శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Friday, 8 September 2023

ప్రకృతి -ప్రార్ధన

 *ప్రకృతి ప్రార్ధన*(స్కూల్ అసెంబ్లీ లో ప్రతీ శుక్రవారం)


"కిలకిలరావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి, ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే వృక్ష కోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను.

చిట్టి చీమలతో శ్రమజీవన సౌందర్యాన్ని, కాకుల గుంపులతో సమైక్యతా సందేశాన్ని ఉపదేశిస్తున్న ఓ ప్రకృతి మాతా! నీకు పాదాభివందనం చేస్తున్నాను.


నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను. నాలాగే ఉడతకైనా, చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించననీ, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయననీ, విష రసాయనాలతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం కలిగించనని ప్రమాణం చేస్తున్నాను. విచక్షణతో వ్యవహరిస్తూ, మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను.

ప్రకృతిని పరిరక్షించేందుకు జీవవైవిధ్యాన్ని కాపాడతాననీ శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థిగా మెలుగుతాననీ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను."

No comments:

Post a Comment