శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Friday, 8 September 2023

భూమి ఏర్పడిన క్రమం

భూమి ఏర్పడిన క్రమం 

సుమారు 456.7 కోట్ల సంవత్సరాల క్రితం సూర్య కుటుంబంలో భాగంగా తన తండ్రి/తల్లి నక్షత్రం నుండి సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రోటో ప్లానెట్ గా భూమి ఏర్పడింది. 448 కోట్ల సంవత్సరాల క్రితం అంటే భూమి పుట్టి 87 లక్షల సంవత్సరాల తర్వాత అంగారకుడి (మార్స్) సైజున్న ఒక గ్రహం గుద్దుకోడం ద్వారా ఒకే ఒక చంద్రుడనబడే (మూన్) ఉపగ్రహాన్ని ఏర్పరుచుకోడమే కాక తన అక్షం (యాక్సిస్) 23.5 ° వంగి భ్రమణం చెయ్యడం మొదలెట్టింది భూమి. అంతకు ముందు కూడా చేస్తూ ఉండేది. భూమి ఉపరితలం మొత్తం మోల్టెన్ మాగ్మా తో (మాగ్మా సముద్రం తో) ఉన్నప్పటికి, పైన పల్చటి మూతలా ఒక ప్రాధమిక క్రస్ట్ ఏర్పడుతూ తిరిగి కరిగిపోతూ (వేడికి) ఉండేది. 450 నుండి 400 కోట్ల సంవత్సరాల మధ్య జిర్కన్ అనే క్రిస్టల్స్ వల్ల ప్రాధమిక మూత (ప్రిమోర్డియల్ లిడ్) మాత్రమే కాక గ్రానైట్ లాంటి (ఇప్పటి) క్రస్ట్ కూడా ఫార్మ్ అయ్యిందని తెలుస్తుంది. ఇవే జిర్కన్స్ లోని ఆక్సిజన్ ఐసోటోప్స్ వల్ల నీరు (ప్రాధమిక సముద్రం) ఉండేదని కూడా తెలుస్తుంది. తిరిగి 400 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఉపరితలం ఒక ఉల్కాపాత తుఫాన్ లాంటి హెవీ బాంబర్డ్మెంట్ కి గురయ్యింది. అనేక ఉల్కలు మిటియొరైట్ బెల్ట్ నుండి, అంగారకుడి నుండి ఇలా చాలా చోట్ల నుండి వచ్చి ఉల్కలు, తోక చుక్కలు పడ్డాయి. వీటిలో జీవానికి కావాల్సిన ఏమినో యాసిడ్స్, నీరు, మంచు అన్ని ఉండేవి. ఈ హెవీ బాంబర్డ్మెంట్ జరుగుతున్నప్పుడు చాలా పార్ట్ సముద్రం ఆవిరవ్వడం, తిరిగి కండెన్స్ అవ్వడం జరిగాయి. ఇది సుమారు 10 కోట్ల సంవత్సరాల పాటు జరిగినట్టు అంచనా. అంటే 400 నుండి 390 కోట్ల మధ్య. సుమారు 385 కోట్ల సంవత్సరాల సెడిమెంట్స్ (ఇనుప రాళ్లు), బసల్ట్స్ (ఘనీభవించిన లావా) దొరుకుతాయి, గ్రీన్లాండ్ లో. 403 కోట్ల సంవత్సరాల గ్రానైట్ రాయి కూడా (కెనడా లో). 350 కోట్ల సం. రాళ్ళలో మొదటి జీవం ఆనవాళ్లు దొరుకుతాయి స్ట్రోమటోలైట్స్ (ఆల్గాల్ మ్యాట్స్) రూపంలో. అక్కడి నుండి మొదలయిన జీవ చరిత్ర అనేక నాటకీయ మలుపులతో, ఉ. ఆక్సిజన్ పెరుగుదల సుమారు 250 కోట్ల సం., సంక్లిష్ట జీవాల ఆవిర్భావం 54 కోట్ల సం. క్రితం జరిగింది. అలాగే వాటి లుప్తమవ్వడాలు (ఎక్స్టింక్షన్) ఇలా. ఇదంతా ఇంకో పెద్ద చరిత్ర.


ఇప్పుడు ఇన్ని వేల కోట్ల నక్షత్రాలతో నిండి ఉన్న విశ్వం లో ఇలాంటి చరిత్రే ఉన్న ఇంకో గ్రహం ఇంకో నక్షత్ర మండలం లో ఉండే ఛాన్స్ ఉందా? ఉన్నా భూమి పడిన మధన పడుంటాయా, ఇంకా ఎక్కువ, తక్కువ కూడా పడుండచ్చా? ఒక వేళ వేరే గ్రహం పై జీవం ఉన్నా అది ఖచ్చితంగా మనలా ఉండే అవకాశం లేదు అని అనుకోవచ్చేమో. బహుశా ఈ విశ్వం లో మనం ఒంటరులమే (ఇంకో చోట జీవాన్ని కనిపెట్టే వరకు). మనతో (మనుషుల) పాటు ఉండేవి ఇక్కడి ఇతర అన్ని జీవజాలాలే. వీటి పట్ల అపార ప్రేమ, గౌరవాలతో ఉందాం. ఇవే మనకి తోడు...శ్రీనివాస్ బులుసు.

No comments:

Post a Comment