ఎర్త్ అవర్ (Earth Hour) అనేది ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే వాతావరణ దినోత్సవం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా మారినందున భూమిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారు.
ఎర్త్ అవర్ అంటే ఓ గంట పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపేయడమే. కరెంట్ బల్బులు, టీవీలు, కంప్యూటర్లు.. వగైరా కరెంటుతో నడిచే ఉపకరణాలన్నీకాసేపు స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా విద్యుత్ ఆదా చేస్తే ఆ మేరకు భూ వాతావరణాన్ని పరిరక్షించినట్లే. 2007వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దీన్ని మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం సాధారణంగా మార్చి మాసంలోని చివరి శనివారం రాత్రిపూట ఒక గంట విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటూ ఇప్పటికి ప్రజలు స్వచ్ఛందంగా ఎర్త్ అవర్ పాటించే విధంగా చైతన్యం తీసుకురాగలిగారు.
No comments:
Post a Comment