత్యాన్వేషణలో సైన్స్ ఇంకా బాల్య దశలోనే ఉంది ..కాని ఇంత వరకు సైన్స్ ద్వారా మనకు లభించిన విజ్ఞానం ఎంతో విలువైనది.