శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Monday, 28 May 2012

ప్రకృతి సూత్రాలు :13 వ సార్వత్రిక నియమం



                    పరమాణువులు ఎలక్ట్రాన్ల  చలనాలతోనే సంధానించుకొని ఉంటాయి.
                          (Atoms are Bound Together by Electronic Interactions)
      రెండు కాగితాల్ని అంటించినపుడు వాడినటువంటి బంక సంధానకర్త గా వ్యవహరిస్తుంది.ఇటుకలు కలిసివుండా లంటే సిమెంట్ సంధానకర్తగా వాడాలి.అలాగే పదార్థాలన్నీ పరమాణు సముదాయాలని తెలుసుకున్నాము బంధాలను ఏర్పర్చేది పరమాణువులలో ఉండే  ఎలక్ట్రాన్లే . ఎలక్ట్రాన్లు అనే గొలుసు చేత బంధించ బడ్డ రెండు పరమాణువుల మధ్య ఉన్న బంధాన్ని రసాయనిక బంధం(chemical bond) అంటారు.దయ్యాలు,భూతాలు,ఆత్మలు ఏ పదార్థాలతో తయార య్యాయో,ఆ పదార్థాలలోని పరమాణువులు ఎక్కడనుంచి వచ్చాయో నిరూపణలు లేవు.జీవ కణంలో జరిగే చర్యలన్నీ రసాయనిక బంధాలను తెంచడం,కొత్త బంధాలను ఏర్పర్చడమే.రసాయనిక చర్యల్లో జరిగేది ఇదే !
         

Saturday, 26 May 2012

ప్రకృతి సూత్రాలు: 12 వ సార్వత్రిక నియమం.


పదార్థాలలో పరమాణువులు సంధానించుకున్న  పద్ధతిని బట్టి ఆయా పదార్థాలు తమ ధర్మాలను ప్రదర్శిస్తాయి.
    (Properties of the Materials are Due to the Atomic Arrangement in Them.)
పరమాణువుల నిర్మాణాన్ని బట్టి పదార్థాల ధర్మాలు ఉంటాయి.నీరు H2O అనే రూపం లో 3పరమాణువులు కలిసి ఉన్న అణువులమయం .CO2 కూడా 3 పరమాణువులు కలిసివున్నదే. కాని CO2 అణువు సరళ రేఖా కృతిలో ఉంటుంది.కనుక అది మామూలు ఉష్ణోగ్రత దగ్గర వాయు స్థితిలో ఉంటుంది.కానీ నీటి అణువు సరళ రేఖాకృతిలో కాకుండా కోణీయంగా వంగి ఉంటుంది.అందువలన నీరు ద్రవరూపంలో ఉండగలుగుతుంది.జీవ రహస్యమంతా నీటి అణువు వంకర లోనే దాగుంది.
        C2H6O పరమాణువుల అమరికనుబట్టి ఇది రెండు వేర్వేరు పదార్థాలను ఏర్పరచగలదు.1)H3C-O-CH3 ఇది ఈథర్ 2)CH3-CH2-O-H ఇదిఇథైల్ ఆల్కహాల్ .గ్లూకోజు ,ఫ్రక్టోజ్ లు రెండింటిలోను C6H12O6 అనే సంఖ్య లోనే అణువు లున్నాయి అయినా అమరిక వేరు వేరు.
       

Friday, 18 May 2012

ప్రకృతి సూత్రాలు : 11 వ సార్వత్రిక నియమం



                                     పదార్థాలన్నీ పరమాణు నిర్మితాలు.
                                      (Matter is Made Up of Atoms)
  మన చుట్టూ ఎన్నో రకాల పదార్థాలు ,వస్తువులు ఉన్నాయి.లోహాలు,కొన్ని వాయువులు,కొన్ని ద్రవాలు తప్ప చాలా వరకు మనకు తారస పడేవి సంయోగ పదార్థాలు.  మనకు కనిపించే భౌతిక జగత్తులో కేవలం  100 లోపే మూలకా లున్నాయి .110 వ మూలకాన్ని కూడా మనుషులు కనుగొన్నారు.అయినా కేవలం 92 మూలకాలే  మనకు స్పష్టం గా తెలిసిన పదార్థాల్లో ఉంటాయి.
        మూలకాలు రకరకాల పద్ధతుల్లో,పరిమాణాల్లో కలిస్తే సంయోగ పదార్థాలు ఏర్పడ   తాయి.మూలకాలన్నింటిలో ఒకే తరహా పరమాణువులుంటాయి. సంయోగ పదార్థాలలో వేర్వేరు మూలకాలుంటాయి.   కాబట్టి వేర్వేరు తరహా పర మాణువులుంటాయి. ఉదా:నత్రజని లో దాని పరమాణువులే వుంటాయి.అలాగే బంగారు, వెండి,రాగి వంటి వాటిల్లో వాటి పరమాణువులే వుంటాయి.కనుక ఇవన్నీ మూలకాలు.కాని నీరు సంయోగ పదార్థము దీనిలో రెండు  హైడ్రోజన్ పరమాణువులు,ఒక ఆక్సిజన్ పరమాణువు వుంటాయి.పరమాణువుల మొత్తం ద్రవ్యరాశే పదార్థపు ద్రవ్యరాశి.    

Thursday, 17 May 2012

ప్రకృతి సూత్రాలు :10 వ సార్వత్రిక నియమం


శక్తి రూపాలన్నీ ఉష్ణరూపంలోకి మారుతున్నాయి.
(Energy Tends to Reform into Heat)
విశ్వంలో మనచుట్టూ రకరకాలయిన శక్తి రూపాలున్నాయి.కాంతి శక్తి,గురుత్వ శక్తి ఇలా .ప్రతి చోటా ప్రతిక్షణం మార్పు లు జరుగుతున్నాయి.ఈ సంఘటనలలో శక్తి మార్పిడులు కూడా జరుగుతున్నాయి.కాలక్రమేనా శక్తి రూపాలన్నీ ఉష్ణ రూపం లోకి మారడానికి ఎక్కువ సంభావ్యతను ప్రదర్సిస్తాయి.ఉష్ణ మంటే పదార్థాలలోని అణువుల లేదా పరమాణు  వుల లేదా ఇతర కణ  సంబంధిత ప్రకంపనలే.అంటే చలనాన్ని ఎక్కువ చేసే మరో శక్తి రూపం లోకి మిగిలిన శక్తి రూపా లు మారుతున్నట్టు. నీటిలో ఉప్పు తనంత తాను కరిగిపోవడం ,టపాసులు ప్రేలడం,బెజ్జం వేస్తె బెలూన్ పగలడం,బిగ్ బాంగ్ ,అత్తరు వాసన గది అంతా విస్తరించడం,ప్రిజ్,కూలర్స్ ,ప్రతిజీవి ఏదో ఒకరోజు  మరణించడం ఇవన్నీ ఈ నియమా నుసారమే జరుగుతున్నాయి.
      బాగా ఉపయోగ పడే రూపాల్లోంచి శక్తి తక్కువగా ఉపయోగపడే రూపం లోకి చేరుకుంటుంది.(Energy flows from more useful form into less useful form) చలికాలంలో 15 డిగ్రీల  దగ్గరున్న చన్నీల్లను 45  డిగ్రీల  వరకు  వేడిచేసి వా డుతున్నామనుకుందాము.ఇలా 50 లీటర్ల నీటిని వేడిచేయడానికి సుమారు 15 లక్షల కేలరీల విద్యుచ్చక్తి అవసరం. మరి 45 డిగ్రీ ల నుండి 15 డిగ్రీల  వరకు చల్లబర్చాలంటే అందులోంచి 15 లక్షల కేలరీ ల ఉష్ణ శక్తిని తీసేసి దాన్ని విద్యు చ్చక్తిగా మార్చాలని ప్రయత్నిం చామనుకుందాము.ఎంత గొప్ప పరికరాన్ని వాడినా 15 లక్షల కేలరీల విద్యుచ్చ క్తిని రాబట్టలేము.అంటే నీటిని 15 డిగ్రీ దగ్గరకు అంతే శక్తిని లాగి తీసు కెల్లలేము.వేడి చేయటం కన్నా చల్లబరచడం కష్టం.

Wednesday, 16 May 2012

ప్రకృతి సూత్రాలు: 9 వ సార్వత్రిక నియమం


              అన్ని సంఘటనలలోను ద్రవ్య-శక్తి నిత్యత్వమే!.పదార్థం -శక్తి రూపాల్లో మారవచ్చునే గానీ పదార్ధం-శక్తి పరిమాణం సంఘటనకు ముందు సంఘటన తర్వాత ఒకే విధంగా వుంటాయి.సంఘటనలలో పదార్ధం -శక్తిని నూతనం గా సృష్టించలేము.నాశనం చేయలేము.
(Matter-Energy are Conserved During Any Process.Energy and Matter May change Their forms but the Net Quantity of Matter-Energy is fixed During all Processes..Matter-Energy can Neither be Created Nor Destroyed During Processes.)
         ఈ విశ్వం లో ఉన్న మొత్తం పదార్థం,మొత్తం శక్తిని కలగలిపి ద్రవ్య-శక్తి లేదా పదార్ధం -శక్తి అంటారు.శక్తి కూడా ఓ రకమైన పదార్థ రూపమే.శక్తికి ద్రవ్యానికి మధ్య  E=mc2(c squred). అనే అనుసంధానం ఉంది.విశ్వం లో ఉన్న కనిపిం చని,కనిపించే ద్రవ్యశక్తి మొత్తం 1500 కోట్ల సంవత్సరాల క్రితం ,నేడు ,రేపు స్థిరంగా ఉంటుంది.ఉదా:విత్తనం మొక్క గా మారిన సంఘటన ,ఇనుము త్రుప్పు పట్టు సంఘటన .ఈ రెండు సంఘటనల్లో ద్రవ్య-శక్తి నిత్యత్వ సూత్రం వర్తిస్తుంది.
                సంఘటనకు ముందున్న ద్రవ్య-శక్తి=సంఘటన తరువాత ద్రవ్య-శక్తి
శక్తి నుంచి పదార్థాన్ని ,పదార్థాలనుంచి శక్తిని సృష్టించగలం.ద్రవ్య-శక్తి నిత్యత్వసూత్రానికి  విరుద్ధంగా ఇంతవరకు మానవ చరిత్రలో ఏ సంఘటనా జరిగిన దాఖలాలు లేవు.గాలి లోంచి వస్తువులు సృష్టించడం ,టెలిపతి ,భూతవైద్యం బాణామతి,యోజనం,దయ్యాలు,పునర్జన్మ,ఆత్మ అనే భావనలు పై నియమం ప్రకారం రుజువు చేయలేరు . 

Sunday, 13 May 2012

ప్రకృతి సూత్రాలు: 8 వ సార్వత్రిక నియమం

భౌతిక రాశులన్నీ గులకలుగా(క్వాంటాలు)గా ఉంటాయి.ఏ భౌతిక రాశిని అవిచ్చిన్నంగా సూక్ష్మీకరించలేము.
(All  Physical Entites are Quantised;NoPhysical Quantity can be Infinitismally Continuous).
     బియ్యం గింజలుగా,లేదా నూకలుగా ఉంటాయి.అవన్నీ విడివిడిగా గులకలు గానే ఉంటాయి.ప్రపంచ జనాభా నిర్దిష్ట సంఖ్యారూపంలో ఉంటుంది. మన దగ్గర నగదు పూర్ణ సంఖ్యలో ఉంటుంది.భిన్నాల రూపం లో ఉండదు.
        భౌతికరాశులయిన శక్తి,ద్రవ్యరాశి ఇలాంటివన్నీ కూడా శకలాలు గానే ఉంటాయి.నీరు నీటి అణువుల సముదా యమే కదా!అలాగే ఎంత మూలకాన్ని తీసుకున్నా అది ఆ మూలకపు పరమాణువుల పూర్ణ సం ఖ్య లోనే వుంటుంది      ప్రదేశం(space)),శక్తి(energy),ద్రవ్యవేగం(momentum),కోణీయ ద్రవ్యవేగం(angular momentum) అయస్కాంత బలం (magnetic force), తదితర  పలు రాశులు కూడా ఎక్కడో  చోట కనిష్ట  స్థాయిలో ఉంటాయి .
      అయితే ఇలా భౌతిక రాశుల క్వాంటీకరణం చెందిన సంగతి  స్థూల పదార్థాలలో(macroscopic bodies) కని   పించదు .నేడు క్వాంటం సిద్ధాంతంతో అన్ని చర్యలను వివరించగలుగుతున్నారు.ఏదయినా ఒక కణం లేదా వస్తువు ఫలాని పరిమాణం లోనే ఓ భౌతిక రాశి విలువను ప్రదర్శిస్తుంది. కానీ ఎంత కావాలంటే అంత పరిమాణం లో ఉండటానికి వీల్లేదనే సిద్ధాంతాన్ని క్వాంటం సిద్ధాంతం అంటారు.

Friday, 11 May 2012

ప్రకృతి సూత్రాలు: 7 వ సార్వత్రిక నియమము.



    ఒకే సూత్రాల  సమూహం తో చలనాలన్నింటినీ వివరించగలం
(One Set of Laws Explain All Motions)
           విశ్వంలో అన్నిచోట్లా  చలనాలు ఉన్నట్లు తెలుసుకున్నాము .అణువు ,పరమాణువు గ్రహాలూ,నక్షత్రాలు,గెలా క్సిలు,నెబ్యూలాలు ఇలా దేనిలోనైనా జరిగే చలనాలను వివరించటానికి ఒకే విధమైన సూత్రాలు సరిపోతాయి.
           నిశ్చలం గా వున్న వస్తువును కదిలించేందుకు ఆ వస్తువు ఏ పరిమాణం లో వున్నా ఎంతో కొంత బలమవ సరమే!వస్తువుల కదలికలు,చలనాలలో ద్రవ్యవేగం(dynamics) శక్తి ,ద్రవ్యరాశి .కోణీయ  ద్రవ్యవేగం ,ఇలాంటి  రాసులెన్నోఇమిడి ఉన్నాయి .అవి  నిత్యత్వమై వున్నాయి(conserved)
         ప్రతి మనిషి వయసుతో పాటు ముసలితనంతో చనిపోవటం ఖాయం.పరమాణువు లో తిరిగే ఎలెక్ట్రాన్   అబికేంద్ర బలం ,సూర్యుని చుట్టూ తిరిగే భూమికి ,గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరిగే నక్షత్రాలకు మధ్య అపకేంద్ర బలానికి కూడా ఒకే సూత్రం వర్తిస్తుంది. భూమి పై  కొంత ఎత్తు నుండి  నుండి  వేరు ,వేరు  ద్రవ్యరాసులు    కల  వస్తువులను ఒకేసారి వదిలితే అవి ఒకే సారి నేలను తాకుతాయి.నేలను తాకేతప్పుడు అన్నింటికీ ఒకే వేగం వుంటుంది.కాబట్టి ఒకే విధమైన సూత్రాల తోనే  అన్ని చలనాలను వివరించగలం.

Friday, 4 May 2012

ప్రకృతి సూత్రాలు: 6 వ సార్వత్రిక నియమం

             కేంద్రక శక్తే  అన్ని రకాల శక్తులకు మూలం. కేంద్రక శక్తి పదార్థ వినిమయం తో విడుదల అవుతుంది.పదార్థ రూపాంతరమే శక్తి .
(Nuclear energy is the Source of other Forms of  Energy.Nuclear Energy Comes from the Annihilation of Matter.Energy is an Alternative Form of Matter)
            మనం ఇంట్లో వాడే విద్యుచ్చక్తి జల విద్యుత్తు ద్వారా వచ్చింది అనుకుందాము.ఇది ఆనకట్టకు అటువైపున ఎక్కువ ఎత్తులో వున్ననీరు సొరంగం గుండా దూకుతున్న క్రమంలో ఎలెక్ట్రిక్ జెనరేటర్లో నుండి విద్యుచ్చక్తి వచ్చింది.అంటే నీటి యాంత్రిక శక్తి మనకు విద్యుచ్చక్తిగా మారింది.నీటికి యాంత్రిక శక్తి అక్కడ నీరు ఎత్తుగా వుండటం వలన వచ్చింది.ఆ నీరు వర్షాల వలన  వచ్చాయి.వర్షాలు  మేఘాలనుంచి   వచ్చాయి.మేఘాలు సముద్రపు నీరు ఆవిరి కావడం వలన  ఏర్పడ్డాయి.సముద్రపు నీరు సూర్యుని వేడి వలన ఆవిరయ్యింది.సూర్యునిలో వేడి అక్కడ జరిగే కేంద్రక సంలీన చర్య వలన ఉద్భవించింది.ఇది కేంద్రక శక్తి కాబట్టి  మన ఇంట్లోని బల్బు కాంతి శక్తి వెనుక ,పరోక్షంగా సూర్యునిలో జరిగే కేంద్రక చర్య ద్వారా విడు దలైన కేంద్రక శక్తి వుంది.ఈ విధం గా పై నియమాన్ని వివరించవచ్చు.
                                                                                                                                                                                                           
                                                                                                                                                                                            
                                                                                                                                                                                                                       





Thursday, 3 May 2012

ప్రకృతి సూత్రాలు: 5 వ సార్వత్రిక నియమము


 విశ్వం క్రమబద్దంగా వుంది.కాబట్టి దాన్ని సంపూర్ణం గా అధ్యయనం చేయవచ్చును 
(The Universe is Regular and is hence predictable).
            విశ్వం అనుక్షణం మారుతుంది . మార్పులో క్రమత్వం వుంది.కాబట్టి దాని గురించి పరిశోధించి నిజాలు తెలుసుకునేందుకు ఆస్కారముంది. నియమ నిబంధనలు లేక పోతే విశ్వంలో దేన్నీ గురించి తెలుసు కోవటం వీలు కాదు.విజ్ఞాన శాస్త్రసారమంతా విశ్వపు సౌష్టవాన్ని గురించి పూర్తి సమాచారం రాబట్టాలనే ప్రయత్నమే!
           నియమాల ద్వారానే విశ్వం 1500  కోట్ల సం:క్రితం బిగ్ బాంగ్ ద్వారా నేడున్న విశ్వరూపంలో పుట్టిందని అది క్రమేపీ విస్తరిస్తూ అన్ని వైపులా సమానమైన విధంగా వెళ్తోందని తెలుస్తోంది.విశ్వం క్రమత్వానికి కారణం పదార్థ లక్షణం లోని క్రమత్వమే!విశ్వంలో క్రమత్వం ఆధారంగానే విశ్వం ఆవిర్భావాన్ని అంచనా వేస్తున్నారు.గేలక్సీలలోని క్రమత్వా న్నిబట్టి సౌరమండలాన్ని పరిశీలించవచ్చు. సౌరమండలంలోని క్రమత్వాన్ని బట్టే ఎప్పుడు గ్రహణాలొస్తున్నాయో ఖచ్చితంగా తెలుసుకుంటున్నాము.భూమిలోని క్రమత్వం ఆధారంగానే రుతువులు,రేయింబవళ్ళు,ఉష్ణోగ్రతా వ్యత్యా సాలను అంచనా వేస్తున్నారు.బంగారంలోని క్రమత్వమే దాని అరుదైన ప్రకృతి స్థిరతకు చిహ్నం.మానవ శరీర నిర్మాణం అందరిలోనూ అదే క్రమంలో వుంటుంది.కాబట్టే వైద్యం చేయగలుగుతున్నారు.