మన భూమి వయస్సు 500 కోట్ల సంవత్సరాలుగా పరిగనిస్తారు.మొదటి 100 కోట్ల సంవత్సరాలు విపరీతమైన ఉష్ణోగ్రత వలన భూమి మరుగుతున్న ద్రవం గా ఉండటం వలన అప్పటి ఆనవాళ్ళేమీ శిలా జాల రూపం లో ఏర్పడక పోవటం తో భూమి చరిత్రకు ఆనవాళ్ళేమీ లేవు.మొదటగా 400 కోట్ల సం :క్రితం నీటిలో జీవం ఆవిర్భవించిందని కనుగొన్నారు.ఈ పరిణామ క్రమంలో భూమి మీద మానవ జాతి అవతరిం చి ఇరవై లక్షల సంవత్సరాలయ్యింది..ఇది ఒక ఉన్నత దశ.చేతి వ్రేళ్ళు నాలుగు ఒక వైపు,బొటన వేలు వ్యతిరేక దిశలో మడవ గలిగే నేర్పు వలన పని ముట్ల తయారీ,వాటి వాడకం అబ్బింది.
ఆహారం,రక్షణ ,సంతానోత్పత్తి కోసం పరిసరాలను గమనించటం లో మనిషికి కుతూహలం ,ఆసక్తి కలి గాయి.వాటిని తన జీవన విధానం లో ఆచరిస్తూ ప్రకృతి పట్ల తన అవగాహనను తర్వాతి తరానికి అందిం చాడు .ఇలా పాత తరం అందించిన జ్ఞానం తీసుకొని ప్రతి తరం ప్రాపంచిక ,బౌగోళిక,అంతరిక్ష,ఇతర బౌతిక అంశాల పట్ల సవివరమైన అవగాహన ఏర్పరుచుకున్నాడు.కొన్ని లక్షల సంవత్సరాల పాటు సంపాదించిన ఈ విజ్ఞాన సర్వస్వానికి మానవ జాతి సమిష్టి నిర్మాత.ఇలా సాదిం చుకున్నదే విజ్ఞాన శాస్త్రం ఇందులో భౌతిక శాస్త్రం,రసాయన శాస్త్రం,జీవ శాస్త్రం,ఖగోళ శాస్త్రం,వంటివి ప్రకృతిని వివరించే ప్రధాన విజ్ఞాన శాస్త్రాలు.
ప్రతి శాస్త్రం లోను సూత్రాలు వుంటాయి.ఇవన్నీ ప్రకృతి సూత్రాలే! మనకు కనిపించే ప్రతి సంఘట న,దృగ్విషయానికి ఈ సూత్రాల ఆధారం గా వివరణ ఇవ్వ గలుగుతున్నాము.ఒక శాస్త్రం లోని సూత్రాలు మరో శాస్త్రం లోని సూత్రాలతో వైరుధ్యాన్ని ప్రదర్శించవు.ఈ సూత్రాల సమిష్టి తాత్విక అవగాహనే శాస్త్రీయ దృక్పథం (scientific temper)అంటారు.వీటి గురించి కనీస పరిజ్ఞానం శాస్త్రీయ అవగాహన కోరుకునే వారికి అవసరం.
ఏ సూత్రము లేని పరికరం,శాస్త్రం,సాంకేతిక విధానం వుండవు.ప్రతి వ్యక్తి సైన్సు సాధనాలను వాడక తప్పదు.మనం వాడే ప్రతి వస్తువు t.v,radio,computer,cell phone,current, అన్ని లోహ వస్తువులు ,అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు,చెక్క వస్తువులు,ఇంటి సామాగ్రి,అన్ని రవాణా సాధనాలు,అన్నిపరిశ్రమల యంత్రాలు,ఇలా ప్రతిది శాస్త్ర,సాంకేతిక రంగ ఫలాలే!సైన్సు లేని జీవితాన్ని నేడు ఊహించలేము.
ప్రజలు సైన్సు పరిజ్ఞానాన్ని పొందుటకు ఉత్సాహం చూపటం లేదు.ప్రశ్నించడం సైన్సు కు ప్రధాన లక్షణం.సైన్సు ద్వారా మానవ జీవనం ఎంతో మెరుగుపడింది.భారతదేశం లో ఒకప్పుడు సగటు వయస్సు 30 సం నేడు అది 60 సం పైగా అయింది. information,bio,nano,technology లు ఎంతగానో అభివృద్ది చెందాయి.కొన్ని లక్షల జంతు,వృక్ష జాతుల జీవిత పద్ధతుల్ని అన్వేషించారు.ఆరోగ్యం పై అత్యాధునిక స్థాయి చికిత్సలను అభివృద్ది చేసుకున్నాము.1960 వరకు భూమిపై ఉన్న సహజ,స్వతంత్ర పదార్థాల కన్నా ఈ 44 సం లలోనే మానవుడు ఎక్కువ పదార్థాల్ని సృష్టించాడు.
సమాజాన్ని సైన్సు ప్రభావితం చేసింది,అలాగే సైన్సు ను సమాజం ప్రభావితం చేసింది .సమా జానికి ఆలోచనను,తాత్విక దృష్టిని ఇచ్చింది.తత్వశాస్త్రానికి పరాకాష్ట సత్యాన్వేషణ.ఇది తాత్విక దృష్టి ఉంటే నే వీలవుతుంది .సైన్సు ను అభివృద్ది చేసిన తాత్విక దృష్టి పేరే శాస్త్రీయ పద్ధతి.(method of science) అంటాము.శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలంటే శాస్త్రీయ పద్ధతి గురించి కనీస అవగాహన అవసరం సైన్సు పద్ధతికి,అశాస్త్రీయ పద్ధతికి ప్రధానం గా ఉన్న తేడా రుజువులు.సైన్సు వీటిని ప్రోత్సాహిస్తుంది .అశాస్త్రీయ భావాలు రుజువుల మీద ఆధారపడక గుడ్డిగా నమ్ముతుంటాయి.
ఎక్కువమంది నమ్మినంత మాత్రాన నమ్మకం వాస్తవం కాదు.ఊహల ద్వారా ఏర్పడినవే నమ్మకా లు .ప్రయోగం ద్వారా పరిశీలనలోనే సత్యమేదో తెలుస్తుంది.ఉదాహరణకు బరువైన,తేలికైన రాళ్ళలో బరు వైనదే ముందు పడుతుందని అరిస్టాటిల్,క్రీ పు నాలుగవ శతాబ్దం లో అన్నాడు.క్రీ.శ పదహారవ శతాబ్దం లో గెలేలియో రుజువు చేసే దాకా రెండు రాళ్ళు ఒకేసారి పడతాయని ప్రపంచానికి తెలియదు.శాస్త్రీయ పద్ధతి లోపరిశీలన అనేది మొదటి దశ.దీనిలో ఖాయం చేసుకోవడం కోసం కొలతలు వాడతాము.అలాగే ప్రశ్న రెండోది.ఎందుకు?ఏమిటి?ఎలా?ఎక్కడ?ఎవరు?ఎప్పుడు? అనే జిజ్ఞాసే సైన్సు కు ప్రేరకం.ప్రశ్న లోంచే విజ్ఞానం పుట్టింది.ఈ ప్రశ్న శాస్త్రీయం గా ఉండాలి.(scientific query).మూడో మెట్టు ఊహన!అంతకు ముందు సైన్సు నిరూపించిన సిద్దాంతాలకు సూత్రాలకు ఈ ఊహలను ప్రయోగ పూర్వకంగా తేల్చుకోవాలి బల్ల పరుపు భూమి అనే ఊహనుండి గోలీయ భూమిగా భావించటం సైన్సు లో గొప్ప విజయం.భూమి చుట్టూ గ్రహాలూ,నక్షత్రాలు తిరుగుతాయనే ఊహలకు వ్యతిరేకం గా ఆలోచించిన బ్రునో, హైపెశియా హత్యకు గురికాగా గెలేయియో శిక్షిం పబడ్డాడు..కోపెర్నికాస్ ఎన్నో వేదనలను అనుభవిం చాడు .ఊహించడం మూడవ మెట్టు అయితే ఆ ఊహ తప్పని తేలితే కొత్త ఊహలు చేపట్టాలి.ఆ ఊహను రుజువు చేయడమే సైన్సు పద్ధతిలో అత్యంత కీలక దశ .ప్రయోగం ద్వారా రుజువు కానిదేది సైన్సు పరిధి లోకి రాదు.రుజువు కానిది అశాస్త్రీయం అవుతుంది.
జంతువుల ,పక్షుల దేహ నిర్మాణం లో కోట్ల సం నుంచి స్వల్పం గా మార్పులకు గురి అయ్యాయి.కాని మానవ శరీరం ఈ వేలసం లలోనే అనేక మార్పులకు లోనయింది.మానవుడు తన పరిశీలనలను ప్రయో గం ద్వారా రుజువు చేసుకొనడం వలన ప్రకృతి నియమాలను ఖరారు చేసుకొనడం ద్వారా సైన్సును జీవి త విధానం లోనికి ఇముడ్చు కోగాలిగాడు.
ప్రయోగం ద్వారా రుజువైన తర్వాత మూడవ దశలో పేర్కొన్న నమూనా సిద్ధాంత స్థాయికి చేరుకొ నడం శాస్త్రీయ పద్ధతి.ఇదే చివరి దశ.ఎన్నో సార్లు పరీక్షలకి,పరిశీ లనలకి, సవాళ్ళకు నిలబడి నిలి చేదే ప్రకృతి నియ మం అవుతుంది.సైన్సు లో ఎన్ని వేల సుత్రాలున్న అవన్నీ మౌలికం గా పద్దెనిమిది ప్రాథమిక సూత్రాల సమాహార మని ఆధునిక శాస్త్రజ్ఞులు రుజువు చేసారు.2000 సం ఆరంభం లో అంతర్జా తీయ స్థాయిలో జరిగిన శాస్త్రజ్ఞుల మహా సభలో ఈ సూత్రాలను తీర్మానించారు.వీటిని ప్రశ్నించే పరిశీల నలు,సైన్సు పద్ధతి ద్వారాప్రయోగ పూర్వకం గా మన కు తారస పడే వరకు ఈ సూత్రాలను మనం సత్యా లుగా ఆమోదిస్తాము.వీటినే శాస్త్రజ్ఞులు సమకాలీన శిఖరాగ్ర సూత్రాలుగా భావిస్తారు.ఈ సూత్రాలలో ఏ ఒక్కదాన్ని లేదా కొన్నింటిని లేదా అన్నింటిని ప్రశ్నిం చే విధం గా నమ్మకాలు,ఆచారాలు,విశ్వాసాలు వుంటే అవి అశాస్త్రీయమని సైన్సు పద్ధతి అంటుంది.
ఈ సూత్రా;లతో ప్రతి వాదనను పోల్చుకోవాలి.ఆ వాదన ఈ సూత్రాలను ప్రశ్నించే దైతే రుజువు చేసుకోవాలి.రుజువు చేసుకోలేక పోతే ఆ వాదనను తప్పుగా భావించుకోవాలి.అందుకే 18 ఈ సూత్రాల ను rules of acceceptance గా కాకుండా rules of exclusion గా సైంటిస్ట్ లు పేర్కొంటారు.వీటి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన వుండాలి.ఒక్కొక్క సూత్రాన్నిగురించి తెలుసుకొందాము.