శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Monday 1 October 2012

నేటి నుంచే అంతార్జాతీయ జీవ వైవిధ్య సదస్సు


          అంతార్జాతీయ జీవ వైవిధ్య సదస్సుహైదరాబాద్ లో ఈ రోజు ప్రారంభ మయింది.(Nature protects if she is protected) ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నది  ఈ సదస్సు ముఖ్య ఉద్దే శ్యం. సదస్సు పేరు cop-11. 193 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సు హైదరాబాద్ లోని HICCలో october 1 నుండి 19   తేది వరకు జరుగుతుంది.ఈ సందర్భంగా ఈనాడు,సాక్షి, ఆంధ్ర జ్యోతి పత్రికల్లోని సమాచారంలో కొంత భాగాన్ని ఇక్కడ మీకు అందిస్తున్నాను.వారికి ధన్యవాదాలు.
          ఈ సృ ష్టి కొన్ని లక్షల జీవరాశులకు నివాసం.మొదట్లో సృష్టి ఎంతో వైవిధ్యంగా ఉండేది.20 లక్షల సం:క్రితమే మనిషి పుట్టాడు.ప్రకృతిని తన కంటే చాలా బలమైనదిగా అంగీకరిస్తూ దానిని దేవతగా పూజిం చాడు.మొదట్లో ప్రకృ తి గురించి తెలుసుకుంటూ జీవులతో స్నేహం చేస్తూ ఉన్నాడు.జంతువుల మాంసం తినటం ప్రారంబించిన తరు వాత,పంటలు పండించుకునే తెలివివచ్చిన తరువాత అతనికి ధైర్యం వచ్చి ప్రకృ తి నాకోసం పుట్టిందని భావిస్తూ దానిని ఉపయోగించుకుంటూ దోచుకుంటూ,నాశనం చేస్తూ వస్తున్నాడు తాను ఈ సృష్టిలో ప్రత్యేక మని భావిస్తు న్నాడు.కానీ ప్రకృతి దృష్టిలో అందరు సమానమే!.
         వైవిధ్యమే ప్రకృతి లోని రహస్యం.మనుషుల వలన ఎన్నో జీవ జాతులు అంతరించి పోతున్నాయి ఆదిమ దశలో వన్య మృగాల్ని చంపి ఆకలి తీర్చుకున్నాడు.మనిషి నాగరికత నేర్చుకున్న కొద్ది అడవుల్ని నరికేసి గ్రామా ల్ని కట్టుకున్నాడు. జంతువుల తోలు తీసి అమ్ముకోవడానికి బొమ్మల్లాగా అలంకరించుకో వడానికి ఎన్నో అమా యక జీవుల్ని పొట్టన పెట్టుకున్నాడు.ప్రకృతిలో వచ్చేమార్పుల కనుగుణంగా జీవు లు అంతరించి పోవచ్చుకానీ మనిషి స్వార్థం మూలంగా అంతరించి పోకూడదు.గనుల త్రవ్వకాలు,రవాణా మార్గాలు,పారిశ్రామికీకరణ జంతు వులకు అవరోధంగా మారాయి.
         10 సం :క్రితం 10,000 పులులుండేవట ప్రస్తుతం 1500 లోపే ఉన్నాయి.ఎలుగుబంట్లు,ఏనుగులు ఊర్ల మీద దాడి చేస్తున్నాయంటే ఈ అసమ తౌల్యం వల్లనే.వన్యప్రాణులకు అడవి ఒక స్వర్గం.పులులుంటే చెట్లను వేటగాళ్ళు ఏమీ  చేయలేరు .చెట్లు ఎక్కువుంటే వేటగాళ్ళు ఏమీ చేయలేరని అడవి జంతువుల విశ్వాసం.చెట్లు,మృగాలను మని షి ధ్వంసం చేస్తున్నాడు.వాటిని ప్రేమించే గిరిజనులను తరిమి కొడుతు న్నాడు.భూమి వేడెక్కుతుంది అన్నా వరద లు ముంచెత్తినా,భూసారం క్షీనించినా కారణం అడవులు నాశనం కావటం వల్లనే .
        నదులను,సముద్రాలను మనిషి కలుషితం చేస్తున్నాడు.సముద్ర జీవులను వేటాడి ఎగుమతులు చేసి కోట్లు గడిస్తున్నాడు.నక్షత్ర తాబెల్లను,నీటి గుర్రాలను నాశనం చేస్తున్నాడు.అన్ని పారిశ్రామిక వ్యర్థాలను నీటిపాలు చేసి మత్యసంపదను ,అందులోని జీవుల  వినాశనానికి కారణమవుతున్నాడు.  

4 comments:

  1. మనిషి అంటే పెట్టుబడిదారుడూ మనిషే, కూలిపని చేసుకునే వ్యక్తీ మనిషే, ఆ ఇద్దరిలొ యవరివల్ల నష్టం జరుగుతుంది?. జనాబాలొ 10% వున్న పెట్టుబడిదారీ వర్గమే సమస్తసంపదనూ తన స్వాదీనంలొ వుంచుకుని వుంది. దాని లాభాలకొసం ఎంచేయడానికైనా సిద్దమే. ఇలాంటి మొరలు అది ఆలకించదు. దాని లాబలకొసం, దాని మార్కెట్లకొసం అనేక యుద్దాలలొ కొట్లమంది బలైయ్యారు. ప్రతిదేశంలొనూ గుట్టలుగా ఆయుదాలు పొగుపడి వున్నాయి. సంభంధం లేని విషయాలు రాశాడు అనుకొకండి . సంభంధం వుంది. పెట్టుబడి దగ్గరకు వెళ్ళి ఎంతపార్దన చేచినా ఉపయొగం వుండదు. దాని యేకైక లక్ష్యం లాభాలు. దాని తర్వాతే ఎదైనా ఆలొచిస్తుంది.

    ReplyDelete
  2. మీరు చెప్పింది అక్షరాలా నిజం.మనుషులే కాదు మీరు చెప్పినట్లు ప్రభుత్వాలే అతి పెద్ద పెట్టుబడి దారులుగా వ్యవహరిస్తూ ప్రకృతి సంపదలను తమ గుప్పిట్లో ప్రపంచమంతా భూటాన్ ను చూసి నేర్చుకోవాలి.ప్రకృతిని వాళ్ళెలా కాపాడుతున్నారో!మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. శేఖర్ గారూ, రోజు కూలీ గూర్చి ఐదు ఏళ్లకొకసారి టైం ఉందికదా. ఓటు కోసమా వచ్చినప్పుడు కొన్ని వాగ్దానాలు పడేస్తే చాలు.
    విజ్ఞాన శాస్త్రం అవసరమే కాని ముందు ఆకలి తీరాలి కదా.

    ReplyDelete
  4. జీవ వైవిధ్యం సామాన్యుడికే ఎక్కువ అవసరం.ప్రకృతి సంపదను తన ఆకలికి మాత్రమే సామాన్యుడు ఉపయోగిస్తే ప్రభుత్వాలు ,వ్యాపారస్తులు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు.ప్రకృతి వనరులు అయిపోతే ధనవంతుడు ఏదో ఒక విధం గా తన అవసరాలు తీర్చు కోగలడు. పేద వాడికే ఇబ్బంది.

    ReplyDelete