శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Wednesday, 25 December 2013

ఇంట్లో రోజుకొక యూనిట్ విద్యుత్ పొదుపు చేయటం ఎలా?


ఈ క్రింది నియమాలు పాటించటం ద్వారా రోజుకొక యూనిట్ విద్యుత్ ఆదా చెయ్యవచ్చు .
1) పగటి వేళ  దీపాలు వెలిగించ వద్దు.     
2) గదిని వదిలినా,ఇంటిని వదిలినా దీపాలు,పంఖాలు ఆర్పి వెళ్ళండి. 
3) t.v,కంప్యూటర్,microvave ,వి.సి ఆర్ ,d.v.d వంటి వాటిని main switch  వద్ద ఆపండి .
3) CFL బల్బులు వాడండి ఇవి తక్కువ వాటేజితో ఎక్కువ వెలుగు నిస్తాయి. 
4) FANS కి ELECTRONIC REGULATOR వాడండి . ఫ్రిజ్ లకు  సరిపోయే ధర్మోస్టాట్ అమర్చండి ఫ్రిజ్ ను తరచూ ఎక్కువ  సేపు తెరచి ఉంచవద్దు .
5) ఇంటిలో నీరు ఆదా చేయండి వాటిని మోటార్ ద్వారా పైకి తోడుతున్నామని గుర్తించండి .
      రోజుకు ఒక యూనిట్ అంటే నెలకు 30 యూనిట్స్ ఆదా చేస్తే  ఏడాదికి 1800 --2000 రూపాయలు విద్యుత్ బిల్లు తగ్గుతుంది .ఇలా చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే 30 లక్షల మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వినియోగ దారుల ద్వారా నెలకు 9 కోట్ల యూనిట్స్  విద్యుత్ ను అనగా రు 4.50 చొప్పున 40-50 కోట్ల రూపాయలు ఆదా చేయగలము.పవర్  హౌస్ వద్ద రు 1440 కోట్ల మూల ధనం ఖర్చు కాగల 240 మెగా వాట్స్ సామర్థ్యము తో సమానం.నెలకు లక్ష టన్నుల బొగ్గు అనగా ఏటా 12 లక్షల టన్నుల బొగ్గు వనరు ఆదా అన్నమాట.ఈ ఆదా పర్యావరణంలో 18 లక్షల టన్నుల co2 కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
   ఈ విషయాలు గ్రహించి పొదుపు సూత్రాలు పాటించి రోజుకో యూనిట్ ఆదా చేద్దాం .

Sunday, 1 December 2013

ఎక్కడిదీ జీవం ?

             ఈ సృష్టిలోనే ఒక క్రమాన్ని దర్శింపజేస్తూ మనల్ని ఈ విశ్వాసాల స్థాయి నుంచి ఒక క్రమబద్ద మైన శాస్త్రీయ దృక్పథం వైపు మరల్చిన మహనీయుడు చార్లెస్ డార్విన్. చుట్టూ కోటాను కోట్ల జీవరాసుల మధ్య .. మన ఈజీవం జీవితం ఎక్కడినుంచి వచ్చాయన్నది .. మనిషికి ఒక పట్టాన అంతుబట్టని నిగూఢమైన ప్రశ్న!తన ఊహకు కూడా అందని అమోఘమైన శక్తి ఈ సృష్టి యావత్తును ఒక్కసారిగా అద్భుతంగా సృష్టించి ఉంటుందని విశ్వసించాడు ఆది మానవుడు.అందుకే ప్రతి ప్రాచీన మతంలోను సృష్టి ప్రస్తావన కన్పిస్తుంది.కొన్ని వేల సంవత్సరాలపాటు సృష్టి దాని క్రమం విషయంలోమతం చెప్పిందే సమాధానం,మత గ్రంధం చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. ఈ దిశగా  శాస్త్రీయదృక్పథం ఊపిరిపోసుకోవటానికి కొన్ని శతాబ్దాలపాటు అదే పెద్ద ప్రతిబంధకంగా నిలిచింది .
                  17,18 శతాబ్దాలలో కోపెర్నికస్,గెలీలియో,న్యూటన్ వంటి ఉద్దండులు విశ్వ నిర్మాణం విషయంలో కొత్త సిద్ధాంతాలను ముందుకు తెచ్చి మత విశ్వాసాలకు బలమైన సవాలు విసిరారు.ఈ విశ్వాన్ని నడిపిస్తున్న సూత్రాలే మిటో .. లోతుగా పరికిస్తే మనకు ఈ విశ్వం లోనే కన్పిస్తాయని నిరూపించారు.దీంతో మతం చెప్పిందే  విశ్వసించట మా?లేక సైన్స్ మార్గాన్ని అనుసరించటమా? అన్నది ప్రజల్లో పెద్ద చర్చనీయాంశం అయింది.జీవపరిణామ సిద్ధాంతం ఊపిరి పోసుకోవటానికి ఇది ఎంతగానో దోహద పడింది .
              దాదాపు 1700 నుంచి శాస్త్రవేత్తలు భూమి పొరల్లో అక్కడక్కడ శిలాజాలను గుర్తిస్తూ వచ్చారు. క్రమేపీ శి లాజాలను చూస్తూ అది ఏ జంతువుకు చెందిందో గుర్తించే నైపుణ్యమూ పెరిగింది.అందులో కొన్ని రకాలు ప్రస్తుతం లేవని గుర్తించారు జార్జి కువిర్(1769-1832) అనే ఫ్రెంచ్ ప్రకృతి పరిశోధకుడు. గతం లోని కొన్ని జంతువులు అంత రించి  పోయాయాని ప్రతిపాదించటం మొదలుపెట్టారు. తర్వాత "అంతరించి పోవటం" అన్నది డార్విన్ సిద్దాంతానికి ముఖ్య భూమిక అయింది .
                  అప్పట్లో ప్రజలు దేవుడు చేసిన ఈ సృష్టిలో ఎలాంటి మార్పులకు తావు లేదని నమ్మేవాళ్ళు. యుగాం తంలో మాత్రమే సర్వం తుడిచిపెట్టుకుని పోయి మరల కొత్త జీవజాలం పుడుతుందని నమ్మేవాళ్ళు. అప్పట్లో ప్రయా ణ  సాధనాలు ఏవీ లేకపోవటం వల్ల తమ ప్రాంతం లోని జీవాన్ని చూస్తూ జీవంలో మార్పు ఉండదు అనుకునే వారు  పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రయాణాలు పెరగటంతో వేర్వేరు ప్రాంతాల్లోని జీవ వైవిధ్యాన్ని గమనించటం వల్ల కొత్త ఆలోచనలకు స్థానం ఏర్పడింది.
              మత గ్రంధాలు చెప్పినట్లుగా ఒక్క సారిగా మహా ప్రళయాలు రావటం లేదని అవి క్రమేపీ కొన్ని వందల వేల సంవత్సరాలపాటు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటున్నాయని బ్రిటిష్ భూభౌతిక శాస్త్ర వేత్త   చార్లెస్ లిల్ (1797-1875) సశాస్త్రీయంగా ప్రతిపాదించాడు. డార్విన్ తన పరిణామ సిద్దాంతానికి ఒక రూపు ఇవ్వటంలో ఇది ఎంతగానో ఉపకరించింది.
(ఇది ఈనాడు లో A .వెంకట ఆచార్య వ్రాసిన వ్యాసం. వారికి ధన్యవాదాలు )

Saturday, 16 November 2013

విదేశాల్లో భారత ఆణిముత్యాలు


1) క్వాంటం కంప్యూటింగ్:   ఉమేష్ వజిరాని దీనిపై పరిశోధనలు చేస్తున్నారు.క్వాంటం కంప్యూటర్లు సిలికాన్ చిప్ లతో కాకుండా హైడ్రోజెన్ అణువులతో పనిచేస్తాయి.

2) విశ్వం ఎలా పుట్టింది?:  శ్రీనివాస కులకర్ణి లాస్ ఏంజెల్స్  దగ్గరలోని kaaltech యూనివర్సిటీ లో ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్ర వేత్తగా పనిచేస్తున్నారు.విశ్వం పుట్టుక రహస్యాన్ని చేధించటానికి గామా కిరణాల గురించి పరిశోధనలు చేస్తున్నారు.

3)మూర్చ : Dr హితేన్ జవేరీ మూర్చను నియంత్రించటానికి pacemaker లాంటి సాధనాన్ని కనిపెట్టాలనే లక్ష్యం  తో పనిచేస్తున్నారు.
 
4) మనుషులకు జంతువులకు మధ్య తేడా!: ఈ తేడాను వివరించేందుకు తద్వారా మానవ పరిణామం లోని చిక్కుముడులు విడగొట్టెందుకు కాలిపోర్నియా యూనివర్సిటీ కి చెందినా అజిత్ వర్కీ  ప్రయత్నిస్తున్నారు. ఇందుకై ఆయన తనపైనే ప్రయోగం చేసుకున్నారు.ఈ అధ్యయనానికి గ్లైకో బయాలజీ అనిపేరు పెట్టారు .

5) అతి సూక్ష్మ మైన జెట్ ఇంజెన్స్ ద్వారా ఎలెక్ట్రానిక్  పరికరాలకు విద్యుత్ ను అందించే టెక్నాలజీ ని అమిత్ మెహ్రా రూపొందిస్తున్నారు. ఇది ఇంధనం లోని రసాయన శక్తిని విద్యుత్ గా మారుస్తుంది.

6) మందుల అభివృద్ధిలో పేరు పొందిన ఖోస్లా ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో celiac sprue  అనే ఆటో ఇమ్యూన్ జబ్బుపై పరిశోధనలు  పెట్టారు .

7) శరీరం లోకి చిన్న చిన్న క్యాప్సుల్స్ నిర్దేశించిన  మందులు వదిలేసే అంశం పై పరిశోధిస్తున్నారు,మల్లాప్రగ్గడ  సూర్య .ఈమెను  100 మంది అత్యుత్తమ ఆవిష్కర్తల్లో ఒకరిగా MIT ప్రస్తుతించింది. మధుమేహ రోగులకు ఇంజెక్షన్ల బాధ  తప్పించేందుకు బోస్టన్ యూనివర్సిటీలో biomedical ఇంజినీరింగ్ లో  ప్రొఫెసర్ గా ఉన్న తేజాల్ దేశాయ్ ప్రయత్నిస్తున్నారు.

8)Activematerials పై  ప్రొఫెసర్ కౌశిక్ భట్టాచార్య పరిశోధనలు ప్రపంచ ప్రఖ్యాతి నార్జించి పెట్టాయి లోహాలలో ఉన్న PATERN ను మార్చి మనకు నచ్చిన లోహాలను డిజైన్ చేసుకోగలమా? అని కాలిఫోర్నియా institute లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కౌశిక్ పరిశోధనలు ఫలిస్తే నానో టెక్నాలజీ రంగమే కొత్త మలుపు తిరుగుతుంది .

9) మెదడు ఏ విధంగా అభివృద్ది చెందుతుంది ?దీనిని ప్రభావితం చేసే అంశాలేమిటి? MIT లో బ్రెయిన్ and కాగ్నిటివ్ డిపార్టుమెంటుకు హెడ్ గా  పనిచేస్తున్న మృగాంక సుర్ చేసిన పరిశోధనలు కొత్త ఊపు నిచ్చాయి.

10) రోటో  వైరస్ చాలా ప్రమాదకరమైనది.ఈ విషయం పై టెక్సాస్ మెడికల్ సెంటర్ లో B.V.V  ప్రసాద్ పరిశొధిస్తున్నారు. 
  వీరందరి పరిశోధనలు ఫలించి నోబెల్ బహుమతులు పొందాలని ఆశిద్దాం .
(ఈ సమాచారం ఈనాడు పేపర్ నుండి సేకరించినది వారికి ధన్యవాదాలు )  

Friday, 8 November 2013

నోబెల్ హుమతి పొందిన భారతీయులు

 1) రబీంద్రనాధ్  టాగూర్(1913,సాహిత్యం) :గీతాంజలి అనే కావ్యానికి ఆయనకు ఈ బహుమతి వచ్చింది. ఈ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఈయనే !
2) సి.వి. రామన్ (1930,భౌతిక శాస్త్రం ); కాంతిని ప్రసరింపజేసి పదార్థాల ధర్మాలను గ్రహించ వచ్చని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించారు.సైన్స్ రంగంలోనోబెల్ సాధించిన శ్వేతజాతీయేతరుడు ఈయనే !
3):హరగోబింద్  ఖోరానా (1968,వైద్య రంగం): జన్యువుల్లో జీవ సంకేతాలు ఏ క్రమంలో ఉంటాయో విశ్లేషించినందుకు ఈయన ఈ బహుమతి పొందారు. 
4)మదర్ థెరెసా(1979,శాంతి):పేదలకు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించినందుకు శాంతి పురస్కారం అందుకున్నారు.
5)సుబ్రమనియం చంద్రశేఖర్(1983,భౌతిక శాస్త్రం ):ఈయన సి.వి రామన్ సోదరుని కుమారుడు.ఈయన ఖగోళ భౌతి క శాస్త్రంలో చంద్రశేఖర్ లిమిట్ పేరుతో ఓ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు.నక్షత్రాల పుట్టుక,పరిణామాల పై ఇది వివరి స్తుంది.నాసా ఈయన పేరుతో ( చంద్ర ఎక్స్ రే) ఒక అబ్జర్వేటరీ ని ప్రయోగించింది.
6) అమర్త్యసేన్(1998,అర్థ శాస్త్రం): ఆర్ధిక సంస్కరణలకు ముందు జనసంక్షేమాలయిన విద్య,వైద్యం,ఆహార లభ్యత వంటివి సంస్కరించి నప్పుడే నిజమైన ఆర్ధిక పురోభివృద్ది సాధ్యమని ప్రభుత్వాలు,ఐక్యరాజ్య సమితి గుర్తించేలా చేయ్యటం వలన ఈ బహుమతి సాదించారు.
7)వెంకటరామన్ రామకృష్ణన్ (2009,రసాయన శాస్త్రం ): రైబోజోం  జీవానికి,శారీరక గమనానికి కణ స్థాయిలో అత్యంత కీలక మైన సంకేతం.దీని గుట్టుమట్లు విప్పినందుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు .
8) వి.యెస్ నైపాల్ :(సాహిత్య్హం 2001) ఈయన భారతీయ సంతతి వారు.
9)ఆర్.కె పచౌరీ :నోబెల్ శాంతి బహుమతి అల్గోరెతో కలిసి పంచుకున్నారు.

Saturday, 26 October 2013

కొత్త ఆలోచనలను ఆహ్వానించడమే శాస్త్రీయ దృక్పథం ...... N.Vital c.v.c మాజీ chairman

శాస్త్రీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మానవ పరిస్థితులను,సమాజానికి మతానికీ  మధ్య  ఉన్న  సంబంధాల  గురించి  తెలుసుకోవాల్సి  ఉంటుంది.science రుజువులను కోరుతుంది.ప్రతిదాన్ని తార్కికంగా విశ్లేషిం చేందుకు ప్రయత్నిస్తుంది.అన్నిటిని  ఇతర జీవులతో వేరు చేసేవి 3 అంశాలు 1) నేర్చుకోగల సామర్ద్యం 2),విశ్లేషించ గలగడం 3)కొత్త అంశాలను కనుగొనగలగడం.చింపాంజీ మెదడు రెండు మూడేళ్ళలో ఎదిగితే మానవ మెదడు ఎది గేందుకు పదేళ్ళు పడుతుంది.బహుశా ఇందు వల్లనే మానవుడికి  ఇంత సమర్ధత  అబ్బిందేమో ? మతానికి సైన్సు కు ఉన్నసంబంధం యుగాలనాటిది.గెలీలియో ఆవిష్కరణను అప్పటి మత పెద్దలు ఎలా వ్యతిరేకించింది మనకు తెలిసిందే.అయితే  గతిశీల సైన్సు ఎప్పుడు మారుతూనే ఉంటుంది.
  .
        

Thursday, 24 October 2013

సైన్స్ లో శాశ్వత సత్యమంటూ లేదు ....రాజా రామన్న, సైంటిస్ట్

ఎన్నో సందేహాలు
ఎన్నో సంతాపాలు
జీవితంపు  చిక్కుముడులు
విడవెంతగ  సడలించిన ...
           ***
ఈ సృష్టికి ఏమర్థం  
మానవుని గమ్యమేది?
ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా లేనట్టా

మెదడదన్నది మనకున్నది
అది సరిగా పనిచేస్తే
విశ్వ రహః పేటికా వి
పాటన  జరగక తప్పదు ...
                                     --శ్రీ శ్రీ
                                                  సైన్స్ లో  శాశ్వత సత్యమంటూ లేదు
                                                                    .........రాజా రామన్న సైంటిస్ట్ , మాజీ రక్షణ శాఖా మంత్రి
             సైన్స్ అన్నది ఎప్పుడు మారుతూనే  ఉంటుంది. ప్రతి యుగం లోను ఈ మార్పు మనకు ప్రస్పుటంగా కన్పిస్తుంది. శాశ్వత సత్యం అన్న భావనకు ఇక్కడ స్థానం లేదు.నా దృష్టిలో కొత్త ఆలోచనలను స్వీకరించే మనస్తత్వమే శాస్త్రీయ దృక్పథం . అయితే  మన దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం ఉందా?అన్న ప్రశ్న వేసుకుంటే సంతృప్తికరమైన సమాధానం దొరకదు.ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి విద్యా వ్యవస్థ కొనసాగుతూ  ఉండటం  విద్యార్థులు అంశాలను అర్థం చేసు కోకుండా వాటిని బట్టీ పట్టడం దీనికి కారణాలు శాస్త్ర రంగంలో అభివృద్ది అన్నది ఎవరికీ ఉపయోగపడుతోందన్న విషయాన్ని ఎప్పుడూ గమనించాలి. 

Tuesday, 22 October 2013

కొందరు మహనీయుల శాస్త్రీయ దృక్పథం

         .శాస్త్రీయ దృక్పధానికి పునాదులు వేసిన కొందరు మహనీయుల సాధన ,అనుభవాలు,ఆలోచనలు

ఐజాక్ న్యూటన్(1642-1727)
            ప్రపంచానికి నేనెట్లా కనిపిస్తానో తెలియదు కానీ నా మటుకు నేను సత్యం అనే సాగరం ముందు ఆడుకుంటూ ,ఏ గుండ్రటి గులకరాయినో ,అంద మైన గవ్వనొ  ఏరుకునే బాలునిగానే భావిస్తాను.

సి.వి రామన్ (1888-1970):
      నుదిటి  నుంచి  స్వేదం చిందకుండా చేసే పనికి విలువ లేదు.భారతీయ  మేధ  ఏ ఒక్కరికి తీసి పోదు. కానీ మనకు ధైర్యం పాలు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తానన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించడం ,విజయాభిలాషను పెంపొందించుకోవడం".    

రవీంద్రనాథ్ టాగూర్(1861-1941):
  ఈ అనంత విశ్వం తన రహస్యాలను తనలోనే ఇముడ్చు కోవాలని  ప్రయత్నిస్తుంటుంది కాని మానవుడు సామాన్యుడు కాదు. విశ్వం విసిరిన  సవాళ్ళను స్వీకరించి సృష్టి రహస్యాలను బహిర్గత పరిచి ,విశ్వం పై విజయం సాధించాడు .ఈ ప్రస్తానం లో  అనంత దూరాలను తనకు  దగ్గరగా  తెచ్చుకున్నాడు .కనరాని   శక్తులను వీక్షించాడు. వివరించలేని  ప్రక్రియల విశ్లేషణకు ఒక భాషను ఏర్పరుచుకున్నాడు .ఈ  సంకల్పం నెరవేరడానికి కావలిసిన అభిలాష భూమిపై కొందరికే ఉంటుంది .

జవహర్ లాల్ నెహ్రు(1889-1964):
               సుదీర్ఘ మైన చరిత్రలో మానవ జీవితం పై సైన్స్ చూపినంత ప్రభావాన్ని మరేదీ చూపలేదని నా నమ్మకం . సైన్స్ మనలను అనూహ్య మైన తీరాలకు తీసుకుని వెళ్ళింది .క్షీణ   దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థను సమృద్ధి దిశగా రూపాంతరం చెం దిం చగల  సామర్థ్యం సైన్స్లు కు ఉన్న సంగతి అందరికీ తెలి సిందే ఇన్నాల్లూ తత్వ శాస్త్ర పరిధిలోని విషయాలు సైన్స్ పరిధి లోకి వచ్చాయి.స్థల కాలాల (space-time) భావన క్వాంటం సిద్ధాంతం భౌతిక ప్రపంచ అవగాహనలో మార్పు తెచ్చాయి.శాస్త్ర  అవగాహనతో మానవుడు తననూ  ప్రకృతినీ వేర్వేరుగా భావించడం లేదు.  మానవుని  తుది గమ్యం ప్రకృతిలోని శక్తులతో ముడి వడి ఉంది.

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (1879-1955):
సత్యాన్వేషణలో సైన్స్ ఇంకా బాల్య దశలోనే ఉంది ..కాని ఇంత వరకు సైన్స్ ద్వారా మనకు లభించిన విజ్ఞానం ఎంతో విలువైనది.

Saturday, 12 October 2013

దైవ కణం(హిగ్స్ బోసాన్) ప్రతిపాదనకు ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్


            2013 సంవత్సరానికి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్  దైవ కణం గురించి ప్రతిపాదించిన పీటర్  హిగ్స్,ఇంగ్లర్ట్ లకు లభించింది.1964 లో వీరితోపాటు robert brout కూడా ఉన్నారు తరువాత  పీటర్ర్ హిగ్స్ విశేష పరిశోధన చేసారు వీరితొ  పాటు కార్ల్ హెగెన్,గెరాల్డ్, టామ్ కిబ్ల్ కూడా దీని ఉనికిని ప్రతిపాదించారు.
             కానీ గమనించాల్సిన ముఖ్య విషయమమేమంటే మన దేశానికి చెందినా సత్యేంద్రనాథ్ బోస్ ఈ కణం ఉనికిని 1926  ప్రాంతంలోనే ప్రతిపాదించారు.ఈయన పేరుతోనే దీనికి బోసాన్ అనిపేరు వచ్చింది.
          ఈ కణం నుండే సృష్టిలోని గ్రహాలూ,నక్షత్రాల వరకు సమస్త పదార్దానికి ద్రవ్యరాశి చేకూరుతుంది.
 స్విట్జర్లాండ్ లోని సెర్న్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు ఈ కణం ఉనికి నిజమని నిరూపించారు.

Sunday, 14 July 2013

"కాలం కథ"(A Brief History Of Time) ----Stephen Hawking


                స్టీఫెన్ హాకింగ్ రచించిన ఎ  బ్రీఫ్ హిస్టరీ అఫ్ టైం అనే పుస్తకాన్ని "కాలం కథ" పేరుతో   ఎ.గాంధీ గారు తెలుగులోకి అనువదించారు.చాలా కాలం నుండి ఈ పుస్తకాన్ని చదవాలని అనుకుంటూ అలా గడిచి పోయింది పీకాక్ క్లాసిక్స్ వారి ప్రయత్నం వలన ఈ అనువాదం  సాధ్యమయింది.తెలుగు లో సైన్స్ పై ప్రామాణిక పుస్తకాల లోపాన్ని ఇది తీర్చింది.సైన్స్ అభిమానులు చదవతగ్గ పుస్తకం.
       ఇందులో 1)మనకు తెలిసిన విశ్వం,2)స్థల కాలాలు,3)విస్తరిస్తున్న విశ్వం 4)అనిశ్సితా సూత్రం ,5)ప్రాథమిక కణాలు 6)ప్రకృతి శక్తులు ,7)కాల బిలాలు,8)కాల బిలాలు కారు నలుపేమీ కాదు,9)విశ్వం పుట్టుక దాని భవితవ్యం10) కాల బాణం 11)భౌతిక శాస్త్ర ఏకీకరణ వంటి విభాగాల్లో విశ్వం గురించి వివరించారు. చివరలో ఇచ్చిన పదజాలం చాలా ఉపయుక్తంగా ఉంది.science teachers,lecturers,స్టూడెంట్స్  తప్పక  చదవతగ్గ  పుస్తకం.

Thursday, 23 May 2013

పండంటి పుడమికి 12 సూత్రాలు



         వాతావరణ మార్పులను నిరోధించడానికి ఎవరైనా అనుసరించ గలిగే 12 తేలిక పాటి మార్గాలివి 
1) వెలుగులు విరజిమ్మే  సాధారణ బల్బుల స్థానంలో ఫ్లోరోసెంట్ బల్బులను (CFL) బల్బులను వాడండి.ఇవి నాలుగు రెట్ల తక్కువ విద్యుత్నుఖర్చు చేయడంతో పాటు ఎనిమిది రెట్ల ఎక్కువ కాలం పనిచేస్తాయి.

2) విద్యుత్ పొదుపు ఉపకరణాల వాడకం వలన సాధారణంగా అదే పనికి వినియోగమయ్యే విద్యుత్ కంటే 10 రెట్లు తక్కువగా ఖర్చవుతుంది.

3) సాధారణ కంప్యూటర్ కంటే లాప్టాప్ LAPTAP వలన  5 రెట్ల తక్కువ విద్యుత్ వినియోగ మవుతుంది.లేదా LCD మానిటర్ తీసుకోండి.

4)  CAR,BIKE కు కు ప్రత్యామ్నాయంగా నడక, సన్నిహితులు ,పరిచయ స్తులతో కలిసి వాహనాన్ని పంచుకోవడం,ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగిం చుకోవటం వంటివి చేయాలి.కారుకు బదులుగా పై వాటిని ఉపయోగించడం ద్వారా ప్రతి 5 కిలోమీటర్ల ప్రయాణానికి 1.5 కిలోల CO2  విడుదలను నిరో ధించవచ్చు.

5) మీ వాహనం టైర్స్ సక్రమ స్థితిలో ఉండేలా చూసుకోవడం ద్వారా ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

6)నీటిని వృధా చేయొద్దు.చిన్న అవసరాలకు తప్పకుండా మగ్గు,స్నానానికి షవర్,స్నానపు తొట్టెలకు  బదులు బకెట్ వినియోగించండి.మీ ప్రాంతంలో వాన నీటి సంరక్షణ విధానాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి.

7) దుకాణాల్లో కొనుగోలుకు వెళ్ళేటప్పుడు గుడ్డ సంచీని తీసుకెల్లండి.ప్లాస్టిక్ కవర్లతో ప్యాక్ చేసిన ఉత్పత్తులను వీలయినంత వరకు కొనకండి.

8)  మీ A.C ధర్మోస్తాట్ ను రెండు డిగ్రీల సెంటి గ్రేడ్ పెంచండి.ఈ చిన్నఏర్పా టు వలన  ఏడాదికి 900 కిలోల CO2 ను నిరోధించవచ్చు.

9) విద్యుత్తు పొదుపు చేయటానికి సౌర శక్తిని వినియోగి చుకోవచ్చు.   గ్రామంలోనివసించే వారయితే పేడను ఉపయోగించి biogas ను పొందవచ్చు.

10)  ఒక మొక్కను నాటితే అది జీవిత కాలంలో టన్ను  co2 ను పీల్చు కుంటుంది.

11) మీరు ఉపయోగించని సమయంలో T.V ,STERIO ,COMPUTER FAN,LIGHTS వంటి  వాటిని  ఆపేసి  ఉంచితే  ఏటా  కొన్నివేల కిలోల CO2 విడుదలను  నిరోధించవచ్చు 

12) కాగితం,డబ్బాలు వంటి మళ్ళీ ఉత్పత్తికి వీలుగా ఉండే (recycle) పునర్వినియోగ  ఉత్పత్తుల వలన పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు.
(ఈ సమాచారం ఈనాడు పేపర్ వారి నుండి సేకరించింది .వారికి ధన్యవాదాలు. )