శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Saturday, 16 June 2012

ప్రక్రుతి సూత్రాలు:చివరి మాట


                 పదార్ధమంతా  మిధ్య అనేవాళ్ళు ,జీవ పరిణామాన్ని వ్యతిరేకించే వాళ్ళు 18  వ నియమాన్ని చూసైనా కళ్ళు తెరవాలి.మానవుడు,ప్రక్రుతి పరిశీలన  ద్వారా ,శ్రమ ద్వారా ఆధునిక మానవ సమాజానికి బీజం వేసాడు.పైన పేర్కొన్న సూత్రాల పరిధిలో సాగుతున్న నేటి శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగానో అభి వృద్ది చెందాయి.అయితే ఈ విజ్ఞాన శాస్త్ర ఫలితాలను కొందరు మాత్రమే అనుభవిస్తున్నారు.సామాన్య ప్రజా నీకానికి ఈ ఫలితాలు నేటికీ అందుబాటులో లేవు.అత్యంత ధనిక వర్గం ప్రపంచ వనరులలో 85% మేరకు వినియోగిస్తున్నారు.కాగా అత్యంత పేద వర్గాలకు కేవలం ప్రపంచ వనరులలో 1% మాత్రమే  అందుబాటు లోఉంది .సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్ర సాంకేతిక రంగాల పరి జ్ఞానాన్ని ఉపయోగించాలి.ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని  శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధనలు సాగాలి.
        ఆధునికతను సంతరించుకున్న శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో పరోక్షంగాను,ప్రత్యక్షం గాను అందరి సమిష్టి కృషి వున్నా ప్రజా బాహుళ్యం అనేక అశాస్త్రీయ  పోకడలతోనూ,మూఢాచారాలతోను   చాందసత్వం తోను కొట్టుమిట్టాడుతోంది.ప్రాంతీయ ,కుల ,మత,వర్ణ,భాషా తదితర అనేకానేక అశాస్త్రీయ  ప్రాతిపదికల ఆధారంగా ప్రజలలో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు.యుద్ధ వాతావరణం ,అరాచకత్వం ఉగ్రవాదం,మతోన్మాదం,మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి.ఇది అశాష్ట్రీయం.సైన్సు సూత్రాలకు విరుద్ధం.ప్రజలందరిలో సౌభ్రాతృత్వం,సాంస్కృతిక వికాసము,వివేకం కలిగించడం ద్వారా  ఐకమత్యాన్ని పెంపొందించాలి.తద్వారా ప్రపంచ శాంతిని శాశ్వతం చేయాలి.ఈ లక్ష్య సాధనకు ప్రజా సైన్సు ఉద్యమాల ఆవశ్యకత ఎంతో ఉంది.ఈ ఉద్యమాల తీవ్రతను బట్టే ప్రజలకు శాస్త్ర సాంకేతిక రంగ ఫలితాలు దక్కుతాయి .ప్రజా సైన్సు ఉద్యమం పట్ల సరియైన అవగాహన కలిగిన నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్య మవుతుంది.
            "ప్రకృతి సూత్రాలు-శాస్త్రీయ దృక్పధం" అనే అంశాన్ని అధ్యనం చేయడం ప్రజా సైన్సు ఉద్యమ నిర్మాణం లో ఒక అత్యవసర భాగం.సమసమాజ స్థాపనకు కృషి చేసే శక్తుల పట్ల సానుభూతి ప్రకటిస్తూ స్వతంత్రంగా ప్రజా బాహుళ్యంలో ప్రజలకోసం సైన్సు,ప్రగతి కోసం సైన్సు ,ప్రపంచ శాంతి కోసం సైన్సు ,అనే నినాదాలతో కృషి చేస్తున్న అల్ ఇండియా పీపుల్స్ సైన్సు నెట్ వర్క్ (APSN) అనుబంధ సంస్థ జనవిజ్ఞాన వేదిక ఉద్యమాల్లో భాగమై భారత రాజ్యాంగం సూచించిన శాశ్త్రీయ దృక్పద వ్యాప్తిలో అందరం ఉద్యమిం చవలసిన తరుణమిదే!    

Tuesday, 12 June 2012

ప్రకృతి సూత్రాలు :18 వ సార్వత్రిక నియమం


                                             జీవులన్నింటి మధ్య పాదార్థిక బంధం వుంది.
                                                 (All Life Forms are Connected).
     జీవులన్నీ పరిణామ క్రమంలో ఉద్భవించాయని మనకు తెలుసు.పరిణామమనే జీవ వృక్షంలో రెండు ప్రధాన మైన కొమ్మలున్నాయి.ఒకటి వృక్ష జాతి.మరొకటి జంతు జాతి.ఈ రెండు జాతుల్లో దేనికీ చెందని మిగిలిన జాతులు కూడా ఆ పెను జీవ వృక్షానికి అంటుకునే వున్నాయి.
         వృక్ష జాతులనే అతి పెద్ద కొమ్మలో పలు శాఖలు ఉన్నాయి.అవి ఎన్నోకుటుంబాల రూపంలో ఉండవచ్చును. ఆ శాఖలు మళ్ళీ శాఖోపశాఖలై అన్ని రకాల వృక్ష జాతులకు ఆలంబనగా వుంది.అలాగే ఆ మహావృక్షంలోని మరో కొమ్మ జంతు జాతి.అందులోమళ్ళీ ఎముకలు లేని జీవులు(invertibrates),ఎముకలున్నజీవులు(vertibrates) అనే రెండు ప్ర ధాన గ్రూపులున్నాయి.ఇవన్నీమళ్ళీ ఎన్నోవర్గాలుగా వున్నాయి.ఈ శాఖల్లో కోతులు,మానవుడుండే క్షీరదాల శాఖ అందులో మళ్ళీ primates శాఖలు ఉద్భవించాయి.కాబట్టి ఆ వృక్షపు ప్రధాన శాఖలు ,ఉపశాఖలు ఆ తర్వాతి శాఖోప శాఖల్లో ఉన్నఅన్ని రకాల జీవులు సందానించబడి ఉన్నాయనే అర్థం కదా!
   ఈ ఉదాహరణ ప్రకారం భౌతికంగా అన్నీ కలిసి ఉన్నట్టు అర్థం కాదు.ఈ కాలగమనంలో పరిణామక్రమంలో ఎక్కడో ఎప్పుడో ఒకప్పుడు అవి,ఇవీ అన్నీ బంధువులే !ఒక కుటుంబంలో వంశ వృక్షమని ,వారి మధ్య ఏదో ఒక విధమైన రక్తసంబందాన్ని (blood relation) చూడగలుగుతున్నాము.అలాగే ఇంకా వెనక్కిపోతే మనుషులందరికీ సంబంధం ఉన్నట్లు అర్థం.
  కాలగమనంలో ఒక చోటునుంచి కోతులు,మనుష్యులు అటు ఇటు పరిణామం చెందారు,కాబట్టి కోతులు మనుషులు మధ్య కూడా పాదార్థిక (he,she తదితర జన్యు బాంధవ్యం )ఉండే ఉండాలి.కోతులకు మనుషులకు,అమీబాలకు ఆ తర్వాత యుగ్లీనా,అల్గేలకు,అక్కణ్ణించి వేప చెట్లకు గోంగూరకు కూడా జన్యు పరంగా దూర బంధుత్వం ఉన్నట్లు అర్థం.ఇలా జంతువులకు,వృక్షాలకు,మనుషులకు బంధుత్వం ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.ఇక మనుషులంతా బంధువులు అని చెప్పటానికి సందేహమే లేదు.

Sunday, 10 June 2012

ప్రకృతి సూత్రాలు: 17 వ సార్వత్రిక నియమం



      (All Life is Based on the Same Genetic Code )
     జీవులను జీవంతో ఉంచేవి,కణం లోని వివిధ జీవ భౌతిక చర్యలేనని ,బహుకణ జీవుల్లో కణాలతో పాటు కణజాలాలు (tissue) కూడా కీలక ధర్మాలు నిర్వహిస్తాయని తెలిసిందే .కణాలతో జీవ రసాయనిక చర్యలు నడవాలంటే కొన్ని enjymes కావాలి. ఇవన్నీ రసాయనిక ప్రోటీన్ సంబంధ పదార్థాలు.ప్రోటీన్లు ఒక దండ అనుకుంటే ఆ దండలో పూసల్లాగా ఎమినో ఆమ్లాలు అనే చిన్న చిన్నఅణువులు ఉంటాయి.అంటే ఎమినో ఆమ్లాలను రసాయనిక బంధంతో కలిపి ఉంచితే ప్రోటీన్స్ ,enjymes,ఆ  ప్రోటీన్స్ తో కండరాలు ,రక్తనా ళాలు ,చర్మము  తదితర భాగాలు తయారవుతాయి.
         గుండె లోపల ఎన్నో బలమైన కండరాలున్నాయి.కండరాల సందానంతోనే ముఖ కవళికలు ఆధా రపడతాయి.అయితే ఈ ప్రోటీన్ లలో ఏయే ఎమినో ఆమ్లాలు ఏయే వరుసలో ఉండాలో అదే విధంగా తయారు చేసే యంత్రాంగం ఎక్కడుంది?అదే జన్యు స్మృతి.ఇది DNA అనే పెద్ద మెలేసిన నిచ్చెన లాంటి నిర్మాణంలోఉంటుంది.ఇది కాన కణ కేంద్రకం లోనే ఉంటుంది.ఈ మెలిక నిచ్చెనలో అటు,ఇటు న్యుక్లియో టైడ్స్  అనే భాగాలు వరుసలో వుంటాయి.క్రోమోజోములలో ఉన్న DNA కి శరీరపు కండరాలకు సంబం ధం వుండటం వల్లే తల్లిదండ్రుల పోలికలు బిడ్డలకు వస్తుంటాయి.
        మన శరీరానికి సుమారు 20 రకాల ఎమినో ఆమ్లాలు  అవసరం (ప్రకృతిలో సుమారు 100 రకాల ఎమినో ఆమ్లాలున్నాయి.)ఈ 20 ఎమినో ఆమ్లాలతో మాత్రమే అన్ని జీవులలోని ప్రోటీనులు ఏర్పడ్డాయి అమీబా అయినా ,ఏనుగు అయినా, వేపచెట్టు అయినా, దోమ అయినా మనిషిలో అయినా బల్లి లోను ఈ 20 ఎమినో ఆమ్లాలే ఉంటాయి.ఒక్కో ఎమినో ఆమ్లానికి DNA లోని కోడానులు ప్రతినిధులుగా ఉంటాయి ఫలాని కోడాను ఫలాని ఎమినో ఆమ్లానికి ప్రతినిధి అనడాన్ని జన్యు స్మృతి(genetic code) అంటారు.
     ఇంత సూక్ష్మ మైన జన్యు స్మృతి మొక్కలైనా జంతువులైనా అన్ని జీవులలోను ఒకే విధం గా ఉంటుంది.సైన్సు ప్రకారం జీవులు ఇంత గొప్పగా పాదార్తికంగా  ఏకమై ఉండగా మనుషుల్లోనే మనుషుల మధ్య కులాల ,మతాల పేరుతో చిచ్చు పెట్టటం ఎంత వరకు సబబు?  

Friday, 8 June 2012

ప్రకృతి సూత్రాలు: 16 వ సార్వత్రిక నియమం



                                         జీవం కేవలం కణాల్లో మాత్రమే ఉండగలదు
                                                 (Life Exists only Inside a Cell)
            భూమ్మీద మాత్రమే జీవం ఉన్నఆధారాలున్నాయి .భూమి లాంటి పరిస్థితులు విశ్వంలో కొన్నికోట్ల గ్రహాల్లో ఉన్నట్లు అంచనావేశారు .అయినా భూమికి తోడుగా మరెక్కడా జీవులు ఉన్న దాఖలాలు ఇంత వరకు రుజువు కాలేదు.భూమ్మీద జీవులు ఏర్పడే పరిస్థుతులు 300 కోట్ల  సం :క్రితం ఒనగూరాయి అప్పు డున్న పరిస్థితుల్లో తొలి జీవ రూపాలు చిన్న చిన్న nitrogen భరిత అణువుల రూపం లోను ఎమినో ఆమ్లాలు,ఫాస్పోలిపిడ్ల రూపం లోను నిండి ఉండవచ్చును.
       అయితే నేడు మనం జీవులు అంటే ఏమిటో కొన్ని లక్షణాల ఆధారం గా నిర్వచిస్తున్నాము.తమ  లాంటి వాటినే నిర్జీవ పదార్థాల సహాయంతో నిర్మించుకొనే శక్తి ఉన్న పదార్థ రాశులని ,ప్రకృతిలోజరిగే సహజ మార్పుల్ని ఎదురొడ్డి అసహజ రసాయనిక చర్యల్ని స్వతహాగా కొనసాగించు కోగలిగిన శక్తి ఉన్న పదార్థ స్వరూపాల్ని జీవులు అని స్థూలంగా నిర్వచించు కోవచ్చును.
     అలాంటి లక్షణాలకు నిలబడే పదార్థాలే జీవులనుకుంటే అవి కణ నిర్మితాలు.కణం లేకుండా జీవం నేడు ఎక్కడా లేదు.దాన్నే జీవ కణం అంటారు.కణం అంటే కణ కవచం .అందులో కేంద్రకం లోపల న్యూక్లిక్ ఆమ్లాలు (DNA or RNA) క్రోమోజోములు,కేంద్రకం బయట కణ కవచానికి లోపల సైటోప్లాజం ,అందులో ఎన్నో కార్యక్రమాల్ని నెర వేర్చేందుకు కణాంగాలు ఉన్నాయి.
        ఆఖరికి నిర్జీవియో,జీవియో తేల్చలేని పరిస్థితిలో ఉన్న వైరస్ లకు కూడా కణ స్వరూపం ఉంది.అవి ఇతర జీవులలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకోగలవు.తమంత తాముగా నిర్జీవ పదార్థాల  నుంచి  ప్రత్యుత్పత్తి జరపలేవు.కణాల్లో ఏ రకమైన జీవ రసాయనిక విడిగా ఉన్నప్పుడు జరగవు.అయినా ఎంతోకొంత జీవ లక్షణం వైరస్ల కుందని అనుకోవచ్చును.
     దెయ్యాలు,భూతాలు అంటూ నమ్మే వాళ్ళు టి.విలు,సినిమాల నిండా అలాంటి పాత్రల్నిగుప్పించేవాళ్ల కు  ఈ నియమం పెద్ద సవాలు.దయ్యాలు భూతాలు కదులుతున్నట్లు,పగ సాధిస్తున్నట్లు,ఘన కార్యా లు చేస్తున్నట్లు చెప్పడమే కాకుండా అవి వున్నట్లు వాదిస్తుంటారు.దయ్యాలు,భూతాలు చేసే పను లు నిర్జీవ పదార్య్హాలు చేయ లేవు.కేవలం జీవ ధర్మాలున్న పదార్థాలు మాత్రమే చేయగలవు.జీవం కణాల్లో  తప్ప మరెక్కడా ఉండ లేదని ప్రకృతి నియమాలు తెలియచేస్తున్నాయి.మరి దయ్యాలకు భూతా లకు కణాలెక్క డివి? కణాల తయారికి పదార్థా లెక్కడివి?జీవ కణాలు జీవ కణాల తోనే తయారు కాగల వు. మరి ఏ జీవ కణాలతో ఈ దయ్యపు కణాలు తయారయ్యాయి?ఒక వేళ అవి కూడా మనుషుల్లాగే బహుక ణ జీవులే అయితే మరెందుకు అవి కనిపించవు?కొందరికే ఎందుకు కనిపిస్తాయి?

Tuesday, 5 June 2012

ప్రకృతి సూత్రాలు:15 వ సార్వత్రిక నియమం



               భూమ్మీద జీవం నిర్జీవ పదార్థాల నుండే పుట్టింది.జీవం పరిణామం చెందుతూ పలు రూపాల్లోకి             ప్రకృతికి అనుగుణంగా విస్తరిస్తోంది.మానవుడు జీవ పరిణామం ద్వారానే సంభవించాడు.
(Life Originated from Innanimate Matter and Has Been Diversifying by Natural Selection;Man is Part of the Organic Evolution)
      కొంత మంది విశ్వాసం ప్రకారం దేవుడు ముందు మనుషుల్నిసృష్టించాకే వారి తోడు కోసం మిగిలిన జీవ జాతుల్ని   సృష్టించాడనే  విషయాన్ని పరిశీలిస్తే భూమి వయస్సు క్రీస్తు జన్మించేనాటికి సుమారు 6000 సం : మాత్రమే!అంటే నేటికి దాదాపు 8000 సం :రాలు అన్న మాట.నిజానికి ఆ పాటికే మానవ జాతి ఎంతో బాగా పరిణామం చెందింది.
      విశ్వం పుట్టిన  1000 కోట్ల  సం :రాల తర్వాతనే భూమి పుట్టింది.1500 కోట్ల సం :రాల క్రితం బిగ్ బాంగ్ ద్వారా విశ్వం ఆవిర్భవించిందని అందులోంచి నెబ్యూలాలు,గేలాక్సీలు ఏర్పడ్డాయనీ ఖగోళ శాస్త్రం చెబుతోంది.సుమారు 600 కోట్ల సం:రాల క్రితం పాలపుంత గెలాక్సీలో తన చుట్టూ తాను తిరుగుతున్న వేడి ముద్దలోని మధ్య భాగం సూర్యుడు గాను అంచులలో భాగాలు గ్రహాలూ గాను మారాయి.భూమి 550 కోట్ల సం:రాల తర్వాత ఏర్పడింది.
     భూమిపై 80 కోట్ల సం:తర్వాత అనుకూల పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత నీటిలో కరిగిన సేంద్రియ (organic),నిరేoద్రియ (inorganic) పదార్థాల నుంచి జీవ కణాలు ఏర్పడ్డాయి.ఆ కణాలే పరిణామం చెంది అనేక జంతుజాలాలుగా ,వృక్షజాతు లుగా అభివృద్ది చెందాయి.సుమారు 300 కోట్ల సం:క్రితమే జీవకణాలు భూమ్మీద ఏర్పడ్డట్టు ప్రబలమైన ఆధారాలు  న్నాయి.
          కానీ మానవజాతి ఆవిర్భావం జరిగింది సుమారు ఇర వై  లక్షల సం:క్రితమే.భూమి మీద జీవం నిర్జీవ పదార్థాల నుంచి పుట్టిందని ఎన్నో ప్రయోగాలు రుజువు చేసాయి.అందులోమిల్లర్ ప్రయోగం అత్యంత ప్రసిద్ది చెందింది.మామూలు వాయు పదార్థాలు నీటిని అత్యంత వేడిమికి ,వెలుతురుకు గురిచేయగా ,జీవానికి మూలకణాలయిన అమ్మోనియా తదితర పదార్థాలు తయారయ్యాయి.      

Friday, 1 June 2012

ప్రకృతి సూత్రాలు: 14 వ సార్వత్రిక నియమం


    పదార్థం అంతిమంగా క్వార్కుల మయము.
(Matter is Ultimately Made Up of Quarks)
   పరమాణువులను విడగొట్టుకుంటూ వెడితే ఇంకా ఏ మాత్రం విడదీయడానికి వీలులేని మూల కణాలు  వస్తాయి.ఆ మూల కణాలు అభేద్యాలు.అవే పరమాణువులు అని డాల్టన్ అన్నాడు.ఈ సిద్ధాంతం తప్పని   పరమాణువుల్లో కూడా ఇంకా మౌలిక కణాలున్నాయని 19 వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు గుర్తించారు 20 వ శతాబ్దం లో బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి.పరమాణువులో కేంద్రకం,అందులో ప్రోటాన్స్, న్యూట్రాన్లు ఉన్నాయని,కేంద్రకం చుట్టూ చాలా దూరంలో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయని రుజువు  చేశారు.పరమాణువులో చాలా భాగం శూన్యమనీ కూడా తెలియ జేశారు.
         పదార్థం కూడా పరమాణువుల  మయం కాబట్టి పదార్థం లో కూడా శూన్య ప్రదేశం ఎక్కువే.ప్రోటాను న్యూట్రాను ప్రాధమిక కణాలని చాలా కాలం వరకు భావించారు.ప్రోటాను,న్యూట్రానుకు కూడా నిర్మాణం ఉందనీ అందులో క్వార్కులు అనబడే చిన్న చిన్న మౌలిక ధాతువు లున్నాయని వాటికి నిర్మాణం అంటూ ఏమీ ఉండదనీ అయితే వాటికి విద్యుదావేశం ,స్పిన్ వంటి లక్షనాలుంటాయనీ ఆధునిక కణ బౌతిక శాస్త్రం (particle physics) చెబుతుంది.
          ఇంతవరకు  ఎలక్ట్రాన్ ,ప్రోటాన్  దగ్గరవున్న 1.6 into 10 to the power of -19 కూలుంబుల విద్యుదావేశమే విద్యుత్తుకు ప్రాధమిక ప్రమాణం గా భావించేవారు.కనీ అందులో 2/3 వంతు ధనావేశం   1/3 వ వంతు రుణావేశం ప్రాధమిక మంటున్నారు.అంటే విశ్వంలో ఈవిధంగా చూస్తే న్యూట్రాన్లో మూడు  క్వార్కులు,ప్రోటాను లో మూడు క్వార్కులు ఉన్నాయని రుజువు చేసారు.ఈ క్వార్కులు గుయాన్లనబడే ద్రవ్యరాశిలేని శక్తివంతమైన రూపాలతో బలమైన కేంద్రక బలాల సాయంతో బంధించబడి వుంటాయి.పదా ర్థం ప్రధానం గా క్వార్కులన బడే అత్యంత మౌలిక కణాలచేత నిర్మించబడ్డదనీ క్వార్కులేవీ ఏకాంతంగా ఉండవనీ రుజువయింది.ఆ నూతన సిద్ధాంతాలను క్వాంటం క్రోమో డైనమిక్స్ (quantum chromo dynamics) అంటారు.