శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Friday 27 April 2012

ప్రకృతి సూత్రాలు:రెండవ సార్వత్రిక నియమం


మనం  చూస్తున్న నేటి విశ్వం మహా విస్పోటనం అనబడే ఒక సంఘటన లో ఏర్పడింది.అప్పట్నుంచి విశ్వం పలు మార్పులకు లోనయి నేతిస్తితిలో వుంది.మహా విస్పోతనానికి ముందు కూడా విశ్వం వుంది.మరో తెలీని రూపం లో వుంది.
(The universe as we see it today originated from bingbang and has been gradually evolving and expanding.The universe must have existed even before the event of bigbang in an untraceable form.)
      నేటి  విశ్వం 1500  కోట్ల సం:క్రితం మహా విస్పోటనం ద్వారా ఏర్పడింది.అప్పుడే కాలము,స్థలము ఏర్పడ్డాయి .Bigbang జరిగినట్లు 1920  లో అలెగ్జాందర్ ఫ్రెడ్ మాన్ ,అబ్బే జార్జి లేమాట్రి   తర్వాత  1940 లో జార్జి గేమొల్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్తలు ప్రవేశ పెట్టారు.  1965 లో పెంజియాస్ ,రాబర్ట్ విల్సన్ అనే ఇద్దరు ఖగోళ శాస్త్రజ్ఞులు Bigbang  కు సాక్ష్యాధారాలు చూపారు.
                  భావవాదుల నమ్మకం ప్రకారం భూమి కేంద్రంగా గ్రహాలూ తిరుగుతాయని పై పొరలో  నక్షత్రాలు వుంటాయి.వారు చెప్పే గ్రహాల్లో సుర్యచంద్రులిరువురు వుంటారు.నవగ్రహాలలో రాహువు,కేతువు వుంటారు.
        కాని Bigbang  సిద్ధాంతం ప్రాయోగిక రుజువులకు నిలబడింది .విశ్వం తో పాటే కాలం ఏర్పడింది కాబట్టి '' సెకండ్స్ కి ప్రస్తుత బౌతిక విశ్వం ఏర్పడింది ప్లాంక్ సమయ కాలం లో (10 to the power of _43) గురుత్వ ,విద్యుద యస్కాంత,బలమైన,బలహీన కేంద్రకబలాలు ఏర్పడ్డాయి.తరువాత హైడ్రోజెన్  వాయువు ఏర్పడింది.
       సూర్య కుటుంబం వయస్సు   500 కోట్ల సం:వుంటుంది.భూమి మీద జీవం పుట్టి సుమారు 400 కోట్ల సం:లు అయివుంటుంది.కొన్ని విశ్వాసాల ఆధారంగా భూమి వయస్సు 6 వేల సం:లే .కాని వాస్తవంగా మనిషి  20 లక్షల సం:నుంచే భూమి పై వున్నాడు.అరిస్టాటిల్ భూమి చుట్టూ గ్రహాలూ తిరుగుతున్నాయని చెప్పిన విషయము     సుమారు 2000 సం:పాటు కొనసాగింది.క్రీ.. 150 లో  టొలెమి కూడా భూ కేంద్రక సిద్ధాంతం గురించే చెప్పాడు.1473 లో కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతం ప్రవేశ పెట్టాడు. సిద్ధాంతం విశ్వాసాలకు వ్యతిరేకంగా వుందని ఆయనను అనేక వ్యధలకు గురిచేశారు. 1548 లో జన్మించిన బ్రునో కోపెర్నికాస్ ను సమర్థిస్తూ ఇలాంటి సౌరమండలాలు ఇంకా ఉండవచ్చునన్నాడు.అందుకు 1600 సం :లో అతనిని సజీవదహనం చేసారు.గెలీలియో గురుత్వ సిద్ధాంతాన్ని తెలియ జేశాడు.కెప్లర్ గ్రహగతుల గురించి చెప్పాడు.ఇలా విశ్వ ఆవిర్భావం గురించి బలమైన ఆధారాలున్న సిద్దాంతాలున్నాయి .సైన్సు ప్రకారం విశ్వం తనంతతానుగా ఎప్పుడూ వుంది.Bigbang  కు ముందు కూడా విశ్వం వుండే వుండాలి. వర్తమాన దూర  _కాల చట్రం లో వివరించలేము.విశ్వం పలు మార్పులకు లోనవుతుంది.
      విశ్వాన్ని ఎవరు సృష్టించలేదని అది ఒక పదార్థ స్వతసిద్ధఘటన   లో రూపొందిందని అప్పట్నుంచి మార్పులకు లోనవుతుందని  సూత్ర సారాంశం.

7 comments:

  1. >రహాల్లో సుర్యచంద్రులిరువురు వుంటారు.నవగ్రహాలలో రాహువు,కేతువు వుంటారు.

    మీరు విజ్ఞానశాస్త్రంగురించి వ్రాయండి. మధ్యలో జ్యోతిషం ప్రసక్తి యెందుకు?
    రాహుకేతువులు గణితబిందువులన్న విషయం భారతీయులకు పాశ్చాత్యులు ఎప్పకముందే తెలుసు. సూర్యచంద్ర్హులు గ్రహాలు కావనీ తెలుసు. జ్యోతిషంలో 'గ్రహ' నిర్వచనం వేరు. మీకు తెలియదనుకోను.

    > Bigbang కు ముందు కూడా విశ్వం వుండే వుండాలి.
    అవును. కాకపోతే దానిని గురించి ప్రస్తుత విశ్వపరిమణాల్లో ఊహించటం సాధ్యంకాదు. మీరీ ముక్క అనకపోతే ఆక్షేపించి ఉండేవాడిని. మీరు Bigbangకు హేతువు చెప్పవలసి ఉండేది కూడా.
    > విశ్వం ఒక పదార్థ స్వతసిద్ధఘటన ...
    పదార్థం అన్న భావన మనకు తెలిసిన పరిమాణాలతో ముడిపడి ఉండి. అతీతమైనవి కూడా ఉండవచ్చు. విశ్వాన్ని గురించి సంపూర్ణభావన అసాధ్యం.

    ReplyDelete
    Replies
    1. స్వాగతం శ్యామలీయం గారు !వాస్తవానికి ఇది నా రచన కాదు .ప్రపంచం లోని సైంటిస్ట్ లంతా కలిసి నిర్ణయించిన 18 సూత్రాలను వివరిస్తూ వ్రాసిన ప్రొఫెసర్ a.రామచంద్రయ్య గారి రచన .ఇక మీరు అడిగినదానికి వివరణ జ్యోతిష్య శాస్త్ర ప్రస్తావన ఇక్కడ లేదు.గ్రహాల గురించి జనం యొక్క నమ్మకాలు ప్రస్థావించారు రచయిత. రాహువు కేతువులు సూర్య,చంద్రులను మ్రింగితే సూర్య,చంద్ర గ్రహణాలు ఏర్పడుతాయని ఒక నమ్మకం.అసలు అవిలేవు అని ఆ విధం గా జరగదని సైన్సు నిరూపించింది.
      bigbang పెద్ద subject.దాని గురించి మరో వ్యాసం లో వివరిస్తాను.
      ప్రస్తుతమున్న పదార్థం గురించి అందిన అంచనాల ఆధారం గా ఈ భూమి పై 119 (కృత్రిమంగా తయారుచేసినవి కలుపుకొని )రకాల మూలకాలు వున్నాయి.ఇవన్నీ విశ్వం పుట్టుక చెందిన తర్వాత ఏర్పడ్డవే అని ప్రయోగాల పరంగా రుజువు చేసారు.
      మీరు అడగటం చాలా మంచిది.ఈ వివరణ ఇచ్చే అవకాశం నాకు కల్పించారు.మీకు ధన్యవాదాలు.

      Delete
  2. >>భావవాదుల నమ్మకం ప్రకారం భూమి కేంద్రంగా గ్రహాలూ తిరుగుతాయని ఆ పై పొరలో నక్షత్రాలు వుంటాయి.వారు చెప్పే గ్రహాల్లో సుర్యచంద్రులిరువురు వుంటారు.నవగ్రహాలలో రాహువు,కేతువు వుంటారు.>>
    @శ్యామలీయం garu,

    ఇది జ్యోతిష్యం కాదేమోనండీ, మరొక్కసారి పరిశీలించి చూడండి!

    ReplyDelete
    Replies
    1. మీకు స్వాగతం .మీ వివరణ సరైనదే!

      Delete
    2. snkr గారు! మీకు స్వాగతం.మీరు ఇంతకు ముందు పోస్ట్ లు కూడా చదవండి .సైంటిస్ట్ లు ప్రస్తావించిన అంశాలనే రచయిత ప్రస్తావించారు.
      అలాగే word verification గురించి గత సం:బ్లాగు ప్రారంబించినపుడు.అలా జరిగింది.సవరిస్తాను.
      మీకు ధన్యవాదాలు.

      Delete
  3. మీరు రాస్తుండండి. సందేహాలున్నపుడు తప్పకుండా అడుగుతాను.

    ReplyDelete
  4. ధన్యవాదాలండి.సృష్టి కి సంబంధించి అన్ని అంశాలు ప్రస్తావనకు వస్తాయి.గమనిస్తువుండండి.

    ReplyDelete